MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-agent-movies0e210e4c-8575-4207-8bae-bc90e3d9ffdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-agent-movies0e210e4c-8575-4207-8bae-bc90e3d9ffdf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రేక్షకులు అన్ని రకాల జోనర్ ల సినిమాలు చూడడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఆ విధంగా వారిని ఎంతగానో ఆశక్తి పరిచే జోనర్ హీరోలు ఏజెంట్ ఉన్న సినిమాలు. సీక్రెట్ ఏజెంట్ గా సినిమాలో నటిస్తూ హీరోలు ప్రతినాయకుడి గుట్టును రట్టు చేసే ప్రక్రియ ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ వరకు చాలా మంది హీరోలు ఈ రకం సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించి హిట్ లు అందుకున్నారు. మరి మన హీరోలు చేసిన ఆ సీక్రెట్ ఏజెంట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. tollywood agent movies{#}Pakistan;chanakya-movie-2019;Chanakya;Genre;Research and Analysis Wing;cinema theater;kalyan ram;krishna;ram pothineni;mahesh babu;Audience;Cinema Theatre;Akkineni Nagarjuna;Indian;Success;Darsakudu;Hero;Tollywood;Cinema;Directorసీక్రెట్ ఏజెంట్ పాత్రల్లో అలరించిన స్టార్ హీరోలుసీక్రెట్ ఏజెంట్ పాత్రల్లో అలరించిన స్టార్ హీరోలుtollywood agent movies{#}Pakistan;chanakya-movie-2019;Chanakya;Genre;Research and Analysis Wing;cinema theater;kalyan ram;krishna;ram pothineni;mahesh babu;Audience;Cinema Theatre;Akkineni Nagarjuna;Indian;Success;Darsakudu;Hero;Tollywood;Cinema;DirectorWed, 07 Jul 2021 18:00:00 GMTటాలీవుడ్ ప్రేక్షకులు అన్ని రకాల జోనర్ ల సినిమాలు చూడడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఆ విధంగా వారిని ఎంతగానో ఆశక్తి పరిచే జోనర్ హీరోలు ఏజెంట్ ఉన్న సినిమాలు. సీక్రెట్ ఏజెంట్ గా సినిమాలో నటిస్తూ హీరోలు ప్రతినాయకుడి గుట్టును రట్టు చేసే ప్రక్రియ ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ వరకు చాలా మంది హీరోలు ఈ రకం సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించి హిట్ లు అందుకున్నారు. మరి మన హీరోలు చేసిన ఆ సీక్రెట్ ఏజెంట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కళ్యాణ్ రామ్ తన పుట్టినరోజు సందర్భంగా తను నటించబోయే కొత్త సినిమాలు ప్రకటించగా అందులో డెవిల్ పేరుతో ప్రకటించిన చిత్రంలో ఏజెంట్ గా నటిస్తున్నట్లు తెలిపారు. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని తెలుస్తోంది.  స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ ఏజెంట్ గా వ్యవహరించిన ఇండియన్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నారు. ఇంతవరకు హిట్టు దక్కని హీరో అఖిల్ తన ఐదో సినిమాలో ఏజెంట్ గా నటిస్తున్నాడు. టైటిల్ కూడా ఏజెంట్ కావడం విశేషం. టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

అక్కినేని నాగార్జున కూడా వైల్డ్ డాగ్ చిత్రంలో రా ఏజెంట్ గా నటించారు. ఆ సినిమా థియేటర్ ల లో పెద్దగా విజయం సాధించకున్నా ఓటీటీ లో మాత్రం బాగా సక్సెస్ అయ్యింది. ఇక గోపీచంద్ హీరోగా చేసిన చాణక్య సినిమాలో కూడా ఏజెంట్ గా నటించాడు. పాకిస్తాన్ వెళ్లి ఏజెంట్ గా అక్కడ విలన్ ను పట్టుకునే  క్రమంలో ఎంతో ఆసక్తికరమైన సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి. ఇలాంటి ఏజెంట్ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అడవి శేష్ గూడచారి సినిమా చేయగా ఆ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం. కమలహాసన్ విశ్వరూపం 2 భాగాలు, మహేష్ బాబు స్పైడర్, పైసావసూల్, గరుడ వేగా, శక్తి, గూడచారి నెంబర్ వన్, రుద్రనేత్ర, జగజ్జెట్టీలు, గుధచ సెవెన్ సినిమాలు ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలే. 



మనోళ్లకి బుద్ధి చెప్పాలనే వాళ్ళని దించారట!!

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన సినిమాలు ఇవే..!!

దళపతి విజయ్ తో అల్లు అరవింద్.. మరో భారీ మూవీ ఫిక్స్..!

సందీప్ కిషన్ మూవీలో స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్...

శ్రీ విష్ణు సినిమాలో కెజిఎఫ్ విలన్ ?

'గే'గా మారిన స్టార్ హీరో కూతురు ..?

కెరీర్లో ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో సినిమా చేయని 'ఆమని'.. ఎందుకంటే..?

వీరు సక్సెస్ అయితే వారి పని ఖతమే!!

పుష్ప వర్సెస్ కెజిఎఫ్ 2..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>