Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan686fbfab-630c-4129-a65a-f1ea465524af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan686fbfab-630c-4129-a65a-f1ea465524af-415x250-IndiaHerald.jpgఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. జనసేన ఒంటరిగా ఉన్నప్పుడే కాదు బీజేపీతో కలిసి నడుస్తున్నప్పుడు కూడా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ . జగన్ ప్రభుత్వ తీరును ఎన్ని సార్లు ఖండిస్తూ వచ్చారు. అయితే ఇటీవల తెలంగాణలో జగన్ చెల్లెలు వైయస్ షర్మిల కొత్త పార్టీని స్థాపించారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అంటూ ఆ పార్టీకి నామకరణం చేశారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తాను అంటూ ప్రకటించారు. అయితPawan{#}Jagan;Janasena;kalyan;Sharmila;Telangana;CM;YCPజగన్ పై తిట్లు.. షర్మిలపై ప్రశంసలు.. అదిరిందయ్యా పవన్?జగన్ పై తిట్లు.. షర్మిలపై ప్రశంసలు.. అదిరిందయ్యా పవన్?Pawan{#}Jagan;Janasena;kalyan;Sharmila;Telangana;CM;YCPThu, 08 Jul 2021 16:45:00 GMTఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు.  జనసేన ఒంటరిగా ఉన్నప్పుడే కాదు బీజేపీతో కలిసి నడుస్తున్నప్పుడు కూడా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ .  జగన్ ప్రభుత్వ తీరును ఎన్ని సార్లు ఖండిస్తూ వచ్చారు. అయితే ఇటీవల తెలంగాణలో జగన్ చెల్లెలు వైయస్ షర్మిల కొత్త పార్టీని స్థాపించారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అంటూ ఆ పార్టీకి నామకరణం చేశారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తాను అంటూ ప్రకటించారు.



 అయితే ఇక జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే పవన్ ఇప్పటి వరకు మాత్రం షర్మిల పార్టీపై స్పందించలేదు. ఇక ఇటీవల షర్మిల పార్టీపై ఇక పవన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. తెలంగాణలో షర్మిల పార్టీ స్థాపించి దానికి స్వాగతం పలుకుతున్నట్లు పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యం లో కొత్త పార్టీలు రావాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి వారిని గుర్తించి మద్దతు ఇస్తాం అంటూ తెలిపారు. రాజకీయ వారసత్వం తో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి వస్తే ప్రస్తుత రాజకీయాల్లో సమూల మార్పులు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.




 అయితే ఇటీవల షర్మిల పార్టీ పై పవన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఓవైపు ఏపీలో  వైసీపీ ని సీఎం జగన్ ను ఏకి పారేసే పవన్ కళ్యాణ్ అటు తెలంగాణ విషయానికి వచ్చే సరికి మాత్రం జగన్ చెల్లెలు షర్మిల పార్టీని స్వాగతిస్తున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే..  పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ బీజేపీతో కలిసి నడుస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం  జనసేనకు బిజెపికి పొత్తు లేదు అంటూ స్పష్టం చేసింది తెలంగాణ బిజెపి. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విషయంలో పవన్ సానుకూలత చూస్తుంటే రానున్న రోజుల్లో షర్మిల పార్టీతో ఇక  జనసేన ని కలిసి ముందుకు నడిచే అవకాశం కూడా లేకపోలేదు అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.  ఏం జరుగుతుందో చూడాలి మరి.



ఈ విషయం జీవితంలో ఎవరూ ఊహించలేదు!

వైఎస్ఆర్ సంక్షేమ సంతకం ఎప్పటికీ రోల్ మోడల్!

హరిహర వీరమల్లు' ఔట్.. 'అయ్యప్పనున్ కోషియం' రీమేక్ ఇన్..!!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

మాటకు ప్రాణమిచ్చే వాళ్లు, మాట్లాడక పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు!

ఇది కచ్చితంగా దైవ నిర్ణయమే!

షర్మిల వల్లే బంగారు తెలంగాణ!

జగన్ వద్దన్నా షర్మిల పార్టీ పెట్టారు.. సజ్జల షాకింగ్ కామెంట్స్?

చంద్రబాబు.. అప్పుడేమైనా గాడిదలు కాసారా : జగన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>