PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag2fcfb8f4-841e-413d-9a4e-049bd70b17f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag2fcfb8f4-841e-413d-9a4e-049bd70b17f2-415x250-IndiaHerald.jpg ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో ఆనందోత్స‌హాలు వెల్లివిరుస్తున్నాయి. ఎందుకంటే వారికి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజున ప‌ద‌వీ యోగం రాబోతోంది. ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నుంది. దీనికోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భారీ క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని పోస్టులు క‌లిపి వెయ్యివ‌ర‌కు ఉంటాయ‌ని ప్ర‌భుత్వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఇంత భారీస్థాయిలో ప‌ద‌వులివ్వ‌డం ఇదే మొద‌టిసారి tag{#}MLA;Y. S. Rajasekhara Reddy;YCP;Party;Congress;Directorత్వ‌ర‌లోనే నీకు రాజ‌యోగం ప‌ట్ట‌బోతోంది నాయ‌నా..!!త్వ‌ర‌లోనే నీకు రాజ‌యోగం ప‌ట్ట‌బోతోంది నాయ‌నా..!!tag{#}MLA;Y. S. Rajasekhara Reddy;YCP;Party;Congress;DirectorWed, 07 Jul 2021 16:26:04 GMT
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో ఆనందోత్స‌హాలు వెల్లివిరుస్తున్నాయి. ఎందుకంటే వారికి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజున ప‌ద‌వీ యోగం రాబోతోంది. ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నుంది. దీనికోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భారీ క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని పోస్టులు క‌లిపి వెయ్యివ‌ర‌కు ఉంటాయ‌ని ప్ర‌భుత్వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఇంత భారీస్థాయిలో ప‌ద‌వులివ్వ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది.

మూడు ప్రాధాన్య‌త‌ల ప్ర‌కారం టిక్కెట్ల కేటాయింపు
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌తి జిల్లాకు క‌నీసం 50 ప‌దవులు ఇవ్వాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన‌వారికి మొద‌టి ప్రాధాన్య‌త‌.. ఎంఎల్ఏ సీటును వదులుకున్నవారికి రెండో ప్రాధాన్య‌త‌.. ఎంఎల్ఏగా పోటీచేసే అర్హతలుండి టికెట్ రానివారికి మూడో ప్రాధాన్య‌త కింద ప‌ద‌వులు భ‌ర్తీ చ‌య‌నున్నారు. ఈ మూడు కేట‌గిరిల్లోనివారికి ఎక్కువ‌గా కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌దవులే రానున్నాయి. పార్టీలో చురుగ్గా ఉండి అభ్యర్ధుల విజయానికి  క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన‌వారికి, ఇతరత్రా రూపాల్లో పార్టీకి సేవ‌లందించేవారిని డైరెక్టర్లుగా నియమించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల సిఫార్సుల‌పై వీరిని నియ‌మిస్తారు. ప్ర‌జాప్ర‌తినిధులు చెప్పిన‌వారికి కొన్ని, పార్టీ నేత‌లు చెప్పిన‌వారికి కొన్ని ప‌ద‌వులిచ్చి ఇరువ‌ర్గాల‌ను సంతృప్తిప‌ర‌చాల‌నేది ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌గా ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలంటున్నాయి.

సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డేవారి కోసం..
వైఎస్సార్ కాంగ్రెస్ కోసం సంవ‌త్స‌రాలుగా క‌ష్ట‌ప‌డుతున్న‌వారికి న్యాయం చేయాల‌నే ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి ఉన్న‌ట్లు స‌మాచారం. ఎంత క‌ష్ట‌ప‌డినా, ఎంత శ్ర‌మ‌ప‌డినా ఫ‌లితం ద‌క్క‌క‌, గుర్తింపురాక నిరాశ‌కు గురయ్యేవారు కూడా ఉంటారు. ఉన్న ప‌ద‌వులు కొన్నే కావ‌డంతో అంద‌రినీ సంతృప్తిప‌ర‌చ‌డం ఎవ‌రివ‌ల్లా సాధ్యంకాదు. ఇప్ప‌టికే గ‌త ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు అనుభ‌వించిన‌వారికి మ‌ళ్లీ ప‌ద‌వులిచ్చారంటూ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటువంటి త‌రుణంలో  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ పోస్టుల భ‌ర్తీ కోసం ఎటువంటి వ్యూహం అవ‌లంబిస్తారు? ఎంత‌మందిని సంతృప్తి ప‌ర‌చ‌గ‌ల‌ర‌నేది రెండురోజుల్లో తేల‌నుంది.




షాకింగ్: దానం నాగేందర్ కి ఆరు నెలల జైలు శిక్ష

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన సినిమాలు ఇవే..!!

సీక్రెట్ ఏజెంట్ పాత్రల్లో అలరించిన స్టార్ హీరోలు

దళపతి విజయ్ తో అల్లు అరవింద్.. మరో భారీ మూవీ ఫిక్స్..!

శ్రీ విష్ణు సినిమాలో కెజిఎఫ్ విలన్ ?

కరోనా రెండోద‌శ ఉధృతి త‌గ్గిన‌ట్లుగానే క‌న‌ప‌డుతోంది. కేసుల సంఖ్య కూడా నెమ్మ‌ది నెమ్మ‌దిగా త‌గ్గుతూ వ‌స్తోంది. ప‌రిస్థితి య‌థావిధిగా వ‌స్తుంద‌నే ఆశ‌తో అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అన్నిర‌కాల వ్యాపారాలు ఒక‌ప్ప‌టిలా క‌ళ‌క‌ళ‌లాడ‌తాయ‌ని అంద‌రూ భావిస్తున్నారు. గత ఏడాది కరోనా మొద‌టి ద‌శలానే చివరగా తెరుచుకునే ప‌రిశ్ర‌మ ఏద‌న్నా ఉందంటే.. అది ధియేట‌ర్ వ్యాపార‌మే. దేశవ్యాప్తంగా ధియేటర్లు నెమ్మ‌ది నెమ్మ‌దిగా తెరుచుకోవ‌డానికి అడుగులు వేస్తున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లో వెండితెర వెలుగులు పంచుతుండ‌గా రేప‌టి నుంచి ఏపీలోని ధియేట‌ర్లు కూడా వెండి వెలుగులు పూయించ‌బోతున్నాయి. ధియేటర్లు తెరిచిన వెంటనే కొత్త సినిమాలు ఆడే పరిస్థితి క‌న‌ప‌డ‌టంలేదు. ట్రయల్ రన్ కింద పాత సినిమాలు ఒక వారం ఆడించి ఆ త‌ర్వాత కొత్త‌వి విడుద‌ల చేద్దామ‌నే ఆలోచ‌న‌లో నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు ఉన్నారు.

ముందు చిన్న సినిమాలు.. త‌ర్వాత పెద్ద సినిమాలు ఓకేనా?

పవన్ కళ్యాణ్ కన్నా రేవంత్ కే మీడియా క్రేజ్...ఎవరు హీరో??

నాని "నిన్ను కోరి"కి నాలుగేళ్లు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>