MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-surname-with-movie-namef00931a4-f94d-405d-90a4-68abeb7158ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-surname-with-movie-namef00931a4-f94d-405d-90a4-68abeb7158ff-415x250-IndiaHerald.jpgప్రముఖ టాలీవుడ్ కమెడియన్ చిత్రం శీను సుమారు 300 చిత్రాల్లో నటించారు. ఆయన తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ఆయన బుల్లితెరపై కూడా తన హాస్య నటన తో అలరించారు. జబర్దస్త్ కామెడీ షో లో కొంతకాలం పాటు ఆయన కొనసాగారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో పుట్టిపెరిగిన కమెడియన్ శీను వివేకానంద స్కూల్ లో చదువు పూర్తిచేశారు. అయితే చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన శీను అసలు పేరు పిల్లలమరి శ్రీనివాస్. ఆయన తండ్రి పేరు లక్ష్మీనారాయణ కాగా తల్లి పేరు సుజాత. 2000 సంవcelebrities-surname-with-movie-name{#}Tollywood;Chitram;Cinema;Comedy;Comedian;Jabardasth;Telangana;Khammam;School;Father;Kanna Lakshminarayana;Hero;kiran;AdiNarayanaReddy;Allu Arjun;Taxiwala;Bommarillu;Siddharth;Dubai;Wife;Husband;court;marriageచిత్రం శీను అసలు పేరు తెలిస్తే అవాక్కవుతారు..?చిత్రం శీను అసలు పేరు తెలిస్తే అవాక్కవుతారు..?celebrities-surname-with-movie-name{#}Tollywood;Chitram;Cinema;Comedy;Comedian;Jabardasth;Telangana;Khammam;School;Father;Kanna Lakshminarayana;Hero;kiran;AdiNarayanaReddy;Allu Arjun;Taxiwala;Bommarillu;Siddharth;Dubai;Wife;Husband;court;marriageThu, 08 Jul 2021 10:00:00 GMTటాలీవుడ్ కమెడియన్ చిత్రం శీను సుమారు 300 చిత్రాల్లో నటించారు. ఆయన తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ఆయన బుల్లితెరపై కూడా తన హాస్య నటన తో అలరించారు. జబర్దస్త్ కామెడీ షో లో కొంతకాలం పాటు ఆయన కొనసాగారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో పుట్టిపెరిగిన కమెడియన్ శీను వివేకానంద స్కూల్ లో చదువు పూర్తిచేశారు. అయితే చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన శీను అసలు పేరు పిల్లలమరి శ్రీనివాస్. ఆయన తండ్రి పేరు లక్ష్మీనారాయణ కాగా తల్లి పేరు సుజాత.

2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా శీను నటించి మెప్పించారు. ఆనందం, ఆది చిత్రాల్లో కామెడీ రోల్స్ లో నటించి అలరించారు. 2002లో వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమాలో ఆయన జామపండ్లు విక్రయించే వ్యాపారిగా నటించి కడుపుబ్బా నవ్వించారు. నీ స్నేహం, మల్లేశ్వరి, వెంకీ, బన్నీ వంటి చిత్రాల్లో కూడా ఆయన కమెడియన్ గా నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన గీతాగోవిందం, టాక్సీవాలా చిత్రాల్లో కూడా ఆయన నటించారు. విశ్వదాభిరామా, మాయసభ సినిమాలతో ఆయన హీరోగా మారారు.

బ్లాక్ బస్టర్ హిట్టయిన బొమ్మరిల్లు చిత్రం లో సిద్ధార్థ్ స్నేహితుడిగా శీను నటించారు. దుబాయ్ శీను సినిమా తో కూడా ఆయన మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే శీను సినీకెరీర్ లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోలేదు కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆయన తన మొదటి భార్య వల్ల అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. 2004లో సీరియల్ నటి అయిన ఉమామహేశ్వరిని ఆయన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

ఐతే కొన్ని సంవత్సరాల తర్వాత ఉమామహేశ్వరి తన భర్త తనని మోసం చేశాడని.. తనకి విషమిచ్చి చంపడానికి ప్రయత్నించాడని.. కర్నూల్ కి చెందిన గ్రూపు డ్యాన్సర్ మనీత తో అక్రమ సంబంధం పెట్టుకొని తనని వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. షాకింగ్ విషయం ఏమిటంటే ఉమామహేశ్వరి డాన్సర్ మనీతను కోర్టు ముందే జుట్టు పట్టుకొని కొట్టింది. కొద్ది నెలల తర్వాత చిత్రం శ్రీను, ఉమామహేశ్వరి విడాకులు తీసుకున్నారు. అయితే ఆయన 2011, 5వ తేదీన మనీతను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు జ్ఞానేశ్వరి అనే బిడ్డ పుట్టింది.


అల్లరి సినిమాతో పరిచయమై అల్లరి నరేష్ గా ఎదిగిన హీరో..!!

సుమంత్ ఈ సారైనా హీరోగా నిలదొక్కుకుంటాడా..?

వైసీపీలో ఎమ్మెల్సీ కోసం తండ్రి కొడుకుల ఫైట్ ?

అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి మొత్తం మార్చాల్సిందే..!

చిత్రం శీను అసలు పేరు తెలిస్తే అవాక్కవుతారు..? ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరి లో చూడండి.

నేడే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. !

పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్.. !

రక్త సంబంధీకులే కాలయములైతే.. చివరికి..?

రాధేశ్యామ్ ను వెంటాడుతున్న చక్రం చేదు జ్ఞాపకాలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>