EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/cm-jagan02e82617-33a2-47cc-95ee-7db7521b8e9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/cm-jagan02e82617-33a2-47cc-95ee-7db7521b8e9a-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలోని ఒక కోణాన్నే అందరూ చూశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ.. నగదు బదిలీతో కరోనా కష్టకాలంలో కూడా పేదలకు ఆర్థిక భరోసా ఇస్తూ, రాష్ట్రం అప్పులపాలవుతోందన్న ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటూ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు జగన్. ఇప్పుడిక తన పాలనలో కొత్త మార్కు చూపించాలనుకుంటున్నారు. మూడేళ్లలో పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమయ్యారు. cm jagan{#}rachana;Ananthapuram;Tadepalli;local language;CM;Telangana Chief Minister;Jagan;Coronavirus;Hanu Raghavapudiమారిన మనిషి.. ఎన్నికల మూడ్ లోకి సీఎం జగన్..మారిన మనిషి.. ఎన్నికల మూడ్ లోకి సీఎం జగన్..cm jagan{#}rachana;Ananthapuram;Tadepalli;local language;CM;Telangana Chief Minister;Jagan;Coronavirus;Hanu RaghavapudiWed, 07 Jul 2021 09:00:00 GMTఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలోని ఒక కోణాన్నే అందరూ చూశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ.. నగదు బదిలీతో కరోనా కష్టకాలంలో కూడా పేదలకు ఆర్థిక భరోసా ఇస్తూ, రాష్ట్రం అప్పులపాలవుతోందన్న ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటూ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు జగన్. ఇప్పుడిక తన పాలనలో కొత్త మార్కు చూపించాలనుకుంటున్నారు. మూడేళ్లలో పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమయ్యారు.

2019 ఎన్నికలకోసం పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లిన జగన్, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్థాయిలో ఎప్పుడూ జనంతో కలవలేకపోయారు. కరోనా ప్రభావం కూడా ఉండటంతో ఆయన ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా కార్యక్రమాలు ముగించేశారు. ఇప్పుడు మెల్లమెల్లగా కరోనా ప్రభావం తగ్గుతుండటంతో తిరిగి జనాల్లోకి వచ్చేందుకు పథక రచన చేశారు జగన్. ముందుగా కడప, అనంతపురం జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు.

పథకాల అమలుపై దృష్టి..
ఇన్నాళ్లూ పథకాలు అమలుచేయడంపై దృష్టిపెట్టిన సీఎం జగన్, ఇకపై వాటి అమలు తీరిని పర్యవేక్షించబోతున్నారు. నేరుగా తానే సచివాలయాల సందర్శనకు వస్తానంటున్నారు. తనతోపాటు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఆ పనికి పురమాయిస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఆగిపోయిన రచ్చబండ కార్యక్రమాన్ని కూడా తిరిగి మొదలుపెట్టాలనుకుంటున్నారట జగన్. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత జగన్ టూర్ షెడ్యూల్ ఖరారవుతుంది.

తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నారు, జనం గోడు పట్టించుకోవడంలేదంటూ.. సీఎం జగన్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నవేళ, ఆయన జనంలోకి వచ్చేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకుంటున్నారు. రాబోయే మూడేళ్ల కాలంలో ఎక్కువగా జనంలో ఉండే కార్యక్రమాలనే రూపొందించాలని అధికారులకు సూచించారట. ప్రస్తుతం నేరుగా ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నా.. దానివల్ల వారికి కలుగుతున్న ఉపయోగాలు, పథకాల అమలులో సమస్యలు తెలుసుకోడానికి జనంలోకి రాబోతున్నారు జగన్. ఈ మూడేళ్లలో తప్పొప్పులు సరిదిద్దుకుని సమర్థంగా ఎన్నికలను ఎదుర్కొనే ప్రణాళికలు రచించబోతున్నారు.



జగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?

కరోనా మరణాల నియంత్రణలో టాప్ లో ఉన్న రాష్ట్రమిదే ?

ర‌ఘువీరా పొలిటిక‌ల్‌ రీ ఎంట్రీ... ఆ పార్టీ నుంచేనా ?

భారత ప్రయాణికులకు ఏపీ కబురు చెప్పిన మరో దేశం..?

కరోనా పోరుకు 1000 కోట్లు.. అజీమ్ ప్రేమ్ జి హ్యాట్సాఫ్?

టీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌... కొడంగ‌ల్లో కారు పార్టీ ఖాళీ...!

మన దేశంలో హిందువుల ఆరాధ్య దైవం ఎవరో తెలుసా ?

కరోనా విజేతల్ని వణికిస్తున్న బోన్ డెత్..

ఆర్ ఆర్ ఆర్ లో ఉక్రెయిన్ సెంటిమెంట్ సీక్రెట్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>