MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhan34166580-d7ca-4c89-b444-35146dd93ea4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhan34166580-d7ca-4c89-b444-35146dd93ea4-415x250-IndiaHerald.jpgపాత రోజుల్లో మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా వచ్చేవి. నాటి హీరోల మధ్య మంచి సఖ్యత ఉండేది. కధను బట్టే పాత్రలు చేసేవారు. ఎవరి ఇమేజ్ ఏంటి అన్నది చూసుకోకుండా నిర్మాత, డైరెక్టర్ ని చూసి కాల్షీట్లు ఇచ్చేవారు. దాంతో అప్పట్లో టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ చాలానే వచ్చేవి. sobhan{#}sobhan babuఆ మూవీతో మళ్టీస్టారర్ వద్దు అనుకున్న శోభన్... ?ఆ మూవీతో మళ్టీస్టారర్ వద్దు అనుకున్న శోభన్... ?sobhan{#}sobhan babuThu, 08 Jul 2021 20:00:00 GMTపాత రోజుల్లో మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా వచ్చేవి. నాటి హీరోల మధ్య మంచి సఖ్యత ఉండేది. కధను బట్టే పాత్రలు చేసేవారు. ఎవరి ఇమేజ్ ఏంటి అన్నది చూసుకోకుండా నిర్మాత, డైరెక్టర్ ని చూసి కాల్షీట్లు ఇచ్చేవారు. దాంతో అప్పట్లో టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ చాలానే వచ్చేవి.

ఎన్టీయార్, ఏయన్నార్ కలసి పద్నాలుగు మూవీస్ లో నటించారు అంటే ఎవరైనా నమ్మాల్సిందే. ఇక తరువాత తరం హీరోలు క్రిష్ణ శోభన్ బాబు కూడా పది సినిమాలకు తక్కువ కాకుండానే చేశారు. ఈ ఇద్దరు సినిమా చేస్తే సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ కూడా ఉండేది. ఇదిలా ఉంటే డెబ్బై ఎనభై దశకంలో ఈ హీరోలు కలసి పుట్టినిల్లు మెట్టినిల్లు, మండెగుండెలు, ముందడుగు, ఇద్దరు దొంగలు వంటి సూపర్ హిట్స్ చేశారు.

ఆ తరువాత 1985లో వచ్చిన చిత్రం మహా సంగ్రామం. చిరంజీవితో ఖైదీ సినిమా తీసిన నిర్మాతలే ఈ సినిమాకు కూడా ప్రొడ్యూసర్స్. ఇక ఖైదీ డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నిజానికి ఖైదీ మూవీ  క్రిష్ణ చేయాలి. ఆయన కుదరక‌ వదిలేసుకున్నారు. దాంతో ఆయనతో సినిమా చేయాలని పట్టుబట్టి ఆ నిర్మాతలు  చేసిన సినిమా ఇది. ఇక భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో జయసుధ, జయప్రద హీరోయిన్లు.

ఈ సినిమాలో క్రిష్ణ, శోభన్ బాబులకు కధ ముందే కధ చెప్పి సినిమా తీసినా కూడా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే క్రిష్ణ క్యారక్టర్ ఈ మూవీలో ఎక్కువగా ఉంటుంది. పైగా పవర్ ఫుల్ క్యారక్టర్ గా డిజైన్ చేశారు. దాంతో థియేటర్లలో శోభన్ ఫ్యాన్స్ గోల చేసి రచ్చ చేశారు. తమ హీరోకు అన్యాయం జరిగింది అని వారు మండిపోయారు. దాంతో శోభన్ కూడా ఈ మూవీ విషయంలో కొంత మధన పడ్డారని చెబుతారు. అప్పటికే శోభన్, క్రిష్ణ ఇద్దరూ టాప్ స్టార్స్ గా ఉన్నారు. మరి శోభన్ ఇమేజ్ ని తగ్గించేలా మూవీ ఉందని రివ్యూస్ కూడా రావడంతో శోభన్ బాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారుట. ఇక మీదట మల్టీ స్టారర్ మూవీస్ ని చేయకూడని. ఆ తరువాత మరో పదేళ్ల పాటు హీరోగా సినిమాలు చేసిన శోభన్ మళ్ళీ మల్టీ స్టారర్ మూవీస్ జోలికి పోలేదు అంటే మహాసంగ్రామం టైటిల్ కి తగినట్లుగానే సంగ్రామమే సృష్టించింది అనుకోవాలి.





పాత రోజుల్లో మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా వచ్చేవి. నాటి హీరోల మధ్య మంచి సఖ్యత ఉండేది. కధను బట్టే పాత్రలు చేసేవారు. ఎవరి ఇమేజ్ ఏంటి అన్నది చూసుకోకుండా నిర్మాత, డైరెక్టర్ ని చూసి కాల్షీట్లు ఇచ్చేవారు. దాంతో అప్పట్లో టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ చాలానే వచ్చేవి.

చంద్ర మోహన్ కూతుళ్లు ఏం చేస్తారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>