MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa-elacationes-nunchi-prakash-raj-out65b0c3de-43fa-4214-a4ee-2329c159ce35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa-elacationes-nunchi-prakash-raj-out65b0c3de-43fa-4214-a4ee-2329c159ce35-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత ర‌స‌కందాయంలో ప‌డ్డాయో చూస్తూనే ఉన్నాం. గ‌త నెల రోజులుగా మా వార్ మామూలుగా లేదు. ఎవ‌రికి వారు ప్ర‌క‌ట‌న‌లు, ఎత్తులు.. పై ఎత్తుల‌తో పాటు మీడియాకు ఎక్క‌డంతో మా ఎన్నిక‌లు సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా ఉన్న న‌రేష్ ప‌ద‌వీ కాలం ముగియ‌కుండానే ? అస‌లు ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయో ? తెలియ‌కుండానే ఎవ‌రికి వారు తాము మా ఎన్నిక‌ల బ‌రిలో ఉంటున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఐదు పేర్లు తెర‌మీద‌కు వ‌చMAA ELACATIONES OUT PRAKASHRAJ{#}Prakash Raj;dr rajasekhar;hema;manchu vishnu;raj;war;Elections;Telugu;Cinemaమా ఎల‌క్ష‌న్స్ నుంచి ప్ర‌కాష్‌రాజ్ అవుట్ ?మా ఎల‌క్ష‌న్స్ నుంచి ప్ర‌కాష్‌రాజ్ అవుట్ ?MAA ELACATIONES OUT PRAKASHRAJ{#}Prakash Raj;dr rajasekhar;hema;manchu vishnu;raj;war;Elections;Telugu;CinemaWed, 07 Jul 2021 20:12:27 GMTటాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత ర‌స‌కందాయంలో ప‌డ్డాయో చూస్తూనే ఉన్నాం. గ‌త నెల రోజులుగా మా వార్ మామూలుగా లేదు. ఎవ‌రికి వారు ప్ర‌క‌ట‌న‌లు, ఎత్తులు.. పై ఎత్తుల‌తో పాటు మీడియాకు ఎక్క‌డంతో మా ఎన్నిక‌లు సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా ఉన్న న‌రేష్ ప‌ద‌వీ కాలం ముగియ‌కుండానే ? అస‌లు ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయో ? తెలియ‌కుండానే ఎవ‌రికి వారు తాము మా ఎన్నిక‌ల బ‌రిలో ఉంటున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఐదు పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి.

ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు - జీవితా రాజశేఖర్ - హేమ - సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. వీరిలో ప్ర‌కాష్ రాజ్ అయితే త‌న ప్యానెల్లో పోటీ చేసే 27 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన లిస్ట్‌ను కూడా రిలీజ్ చేశారు. మా కు సొంత భ‌వ‌నం నిర్మిస్తాన‌న్న ప్ర‌ధాన హామీతోనే ప్ర‌కాష్ రాజ్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నాడు. అయితే ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ అంటూ ఇక్క‌డ వాళ్లు ఓ నినాదాన్ని లేవ‌దీసి హైలెట్ చేస్తున్నారు. ఆయ‌న‌కు స‌పోర్ట్ చేసే వారు మాత్రం... ఆయ‌న ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నాడ‌ని.. ఆయ‌న లోక‌ల్ అంటూ చెపుతున్నారు.

అయితే మా మాజీ అధ్య‌క్షుడు ముర‌ళీ మోహ‌న్ మాత్రం మా ఎన్నిక‌లు ఏక‌గ్రీవం చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ఇక ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ముందుగా ఆస‌క్తి చూపిన వారిలో ఐదారుగురు అనేక ఒత్తిళ్ల నేప‌థ్యంలో తాము పోటీ చేయ‌మ‌ని చెప్పేశార‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యం ఇంకా మూడు నెల‌లు ఉంది. అప్ప‌టికి మ‌రి కొంత మంది కూడా ఈ ప్యానెల్ నుంచి జంప్ అవుతార‌ని ఇండ‌స్ట్రీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. టాలీవుడ్‌లో కొంద‌రు ఈ సారికి ప్ర‌కాష్ రాజ్‌ను త‌ప్పించి మ‌హిళా కోటా అంటూ ఓ మ‌హిళ‌కు ఈ ప‌ద‌విని ఏక‌గ్రీవం చేసేలా తెర‌వెన‌క పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక త‌న ప్యానెల్లో ఎవ్వ‌రూ లేక‌పోతే ఆయ‌న మాత్రం పోటీలో ఎందుకు ఉంటార‌ని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.



"కార్తీకదీపం" సీరియల్ నటికి సినిమా ఛాన్స్ ?

మా ఎల‌క్ష‌న్స్ నుంచి ప్ర‌కాష్‌రాజ్ అవుట్ ?

మరో సారి ఆ డైరెక్టర్ నే నమ్ముకున్న నితిన్ ?

స్టార్ క్రికెట‌ర్‌తో స్టార్ హీరో భార్య ఎఫైర్ ?

దీపికా ప‌డుకొనే బాడీగార్డ్ జీతం తెలిస్తే... దిమ్మ‌తిరిగి కింద ప‌డ‌తాం...!

ధోని కెరీర్లో చేదు అనుభవం.. ఆ హాట్ హీరోయిన్ వల్లే?

గుండెకోత : ధోని తొలి ప్రేయసి చనిపోవడం వెనక కారణాలు

రష్మిక కూడా పెంచేసిందా.. కన్నడ భామ డిమాండ్ అలా ఉంది..!

మనోళ్లకి బుద్ధి చెప్పాలనే వాళ్ళని దించారట!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>