MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-52e3d14be-387c-428d-ae51-d78a87ff8e6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-52e3d14be-387c-428d-ae51-d78a87ff8e6a-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. తెలుగులోకి బిగ్ బాస్ షో వ‌స్తున్న‌ప్పుడు ఇక్క‌డ సక్సెస్ అవుతుందా ? అన్న అంచ‌నాలు ఉన్నాయి. అలాంటి అనుమానాలు ప‌టా పంచ‌లు చేస్తూ నాలుగు సీజ‌న్లు స‌క్సెస్ గా పూర్తి చేసుకుంది. ఇక ఆగ‌స్టులో బిగ్ బాస్ 5వ సీజ‌న్ ప్రారంభ‌మైంది. తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయ‌డంతో పాటు దుమ్ము రేపేశాడు. అదిరిపోయే రేటింగ్ వ‌చ్చింది. యంగ్ టైగ‌ర్ బిగ్ బాస్ షోను తెలుగు ప్ర‌జ‌ల‌కు వెంట‌నే క‌నెక్ట్ చేసి ప‌డేశాడు. Bigg Boss 5{#}Bigboss;Josh;Success;Akkineni Nagarjuna;NTR;Telugu;Naniబిగ్‌బాస్ 5 బ‌డ్జెట్ డ‌బుల్ అయిపోయింది ..!బిగ్‌బాస్ 5 బ‌డ్జెట్ డ‌బుల్ అయిపోయింది ..!Bigg Boss 5{#}Bigboss;Josh;Success;Akkineni Nagarjuna;NTR;Telugu;NaniThu, 08 Jul 2021 09:18:46 GMTతెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. తెలుగులోకి బిగ్ బాస్ షో వ‌స్తున్న‌ప్పుడు ఇక్క‌డ సక్సెస్ అవుతుందా ? అన్న అంచ‌నాలు ఉన్నాయి. అలాంటి అనుమానాలు ప‌టా పంచ‌లు చేస్తూ నాలుగు సీజ‌న్లు స‌క్సెస్ గా పూర్తి చేసుకుంది. ఇక ఆగ‌స్టులో బిగ్ బాస్ 5వ సీజ‌న్ ప్రారంభ‌మైంది. తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయ‌డంతో పాటు దుమ్ము రేపేశాడు. అదిరిపోయే రేటింగ్ వ‌చ్చింది. యంగ్ టైగ‌ర్ బిగ్ బాస్ షోను తెలుగు ప్ర‌జ‌ల‌కు వెంట‌నే క‌నెక్ట్ చేసి ప‌డేశాడు.

ఆ త‌ర్వాత రెండో సీజ‌న్‌కు నేచుర ల్ స్టార్ నాని హోస్ట్‌గా వ‌చ్చాడు. నాని ఎన్టీఆర్ అంత జోష్‌తో హోస్ట్ చేయ‌క‌పోయినా ప‌ర్వాలేద‌నిపించాడు. ఆ త‌ర్వాత మూడు, నాలుగు సీజ‌న్ల‌కు వ‌రుస‌గా నాగార్జున హోస్ట్ గా ఉన్నాడు. నాగ్ కూడా వీకెండ్ వ‌చ్చే స‌రికి షోకు మాంచి జోష్ నింపేవాడు. అయితే నాలుగో సీజ‌న్ల‌కు ఎంచుకున్న కంటెస్టెంట్ల‌కు జ‌నాల్లో క్రేజ్ లేక‌పోవ‌డం మాత్రం షోకు బిగ్ మైన‌స్ అయ్యింది. అయితే ఈ సారి ఆ మిస్టేక్‌ను క‌రెక్ట్ చేయాల‌ని షో నిర్వాహ‌కులు ప్లాన్ చేస్త‌న్నారు.

ఈ సారి షోలో అదిరిపోయే గ్లామ‌ర్ ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక మీడియాకు చెందిన యాంక‌ర్లు, సీరియ‌ల్స్ న‌టులు, అవుట్ డేటెడ్ హీరోయిన్లు ఇద్ద‌రు ఇలా ఈ సారి షోలో జ‌నాల‌కు తెలిసిన మొహాలే ఎక్కువుగా ఉంటాయ‌ని తెలుస్తోంది. అయితే అందుకు త‌గిన‌ట్టుగానే బ‌డ్జెట్‌ను డ‌బుల్ చేసేశార‌ట‌. ఈ సారి షో నిర్వాహ‌కుల టార్గెట్ బిగ్ బాస్ - 4కు మించిన టీఆర్పీ రేటింగులు రాబ‌ట్టు కోవ‌డ‌మే అట‌.. ! అందుకే పేరున్న కంటెస్టెంట్ల కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌.

ఈ సారి టాస్క్‌లు కూడా గ‌తంలో కంటే చాలా వైవిధ్యంగా ఉంటాయంటున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఇద్ద‌రు డైరెక‌ర్ట‌ర్ల‌తో క్రియేటివిటీగా టాస్క్‌లు రూపొందిస్తున్నార‌ట‌. మ‌రి బిగ్ బాస్ 5వ సీజ‌న్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ?  చూడాలి.



బిగ్‌బాస్ 5 బ‌డ్జెట్ డ‌బుల్ అయిపోయింది ..!

జలజగడంలో జగన్ మౌనం.. ఏపీకి తీరని నష్టం..

బుడ్డోడు చేతిలో దెబ్బలు తిన్న ఎన్టీఆర్..కారణం ?

చెర్రీ 15కు శంక‌ర్ రెమ్యున‌రేష‌న్ వింటేనే క‌ళ్లు తిరుగుతున్నాయ్ ?

కృతి శెట్టికి మరో లక్కీ ఛాన్స్..!

రామ్ చరణ్ డేట్ కి వెళ్ళింది ఎవరితోనో తెలుసా ?

భారీగా పారితోషికం పెంచిన తేజ..!

లారెన్స్‌కు మాస్ సినిమా డైరెక్ష‌న్ ఛాన్స్ వ‌ర్షం వ‌ల్లే వ‌చ్చిందా.. ఆ ట్విస్ట్ ఇదే...!

నాని.. రవితేజ.. సొంత కథలు మొదలుపెట్టారట..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>