PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradesh6a11f45a-dcb7-4ebb-8502-245a63ab3eec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhrapradesh6a11f45a-dcb7-4ebb-8502-245a63ab3eec-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ మ‌రియు పదోన్నతుల పోస్టింగ్ లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్రకారంగా విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి ఇచ్చారు. రాజ‌కుమారిని దిశ డీఐజిగా ప్రభుత్వం నియ‌మిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిజిపి కార్యాలయంలో ఆమెకు అడ్మిన్ డీఐజిగా కూడా బాధ్యతలు అప్పగించారు. అంతే కాకుండా విజయనగరం ఎస్పీగా ఎం. దీపికను నియ‌మించారు. సీహెచ్ విజయరావును నెల్లూరు ఎస్పీగా ప్ర‌భుత్వం బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎం.రవీంద్రనాథ్ బాబును తూర్పుగోandhrapradesh{#}Bindu;Kumaar;Vidyasagar;bindhu;Guntur;Vijayanagaram;Nellore;East Godavari;Government;commander;krishna district;kusuma jagadish;Paderu;Vizianagaram;Rampachodavaram;Vishakapatnamఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దీలీలు.. !ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దీలీలు.. !andhrapradesh{#}Bindu;Kumaar;Vidyasagar;bindhu;Guntur;Vijayanagaram;Nellore;East Godavari;Government;commander;krishna district;kusuma jagadish;Paderu;Vizianagaram;Rampachodavaram;VishakapatnamWed, 07 Jul 2021 10:50:18 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ మ‌రియు పదోన్నతుల పోస్టింగ్ లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్రకారంగా విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి ఇచ్చారు. రాజ‌కుమారిని దిశ డీఐజిగా  ప్రభుత్వం నియ‌మిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిజిపి కార్యాలయంలో ఆమెకు అడ్మిన్ డీఐజిగా కూడా బాధ్యతలు అప్పగించారు. అంతే కాకుండా విజయనగరం ఎస్పీగా ఎం. దీపికను నియ‌మించారు. సీహెచ్ విజయరావును నెల్లూరు ఎస్పీగా ప్ర‌భుత్వం బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎం.రవీంద్రనాథ్ బాబును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్ గా బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. 

అంతే కాకుండా సిద్ధార్డ్ కౌశల్ ను కృష్ణా జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియ‌మించింది.  మ‌రోవైపు వై.రిశాంత్ రెడ్డికి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అడ్మిన్ గా ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇక ఎస్ .సతీష్ కుమార్ ను స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ నాయుడు ను ఎస్ ఈబి అదనపు ఎస్పీగా స‌ర్కార్ నిర్ణ‌యించింది. గరికపాటి బిందు మాధవ్ ను ఎస్ఈబి అదనపు ఎస్పీ గా బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా తుహిన్ సిన్హా ను ఎస్ ఈ బి అదనపు ఎస్పీ గా బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పి. జగదీష్ ని విశాఖపట్నం జిల్లా, పాడేరు సహాయ ఎస్పీ గా బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోవైపు జి.కృష్ణకాంత్ ను తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ సహాయ ఎస్పీ గా బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇక వి.ఎన్ మణికంఠ ఛందోలు ను విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీ గా బదిలీ చేసింది. కృష్ణకాంత్ పాటిల్ ను తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీ గా బదిలీ చేసింది. తుషార్ దూడి ని విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీ గా ప్ర‌భుత్వం బదిలీ చేసింది. అధికారుల‌ను బ‌దిలీ చేసిన‌ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ జారీ చేశారు.





అసాధ్యమైన రికార్డులు సృష్టించిన దిలీప్ కుమార్..?

ఇకనుంచి బార్లలో ఉచితంగా లిక్కర్ ఇవ్వనున్నారా..?

అక్కడ మొట్ట మొదటిసారిగా మహేష్ షూట్ ..?

ఫోన్ నెంబర్ ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం..!

భారత్ కి ఈ ఘనత అందించిన ఏకైక కెప్టెన్ ధోనీ!!

కరోనాతో దెబ్బతిన్న కేసిఆర్ మెదడు?

జగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?

అందుకే దిలీప్ "ట్రాజెడీ కింగ్" అయ్యారు..!

గర్జించిన భారత ఆర్మీ.. టాప్ కమాండర్ మటాష్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>