NRISuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/spelling-bee134777e9-f2c9-48cc-ad3a-41ea1880a2fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/spelling-bee134777e9-f2c9-48cc-ad3a-41ea1880a2fc-415x250-IndiaHerald.jpgఈరోజు అనగా జులై 8వ తేదీన "2021 స్ర్కిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ" ఫైనల్ రౌండ్ అమెరికాలోని ఫ్లోరిడా లోని ఒర్లాండోలో జరగనుంది. అయితే ఈ స్పెల్లింగ్‌-బీ పోటీలకు మంచి గుర్తింపు ఇవ్వాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే జో బైడెన్ భార్య, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఫైనల్స్‌కు అతిథిగా హాజరవుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ సంవత్సరం 11 మంది ఫైనలిస్టులలో తొమ్మిది మంది భారత సంతతికి చెందిన పిల్లలే ఉన్నారు. వాల్ట్ డిస్నీ రిసార్ట్‌లోని 'ఈఎస్పిఎన్ వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌'లో spelling bee{#}Florida;Government;American Samoa;Jil;white house;Andhra Pradesh;akash;Qualification;sruthi;Shruti;bhavana;Kamma;San Franciscoనేడు భారతీయ పిల్లలను కలవనున్న జో బైడెన్ భార్య..?నేడు భారతీయ పిల్లలను కలవనున్న జో బైడెన్ భార్య..?spelling bee{#}Florida;Government;American Samoa;Jil;white house;Andhra Pradesh;akash;Qualification;sruthi;Shruti;bhavana;Kamma;San FranciscoThu, 08 Jul 2021 09:00:00 GMTఈరోజు అనగా జులై 8వ తేదీన "2021 స్ర్కిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ" ఫైనల్ రౌండ్ అమెరికాలోని ఫ్లోరిడా లోని ఒర్లాండోలో జరగనుంది. అయితే ఈ స్పెల్లింగ్‌-బీ పోటీలకు మంచి గుర్తింపు ఇవ్వాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే జో బైడెన్ భార్య, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఫైనల్స్‌కు అతిథిగా హాజరవుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ సంవత్సరం 11 మంది ఫైనలిస్టులలో తొమ్మిది మంది భారత సంతతికి చెందిన పిల్లలే ఉన్నారు. వాల్ట్ డిస్నీ రిసార్ట్‌లోని 'ఈఎస్పిఎన్ వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌'లో స్పెల్లింగ్‌-బీ ఫైనల్స్ ప్రారంభమయ్యే ముందు విద్యావేత్త జిల్ బైడెన్ 11 మంది ఫైనలిస్టులు, వారి కుటుంబాలను కలవనున్నారని అధికారులు ప్రకటించారు.



అయితే ఈ స్పెల్లింగ్ బీ పోటీలలో ఎక్కువగా భారతీయులే సత్తా చాటుతుంటారు. 2011 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ మూలాలున్న ఆరేళ్ల ఆకాష్ ఉకోటి స్పెల్లింగ్-బీ పోటీలను గడగడలాడించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల పర్యవేక్షణలో, గైడెన్స్ లో ఎంతో క్రమశిక్షణగా పెరిగి చిన్నతనం నుంచే మేధావులుగా మారుతున్న భారతీయ చిన్నారులు స్పెల్లింగ్ బీ వంటి పోటీలలో పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పోటీలలో చాలా మంది భారతీయులే చాంపియన్లుగా నిలిచారు. ఈసారి కూడా స్పెల్లింగ్ బీ ఫైనల్స్‌కు అర్హత సాధించిన 11 మందిలో 9 మంది భారతీయ పిల్లలే ఉండటం విశేషం. అమెరికా దేశంలోని టాప్ స్కూల్స్ నుంచి లక్షల మంది మేధావులు ఈ పోటీలలో పాల్గొంటారు. లక్షల మంది తెలివైన పిల్లలను దాటుకొని ఫైనల్స్‌కు రావడం మామూలు విషయం ఏమీ కాదు. వన్య శివశంకర్, వెంకట చలం, శృతి పదయ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది బాల మేధావులు స్పెల్లింగ్ బీ పోటీలలో తమ ప్రతిభను చాటారు.



ఇక ఈసారి ఫైనలిస్టుగా ఉన్న 11 మంది పేర్లు తెలుసుకుంటే.. నాసావు, ది బహామాస్ నుంచి రాయ్ సెలిగ్మాన్(12)న్యూయార్క్ నుంచి భావన మదిని(13), నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి శ్రీతన్‌ గాజుల(14), వర్జీనియాలోని లీస్‌బర్గ్‌ నుంచి ఆశ్రితా గాంధారి(14), ఇల్లినాయిస్ నుంచి అవని జోషి(13), న్యూ ఓర్లీన్స్‌కు చెందిన జైలా అవంత్ గార్డ్(14), టెక్సాస్‌ నుంచి వివిన్షా వేదురు(10), డల్లాస్ నుంచి ధ్రువ్‌ భారతీయ(12), టెక్సాస్‌ నుంచి విహాన్ సిబల్(12) టెక్సాస్‌ నుంచి అక్షైనీ కమ్మ (13), శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి చైత్రా తుమ్మల(12).



జలజగడంలో జగన్ మౌనం.. ఏపీకి తీరని నష్టం..

థర్డ్ వేవ్: పేరెంట్స్ పిల్లల్ని స్కూల్స్ కు పంపుతారా ?

నేడు భారతీయ పిల్లలను కలవనున్న జో బైడెన్ భార్య..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ ఎన్ఆర్ఐ కేటగిరీలో చూడండి.

కేబినెట్ విస్తరణ సెగలు.. మొహం చాటేసిన సీనియర్లు..

ఓటమి ఎరుగని నేత వైఎస్ఆర్..!

జులై 8: చరిత్రలో ఈ రోజు...

విద్యార్థి నాయకుడి నుండి సేవకుడిగా వైఎస్ఆర్..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ కంచుకోటలో టీడీపీకి ఛాన్స్ దొరుకుతుందా?

మళ్ళీ ధరలు పెంచిన టాటా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>