PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan9e355b6e-ed05-4cb1-8a15-e7ee9af4e535-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan9e355b6e-ed05-4cb1-8a15-e7ee9af4e535-415x250-IndiaHerald.jpgఏపీలో నిరుద్యోగుల పోరాటం తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ పేరిట ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల నుంచి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కానీ తాజాగా జగన్ జాబ్ క్యాలెండర్ వదిలారు. ఇక జాబ్ క్యాలెండర్ వదిలారని సంతోష పడే లోపే, అందులో ఇచ్చిన ఉద్యోగాలని చూసి నిరుద్యోగులు పూర్తిగా నిరాశకు గురయ్యారు. pawan{#}Lokesh;Nara Lokesh;RTC;job;un employment;TDP;YCP;Lokesh Kanagaraj;Pawan Kalyan;Government;Jaganఆ విషయంలో లోకేష్-పవన్‌ల మధ్య పోటీ ఉంటుందా?ఆ విషయంలో లోకేష్-పవన్‌ల మధ్య పోటీ ఉంటుందా?pawan{#}Lokesh;Nara Lokesh;RTC;job;un employment;TDP;YCP;Lokesh Kanagaraj;Pawan Kalyan;Government;JaganThu, 08 Jul 2021 02:00:00 GMTఏపీలో నిరుద్యోగుల పోరాటం తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ పేరిట ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల నుంచి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కానీ తాజాగా జగన్ జాబ్ క్యాలెండర్ వదిలారు. ఇక జాబ్ క్యాలెండర్ వదిలారని సంతోష పడే లోపే, అందులో ఇచ్చిన ఉద్యోగాలని చూసి నిరుద్యోగులు పూర్తిగా నిరాశకు గురయ్యారు.

కేవలం అందులో పది వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఎన్నికల ముందు 2 లక్షలపైనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు పది వేల ఉద్యోగాలు ప్రకటించడంపై నిరుద్యోగులు ఆందోళనలు మొదలుపెట్టారు. అయితే రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ ఉద్యోగాలు వచ్చి.. వాలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు, ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకుని వాటినే చూపిస్తూ ఉద్యోగాలు ఇచ్చేశామని ప్రభుత్వం చెప్పడం చాలా దారుణమని అంటున్నారు.

కీలకమైన పోలీసు, గ్రూప్, డి‌ఎస్‌సి పోస్టులు వదలకుండా ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో నిరుద్యోగులకు టీడీపీ నారా లోకేష్ మద్ధతుగా నిలిచారు. ఇటీవలే టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రద్దు చేసి, 2 లక్షల ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇదే నిరుద్యోగుల సమస్యపై పవన్ కల్యాణ్ సైతం పోరాటం చేసేలా కనిపిస్తున్నారు. చాలారోజుల తర్వాత ఏపీలోకి అడుగుపెట్టిన పవన్‌ని నిరుద్యోగులు కలిసి, తమ పోరాటానికి మద్ధతు ఇవ్వాలని కోరారు. పవన్ సైతం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తూ, నిరుద్యోగులకు అండగా నిలబడతానని చెప్పారు. ఇలా ఓ వైపు లోకేష్, మరో వైపు పవన్‌లు నిరుద్యోగులకు న్యాయం చేయాలనే విషయంపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ పోరాటం వల్ల నిరుద్యోగులకు ఏ మేర లబ్ది చేకూరుతుందో చూడాలి.  





బాబుకు బిగ్గెస్ట్ మైనస్ అదే...మేలుకోపోతే కష్టమే!

మద్యపాన నిషేధంలో జగన్ మరో అడుగు ముందుకేస్తారా?

మళ్ళీ రాజకీయాల వైపు పవన్ అడుగులు.. టెన్షన్ లో నిర్మాతలు..?

వకీల్ సాబ్ సినిమా తర్వాత ఏకంగా నాలుగు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇక అన్ని సినిమాల షూటింగ్లు పూర్తయ్యే విధముగా డేట్స్ కూడా అడ్జెస్ట్ చేసుకున్నాడట పవన్.కానీ అంతలోనే మళ్ళీ ఉన్నట్టుండి జనం మధ్య లోకి వచ్చేసాడు మన జనసేనాని.దీంతో మళ్ళీ నిర్మాతల్లో కంగారు మొదలైంది..

కడప పార్లమెంట్.. ఈ పేరు చెప్పగానే వైఎస్సార్ కుటుంబమే గుర్తొస్తుంది. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే, అక్కడ ఆ పార్టీ సత్తా చాటుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో కడప పార్లమెంట్‌లో టీడీపీ జెండా ఎగరలేదు. కేవలం ఒకే ఒకసారి అంటే 1984లో మాత్రమే కడపలో టీడీపీ గెలిచింది. అక్కడ నుంచి వైఎస్సార్ నాలుగుసార్లు కడప ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు గెలిచారు. జగన్ సైతం 2009లో కాంగ్రెస్ తరుపున కడప ఎంపీగా గెలిచారు.

ఏపీలో నిరుద్యోగుల పోరాటం తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ పేరిట ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల నుంచి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కానీ తాజాగా జగన్ జాబ్ క్యాలెండర్ వదిలారు. ఇక జాబ్ క్యాలెండర్ వదిలారని సంతోష పడే లోపే, అందులో ఇచ్చిన ఉద్యోగాలని చూసి నిరుద్యోగులు పూర్తిగా నిరాశకు గురయ్యారు.

మొదలైన 'ఆచార్య' సందడి.. ఇక తగ్గేదేలే..!!

తెలుగుదేశం పార్టీకి కష్టాలు పోవాలంటే చంద్రబాబు జనంలోకి రావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పొచ్చు. ఆయన ఎంతసేపు ఇంటి దగ్గరే ఉంటూ, జూమ్ యాప్‌కే పరిమితం కావడం పెద్ద మైనస్ అవుతుందని సొంత పార్టీ కార్యకర్తలే భావిస్తున్నారు. అసలు ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు పెద్దగా ప్రజల్లో ఉన్న సందర్భాలు లేవు. ఏదో మొదట్లో కొన్ని రోజులు ప్రజల్లో కనిపించారు.

గత ఎన్నికల ముందు మద్యం వల్ల అనేక కుటుంబాల పడుతున్న బాధని చూసిన జగన్ అధికారంలోకి రాగానే, దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్లకు తాను అండగా నిలబడతానని చెప్పారు. అయితే జగన్ చెప్పిన విధంగానే అధికారంలోకి రాగానే, మద్యపాన నిషేధం హామీపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే బెల్ట్ షాపులు మూయించేశారు. అలాగే మద్యం షాపులని నిర్వహించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. వైన్ షాపులని చాలా వరకు తగ్గించేసింది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>