Union Cabinet Meet: కేంద్ర కొత్త కేబినెట్ కీలక నిర్ణయాలు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడి

Union Cabinet Meet: కేంద్రంలో కొత్త కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త కేబినెట్ ఆధ్వర్యంలో ఏర్పడిన తొలి మంత్రిత్వ భేటీలో తీసుకున్న నిర్ణయాల్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు. 

కేంద్రంలో ఏర్పడిన కొత్త కేబినెట్ ప్రధాని మోదీ(Pm Modi) అధ్యక్షతన తొలిసారిగా భేటీ అయింది. వ్యవసాయం, ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఎమర్జెన్సీ నిమిత్తం 23 వేల 123 కోట్లను కేటాయించాలని కేబినెట్(Union Cabinet) నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో పిల్లల కోసం చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా(Mansukh mandviya) తెలిపారు. దేశంలో కొత్తగా 20 వేల ఐసీయూ బెడ్స్ అందుబాటులో వచ్చాయన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4 లక్షల 17 వేల 396 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు. జిల్లా స్థాయిలో 10 వేల లీటర్ల ఆక్సిజన్ నిల్వ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. టెలి మెడిసిన్ ద్వారా వైద్యం అందించేందుకు చర్యల్ని వేగవంతం చేశామన్నారు. 

వ్యవసాయరంగానికి సంబంధించి లక్ష కోట్ల నిధుల్ని కేటాయించామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్(Narendra singh tomar) తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాల అమలులో భాగంగా వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఏపీఎంసీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తోమర్ చెప్పారు. రైతుల మౌలిక సౌకర్యాల నిధిని ఏపీఎంసీలు వినియోగించుకోవచ్చని నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. 

Also read: Corona Positive Cases: ఇండియాలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link – https://bit.ly/3hDyh4G

Apple Link – https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More | https://zeenews.india.com/telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *