CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-62a623c8-dd1c-44e4-aa0c-1a9a8cdb5a5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-62a623c8-dd1c-44e4-aa0c-1a9a8cdb5a5d-415x250-IndiaHerald.jpgరోజులు మారాయి. మనుషులు కూడా మారుతున్నారు. కన్న బిడ్డలను కూడా కడతేర్చే కసాయిగా మారుతున్నారు. అది టెక్నాలజీ పెరగడమా.. లేకుంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోవడమా.. అసలు ఏం జరుగుతోంది. కన్న తల్లి తన కడుపున మోసిన కన్న కూతురును తన చేతులతో తానే చంపుకునే పరిస్థితికి ఎందుకు దిగజారుతున్నారు. ఆ చిన్ని తల్లి ఏం పాపం చేసింది. ప్రస్తుత కాలంలో మానవ సమాజంలో మనిషికి మనిషికి మధ్య ప్రేమానురాగాలు తగ్గుతున్నాయి. ఎవరు ఎవరిని ఏ విధంగా హత మారుస్తున్నారో కూడా తెలియడం లేదు. తల్లిదండ్రులను కొడుకులు, కొడుకులను తలCrime {#}rani;Pond;Siddipet;Manam;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;mandalam;Yevaruదారుణం :పదేళ్ల కూతురును రోకలి బండతో కొట్టి చంపిన కన్న తల్లి..?దారుణం :పదేళ్ల కూతురును రోకలి బండతో కొట్టి చంపిన కన్న తల్లి..?Crime {#}rani;Pond;Siddipet;Manam;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;mandalam;YevaruWed, 07 Jul 2021 11:05:00 GMTరోజులు మారాయి. మనుషులు కూడా మారుతున్నారు. కన్న బిడ్డలను కూడా కడతేర్చే కసాయిగా మారుతున్నారు. అది టెక్నాలజీ పెరగడమా.. లేకుంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోవడమా.. అసలు ఏం జరుగుతోంది. కన్న తల్లి తన కడుపున మోసిన కన్న కూతురును తన చేతులతో  తానే చంపుకునే పరిస్థితికి ఎందుకు దిగజారుతున్నారు. ఆ చిన్ని తల్లి ఏం పాపం చేసింది.

  ప్రస్తుత కాలంలో మానవ సమాజంలో మనిషికి మనిషికి మధ్య  ప్రేమానురాగాలు తగ్గుతున్నాయి. ఎవరు ఎవరిని ఏ విధంగా హత మారుస్తున్నారో కూడా తెలియడం లేదు. తల్లిదండ్రులను  కొడుకులు, కొడుకులను తల్లిదండ్రులు, భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ఇలా అనేక విధాలుగా నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు. అంటే నేరం చేసే వారికి భయం లేకుండా పోయింది. అది ప్రభుత్వ వైఫ ల్యమా.. చట్టాల వైఫల్యమా  అనేది మనం అర్థం చేసు కోవాల్సిన విషయం. నడిరోడ్డుపై  అందరూ చూస్తుండగా కూడా ఒక మనిషిని ఇంకో మనిషి చంపుతు న్నాడు. ఇలా ఎందుకు జరుగుతోంది. ఈ కన్నతల్లి  నవమాసాలు మోసి పేగు తెంచుకుని పుట్టిన తన కన్న కూతురిని రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత మార్చింది. వివరాల్లోకి వెళితే  అసలు ఆ కన్నతల్లి  తన పదేళ్ళ కూతురును ఎందుకు హతమార్చింది. ఆ పాప ఏం పాపం చేసింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్ చెరువు తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఈ తండాలో భూక్య రాణి అనే ఒక మహిళ  ఈరోజు ఉదయం  తెల్లవారుజామున  తన కన్న కూతురు  భూక్య లావణ్యను ఇంటి పనులు చేస్తుండగా వెనక నుంచి వచ్చి రోకలిబండతో బలంగా నెత్తిపై కొట్టింది. సదరు బాలిక  అక్కడికక్కడే కుప్పకూలిపోయి  మృతి చెందింది. అసలు ఆమె ఎందుకు కొట్టింది. అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కన్న కూతురునే కన్నతల్లి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



మహిళలపై ఇంత హింస పెరిగిందా..?

ఎంఎస్‌ ధోని సాధించిన రికార్డ్స్ ఇవే..!!

మనీ : ఎటువంటి ఖర్చు లేకుండా నెలకు రూ.30 వేల ఆదాయం..

ఇకనుంచి బార్లలో ఉచితంగా లిక్కర్ ఇవ్వనున్నారా..?

శంకర్, రామ్ చరణ్ ల సినిమా పట్టాలెక్కడానికి కారణం అతనే!!

కరోనా తెచ్చిన కష్టం.. ఆకలి బాధతో వేశ్యగా తల్లీకూతుళ్లు?

వైరల్: 20 ఏళ్లకే 12 వరల్డ్ రికార్డులు పొందిన తెలుగు తేజం..

ఈ టీతో అనారోగ్య సమస్యలన్నీ దూరం...

భారత్ - శ్రీలంక సిరీస్ ముంగిట.. లంక బోర్డు కి కొత్త టెన్షన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>