రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. మళ్ళీ ఇండియాకు టెన్షన్ .. తాజా పరిస్థితి ఇదే !!

గత 24 గంటల్లో 45,892 కరోనా కొత్త కేసులు, 817 మరణాలు

భారతదేశంలో గత 24 గంటల్లో కరోనావైరస్ మహమ్మారి బారిన 45,892 మంది పడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక తాజాగా నిన్న ఒక్క రోజులో 817 కొత్త మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. దీనితో, భారతదేశం యొక్క మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557 కు పెరిగింది . ఇక తాజాగా నమోదైన 817 మరణాలతో కలిపి, మొత్తం మరణాల సంఖ్య 405,028 కు పెరిగింది.

4.60 లక్షల యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,60,704 గా ఉంది . 1.50% వరకు పెరిగిందని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. గత 24 గంటల్లో 44,291 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో రికవరీల కంటే నమోదైన కేసులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,98,43,825 గా ఉందని తెలుస్తుంది. గత 24 గంటల్లో 19,07,216 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

వారపు పాజిటివిటీ రేటు 2.37 శాతం

దేశం యొక్క వారపు పాజిటివిటీ రేటు 2.37 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.42 శాతంగా ఉంది. ఇది వరుసగా 17 వ రోజు 3% కన్నా తక్కువ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెరిగిందని ఇప్పటివరకు 42.52 కోట్ల పరీక్షలు జరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 36,48,47,549 కు చేరుకోగా, 33,81,671 మందికి గత 24 గంటల్లో టీకాలు వేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ .. త్వరలోనే థర్డ్ వేవ్ ..దేశానికి భయం

కరోనా సెకండ్ వేవ్ కాస్త తగినట్లుగా కనిపిస్తున్న కారణంగా ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ఊహాగానాలు ఇప్పటికే చెలరేగుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదుకావడం సైతం ఆందోళన కలిగిస్తుంది. ఏదిఏమైనప్పటికీ కరోనా నుండి ఇప్పుడే బయటపడినట్లు కాదని పదే పదే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ ,మాస్కులు ధరిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తుంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తే థర్డ్ వేవ్ ముప్పు నుండి కాస్త ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *