Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bonalu83b46590-2273-4f15-a88d-66a305e1af4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bonalu83b46590-2273-4f15-a88d-66a305e1af4d-415x250-IndiaHerald.jpgతెలంగాణ అంటే బోనాల పండుగకు పెట్టింది పేరు బోనాల పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ మొత్తం ధూమ్ దాం సందడి నెలకొంటుంది. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు.. ఫలహారం బండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోనాల పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే బోనాల పండుగకు పెట్టింది పేరైన తెలంగాణలో గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఎలాంటి హడావుడి లేకుండా బోనాల పండగ జరిగిపోయింది. మొన్నటివరకు ఇక రాష్ట్రంలో లాక్డౌన్ ఉండటంతో ఈ సారి కూడా బోనాల పండుగ తూతూ మంత్రంగానే జరిగిపోతుందని అనుకున్నారు అందరు కానీ ఇటీవలే లాక్డౌన్ ఎత్తBonalu{#}srinivas;Telangana;festival;Minister;Dhoom;Coronavirusతగ్గేదేలే అంటున్న తలసాని.. బోనాల పండుగపై సమీక్ష?తగ్గేదేలే అంటున్న తలసాని.. బోనాల పండుగపై సమీక్ష?Bonalu{#}srinivas;Telangana;festival;Minister;Dhoom;CoronavirusWed, 07 Jul 2021 18:25:00 GMTతెలంగాణ అంటే బోనాల పండుగకు పెట్టింది పేరు  బోనాల పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ మొత్తం ధూమ్ దాం సందడి నెలకొంటుంది. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు.. ఫలహారం బండ్లు..  ఇలా చెప్పుకుంటూ పోతే బోనాల పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువే  అయితే బోనాల పండుగకు పెట్టింది పేరైన తెలంగాణలో గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఎలాంటి హడావుడి లేకుండా బోనాల పండగ జరిగిపోయింది.  మొన్నటివరకు ఇక రాష్ట్రంలో లాక్డౌన్ ఉండటంతో ఈ సారి కూడా బోనాల పండుగ తూతూ మంత్రంగానే జరిగిపోతుందని అనుకున్నారు అందరు  కానీ ఇటీవలే లాక్డౌన్ ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.



 ఇక బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం  ఇటీవల సిటీ లో బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు  తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు  అయితే తెలంగాణలోని ఎంతో ఫేమస్ అయిన మహంకాళి బోనాల ఉత్సవాలు ఈనెల 25వ తేదీన జరగబోతున్నాయి  ఈ క్రమంలోనే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.



 మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు బోనాలు ఉత్సవాలు జరుపుకునేల చూడాలని సూచించారు. ఇక మాస్కులు శానిటైజర్ లు వాడకం తప్పనిసరిగా ఉండాలి అని.. అందరూ బౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులకు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం పై అటు ప్రతిపక్షాలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.



క్యాబినెట్ లో ప్రమోషన్ దక్కింది వీరికే!

మోడీ లెక్కలు మామూలుగా లేవుగా!

తెలంగాణ ప్రభుత్వం తీరు దురదృష్టకరం : హైకోర్టు

ముందు చిన్న సినిమాలు.. త‌ర్వాత పెద్ద సినిమాలు ఓకేనా?

పవన్ కళ్యాణ్ కన్నా రేవంత్ కే మీడియా క్రేజ్...ఎవరు హీరో??

కిష‌న్‌రెడ్డికి ప‌దోన్న‌తి....?

చైతూ 'లవ్ స్టోరీ' రిలీజ్ కి ముహూర్తం ఖరారు..!!

పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌.

ఏపీ :టెన్త్, ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ ఫలితాలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>