MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shavukaru-janaki292a0540-eeb9-4789-a311-811598de4cd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shavukaru-janaki292a0540-eeb9-4789-a311-811598de4cd6-415x250-IndiaHerald.jpgకొన్ని సినిమాలు సదరు నటుడికి ఎంతలా కనెక్ట్ అవుతాయి అంటే ఆ సినిమాతో వారికి ఎనలేని బంధం ముడిపడి ఉంటుంది. ఆ విధంగా శంకరమంచి జానకి షావుకారు అనే సినిమాతో ఎంతో అనుబంధం నెలకొంది. ఆమెను ఇప్పటికీ శంకరమంచి జానకి అనీ ఎవరు పిలవరు షావుకారు జానకి అనే పిలుస్తారు. అంతలా ఆ సినిమా ప్రభావం ఆమెపై ఉంది. తెలుగు తమిళ కన్నడ భాషల్లో 375 పైగా సినిమాల్లో నటించిన ఈమె 200కు పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది.shavukaru janaki{#}maruti;sowkar janaki;Chatrapathi Shivaji;Sivaji;Rojulu Marayi;Kannada;CBN;Doctor;Yevaru;Heroine;Chitram;Cinema;Venkatesh;Teluguజానకి కాదు.. షావుకారు జానకి.. ఆ సినిమా ఆమె పేరు నే ఇలా మార్చేసింది!!జానకి కాదు.. షావుకారు జానకి.. ఆ సినిమా ఆమె పేరు నే ఇలా మార్చేసింది!!shavukaru janaki{#}maruti;sowkar janaki;Chatrapathi Shivaji;Sivaji;Rojulu Marayi;Kannada;CBN;Doctor;Yevaru;Heroine;Chitram;Cinema;Venkatesh;TeluguThu, 08 Jul 2021 12:00:00 GMTకొన్ని సినిమాలు సదరు నటుడికి ఎంతలా కనెక్ట్ అవుతాయి అంటే ఆ సినిమాతో వారికి ఎనలేని బంధం ముడిపడి ఉంటుంది. ఆ విధంగా శంకరమంచి జానకి షావుకారు అనే సినిమాతో ఎంతో అనుబంధం నెలకొంది. ఆమెను ఇప్పటికీ శంకరమంచి జానకి అనీ ఎవరు పిలవరు షావుకారు జానకి అనే పిలుస్తారు. అంతలా ఆ సినిమా ప్రభావం ఆమెపై ఉంది. తెలుగు తమిళ కన్నడ భాషల్లో 375 పైగా సినిమాల్లో నటించిన ఈమె 200కు పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

రేడియో నాటికల ద్వారా తన సినీ కెరీర్ను ప్రారంభించిన ఈమె ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ గణేషన్ సరసన కథానాయిక గా నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు. ప్రముఖ హీరోయిన్ కృష్ణ కుమారి కూడా ఈమె చెల్లెలు కావడం గమనార్హం. నటిగా ఆమె చేసిన షావుకారు చిత్రం పేరే ఆమెకు ఇంటిపేరు అయింది. విజయ ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా 1950 లో రాగా అంతకుముందు ఒకటి అర సినిమాల్లో నటించిన కూడా ఆమెకు అంతగా పేరు రాలేదు. 1949లో రక్షరేఖ అనే సినిమాలో నటించింది.

అనేక పురస్కారాలు పొందిన షావుకారు జానకి చేసిన సినిమాలలో డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి అనే సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమె వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన బాబు బంగారం, గోపీచంద్ కథానాయకుడిగా వచ్చిన సౌఖ్యం వంటి సినిమాల్లో నటించి ఇప్పటి తరం ప్రేక్షకులను కూడా అలరించింది. జాతీయ ఫిల్మ్ అవార్డులకు తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసిన ఈమె సత్యసాయిబాబా భక్తురాలు. మరి గతంలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేస్తారా చూడాలి. 





రాజమౌళి ఈగతోనే సినిమా ఎందుకు తీసారో తెలుసా..??

బెల్లంకొండ శ్రీనివాస్ వల్ల కావడంలేదట!!1

చిరంజీవి సినిమా తోనే ఈయన కెరీర్ దెబ్బ తిందా..

శంకర్ కూతురి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా..?

మీడియం రేంజ్ హీరోలకు మొదలైన ఎదురీత !

కృష్ణ, పూరీ ల సినిమా కాంబో వచ్చుంటే ఎలా ఉండేదో?

ఆహుతి సినిమా తో ఆహుతి ప్రసాద్ గా మారిన జనార్ధన వరప్రసాద్!!

జ‌గ‌న్‌పై వీళ్లంతా ర‌గులుతున్నారుగా.. స‌ర్కార్‌కు పెద్ద దెబ్బే ?

సినిమా టైటిల్‌ని ఇంటిపేరుగా మార్చుకున్న స్టార్ కమెడియన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>