MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/serial-actress-archana-movie-gossip471bdad5-efaa-4abb-b91c-79ae4a963c9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/serial-actress-archana-movie-gossip471bdad5-efaa-4abb-b91c-79ae4a963c9f-415x250-IndiaHerald.jpgకార్తీక దీపం సీరియల్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందులో అత్త పాత్రలో నటిస్తున్న అర్చన కి కూడా ఒ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈమె నటనకు ఫిదా అయ్యి అభిమానులుగా మారారు. SERIAL ACTRESS ARCHANA MOVIE GOSSIP{#}anasuya bharadwaj;archana;Kannada;Anasuya;Fidaa;producer;Producer;Hero;News;Tollywood;Telugu;Soundarya;Cinema"కార్తీకదీపం" సీరియల్ నటికి సినిమా ఛాన్స్ ?"కార్తీకదీపం" సీరియల్ నటికి సినిమా ఛాన్స్ ?SERIAL ACTRESS ARCHANA MOVIE GOSSIP{#}anasuya bharadwaj;archana;Kannada;Anasuya;Fidaa;producer;Producer;Hero;News;Tollywood;Telugu;Soundarya;CinemaWed, 07 Jul 2021 20:23:55 GMTకార్తీక దీపం సీరియల్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందులో అత్త పాత్రలో నటిస్తున్న అర్చన కి కూడా ఒ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈమె నటనకు ఫిదా అయ్యి అభిమానులుగా మారారు. ఈమె నడకలో హుందాతనం, గౌరవాన్ని ఇవ్వాలనిపించే ఆహార్యం, అధికారాన్ని చూపించే మాటల వెనక దాగున్న మాధుర్యం ఇలా అన్ని హంగులను తన నటనకు చేర్చి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఈమె. మా టీవీలో ప్రసారమవుతున్న కేరాఫ్ అనసూయ అనే మరో సీరియల్లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా తన సత్తా చాటేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆ అవకాశం ఈమెను వెతుక్కుంటూ వచ్చిందని సమాచారం. అందులోనూ ఆ ఆఫర్ కూడా టాలీవుడ్ నుండే వచ్చిందని టాక్. బుల్లితెరపై అత్తగా, అమ్మగా వయసుకు మించిన పాత్రలు చేస్తున్న ఈమెకు వెండితెరపై మాత్రం హీరోకి అక్కగా కాస్త గ్లామరస్ గా కనిపించే అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. అందులోనూ అది ఓ యంగ్ అండ్ డైనమిక్ హీరో సినిమాలో అని సమాచారం. అయితే హీరో ఎవరు ? సినిమా ఏమిటన్న పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. కానీ... సౌందర్య అలియాస్ అర్చన నటిస్తున్న కార్తీకదీపం సీరియల్  ఫ్యాన్ అయిన ఓ  ప్రముఖ నిర్మాత ఈమెకు ఈ సినిమా చాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
ఇన్నాళ్లుగా ఈమె కన్న కలలు సాకారం అయ్యే రోజు వచ్చింది. దీనితో ఈమె ఫ్యాన్స్ అంతా హ్యాపీ గా ఉన్నారు. ఈ వార్తలో ఎంత వాస్తవముందో తెలియాలంటే మరి కొన్ని రోజుల ఆగక తప్పదు. ఇది కనుక నిజమయితే ఈ సినిమా ఛాన్స్ ద్వారా నటిగా తానేమిటో నిరూపించుకుని మరిన్ని అవకాశాలను పొందగలదో లేదో చూడాలి.
 


మా ఎల‌క్ష‌న్స్ నుంచి ప్ర‌కాష్‌రాజ్ అవుట్ ?

మరో సారి ఆ డైరెక్టర్ నే నమ్ముకున్న నితిన్ ?

స్టార్ క్రికెట‌ర్‌తో స్టార్ హీరో భార్య ఎఫైర్ ?

MAలో డ్రాయింగ్&పెయింటింగ్ లాంచ్ చేసిన IGNOU.. వివరాలు..

దీపికా ప‌డుకొనే బాడీగార్డ్ జీతం తెలిస్తే... దిమ్మ‌తిరిగి కింద ప‌డ‌తాం...!

ధోని కెరీర్లో చేదు అనుభవం.. ఆ హాట్ హీరోయిన్ వల్లే?

గుండెకోత : ధోని తొలి ప్రేయసి చనిపోవడం వెనక కారణాలు

రష్మిక కూడా పెంచేసిందా.. కన్నడ భామ డిమాండ్ అలా ఉంది..!

మనోళ్లకి బుద్ధి చెప్పాలనే వాళ్ళని దించారట!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>