SportsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/srilanka-team-eanjlo-madushue05a5424-6d85-47b6-ad94-ecc9ac1c6f3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/srilanka-team-eanjlo-madushue05a5424-6d85-47b6-ad94-ecc9ac1c6f3a-415x250-IndiaHerald.jpgశ్రీలంక‌.. ప్ర‌పంచ క్రికెట్లో నాలుగు ద‌శాబ్దాల క్రితం ఓ ప‌సికూన‌గా ఎంట్రీ ఇచ్చింది. 1975 నుంచి 1992 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు శ్రీలంక ఎప్పుడూ ప‌సికూనే. శ్రీలంక ఏ టోర్న‌మెంట్ ఆడినా గెలుస్తుంద‌న్న అంచ‌నాలు ఎప్పుడూ ఉండేవే కావు. అలాంటి శ్రీలంక అర్జున్ ర‌ణ‌తుంగ సారథ్యంలో 1996లో అండ‌ర్ డాగ్‌గా బ‌రిలోకి దిగి ఏకంగా ప్ర‌పంచ క‌ప్ గెలుచుకుని ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. అర్జున్ ర‌ణ‌తుంగ‌, అర‌వింద డిసిల్వా, స‌న‌త్ జ‌య‌సూర్య‌, ర‌మేష్ కలువిత‌ర‌ణ‌, చ‌మిందా వాస్‌, ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ ఆ త‌ర్వాత కుమార సంగ‌క్కSRILANKA TEAM EANJLO MADUSHU{#}Arjun;Sri Lankaఆ దేశ క్రికెట్లో పెను సంక్షోభం.. స్టార్ క్రికెట‌ర్ రిటైర్మెంట్ ?ఆ దేశ క్రికెట్లో పెను సంక్షోభం.. స్టార్ క్రికెట‌ర్ రిటైర్మెంట్ ?SRILANKA TEAM EANJLO MADUSHU{#}Arjun;Sri LankaWed, 07 Jul 2021 19:47:57 GMTశ్రీలంక‌.. ప్ర‌పంచ క్రికెట్లో నాలుగు ద‌శాబ్దాల క్రితం ఓ ప‌సికూన‌గా ఎంట్రీ ఇచ్చింది. 1975 నుంచి 1992 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు శ్రీలంక ఎప్పుడూ ప‌సికూనే. శ్రీలంక ఏ టోర్న‌మెంట్ ఆడినా గెలుస్తుంద‌న్న అంచ‌నాలు ఎప్పుడూ ఉండేవే కావు. అలాంటి శ్రీలంక అర్జున్ ర‌ణ‌తుంగ సారథ్యంలో 1996లో అండ‌ర్ డాగ్‌గా బ‌రిలోకి దిగి ఏకంగా ప్ర‌పంచ క‌ప్ గెలుచుకుని ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. అర్జున్ ర‌ణ‌తుంగ‌, అర‌వింద డిసిల్వా, స‌న‌త్ జ‌య‌సూర్య‌, ర‌మేష్ కలువిత‌ర‌ణ‌, చ‌మిందా వాస్‌, ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ ఆ త‌ర్వాత కుమార సంగ‌క్క‌ర‌, తిల‌క‌ర‌త్నే దిల్షాన్‌, మ‌హేల జ‌య‌వ‌ర్థ‌నే , ల‌సిత్ మ‌లింగ లాంటి స్టార్ క్రికెట‌ర్ల‌తో పున‌ర్వైభ‌వం పొంద‌డంతో పాటు ప‌దేళ్ల పాటు ప్ర‌పంచ క్రికెట్లో త‌న స‌త్తా చాటుకుంది.

2007, 2011 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో వ‌రుస‌గా రెండు సార్లు ఫైన‌ల్స్‌కు చేరుకుని ఓడిపోయింది. అలాంటి శ్రీల‌కం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ప‌డిపోయింది. ప‌దేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు జ‌ట్టు పూర్తిగా బ‌ల‌హీన ప‌డిపోయింది. అస‌లు జ‌ట్టులో పేరున్న ఒక్క స్టార్ క్రికెట‌ర్ కూడా లేకుండా పోయారు. జ‌ట్టు పూర్తిగా బ‌ల‌హీన ప‌డిపోయింది. బోర్డులో రాజ‌కీయాలు ఎక్కువై పోయాయి. సీనియర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌లు ముదిరిపోయాయి. వ‌రుస ఓట‌ములతో ఆట‌గాళ్ల‌లో ఆత్మ స్థైర్యం సైతం దెబ్బ‌తింది. కొత్త‌గా తీసుకు వ‌చ్చిన కాంట్రాక్టు రూల్స్‌తో విబేధిస్తోన్న సీనియ‌ర్లు సైతం కాంటాక్ట్ పై సంత‌కం చేసేందుకు ఒప్పు కోవ‌డం లేదు.

చివ‌ర‌కు ఈ వివాదం ముదిరి సంక్షోభంగా మార‌డంతో సీనియ‌ర్ ఆట‌గాడు ఏంజలో మాథ్యూస్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారన్న వార్త సంచలనంగా మారింది. వ‌న్డేలు, టీ20ల నుంచి త‌న‌ను త‌ప్పించ‌డంపై మాథ్యూస్ ర‌గిలి పోతున్నాడు. ప‌దేళ్లలో మాథ్యూస్ జ‌ట్టులో నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. అయినా అత‌డిని త‌ప్పించ‌డంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.  2009లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి వ‌చ్చిన మాథ్యూస్ లంక త‌ర‌ఫున 90 టెస్టులు, 218 వ‌న్డేలు, 78 టీ20లు ఆడ‌డంతో పాటు మొత్తం 13 వేల ప‌రుగులు, 218 వికెట్లు ప‌డ‌గొట్టాడు.



ఊహించ‌ని హీరోతో కప్పెలా రీమేక్ స్టార్ట్.. !

మనోళ్లకు తట్టుకునే శక్తి ఉందా...?

టీమిండియాకు సెకండ్ డోస్... ఎప్పుడంటే?

ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..?

భారత్ - శ్రీలంక సిరీస్ ముంగిట.. లంక బోర్డు కి కొత్త టెన్షన్?

క్రేజీ బైక్ రైడ్ లతో స్టార్ హీరోలు..

అల్లు అర్జున్ కథతోనే రామ్ సినిమా..!

పుష్ప పని మొదలైంది!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>