India
oi-Shashidhar S
కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. సహాయ మంత్రి నుంచి కేంద్ర మంత్రి పదవీ వరించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా తనపై గురుతర బాధ్యత ఉంటుందని చెప్పారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న దాని గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. జల వివాదం పరిష్కరించాల్సిన తనదేనని చెప్పారు. కేంద్రమంత్రిగా అవకాశం రావడం తెలుగువాడిగా గర్వంగా ఉందని చెప్పారు.
రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటానని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాలకు అందేలా చూస్తానని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు ఏ శాఖను అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు.

రీజినల్ రింగ్ రోడ్డును హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం కానుకగా ఇచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. కేంద్ర మంత్రిగా కరోనా సమయంలో హైదరాబాద్‌లో గల గాంధీ ఆసుపత్రిని తొమ్మిదిసార్లు సందర్శించానని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవీ వచ్చింది. ఇదివరకు ఎవరికీ డైరెక్ట్ పోస్టు దక్కలేదు. ఏపీలో పదవులు చేపట్టినా వారు ఉన్నారు. తెలంగాణ నుంచి లేరు. ఇదివరకు బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాతో మంత్రి పదవీ చేపట్టారు.
English summary
telugu states water war dispute will be solved central minister kishan reddy said after takes oath.