PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/bone-death4268783d-8581-4746-ad36-044058818040-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/bone-death4268783d-8581-4746-ad36-044058818040-415x250-IndiaHerald.jpgకొవిడ్ వైరస్ తో పోరాడి విజయం సాధించిన చాలామంది ఆ తర్వాత పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాణాలొదిలారు. ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ ఇలా కరోనా విజేతల్ని ఇబ్బంది పెట్టింది. తాజాగా బోన్ డెత్ అనే వ్యాధి కరోనా విజేతలైనవారిని ఇబ్బంది పెడుతోంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా 'అంతకు మించి' అన్నట్టుగా ప్రభావం చూపిస్తోంది. చేతులు, కాళ్లలోని ఎముకలు గుల్లగుల్లగా మారిపోవడం, రక్త సరఫరా లేక ఎముకలు నుజ్జునుజ్జయిపోవడం దీని లక్షణాలు. శస్త్ర చికిత్సతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నా.. చాలామంది బాధితులు బోన్ డెత్ వల్ల తీవ్ర సమస్యbone death{#}Mumbai;Maharashtra;Coronavirusకరోనా విజేతల్ని వణికిస్తున్న బోన్ డెత్..కరోనా విజేతల్ని వణికిస్తున్న బోన్ డెత్..bone death{#}Mumbai;Maharashtra;CoronavirusWed, 07 Jul 2021 08:00:00 GMTకొవిడ్ వైరస్ తో పోరాడి విజయం సాధించిన చాలామంది ఆ తర్వాత పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాణాలొదిలారు. ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ ఇలా కరోనా విజేతల్ని ఇబ్బంది పెట్టింది. తాజాగా బోన్ డెత్ అనే వ్యాధి కరోనా విజేతలైనవారిని ఇబ్బంది పెడుతోంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా 'అంతకు మించి' అన్నట్టుగా ప్రభావం చూపిస్తోంది. చేతులు, కాళ్లలోని ఎముకలు గుల్లగుల్లగా మారిపోవడం, రక్త సరఫరా లేక ఎముకలు నుజ్జునుజ్జయిపోవడం దీని లక్షణాలు. శస్త్ర చికిత్సతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నా.. చాలామంది బాధితులు బోన్ డెత్ వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

స్టెరాయిడ్ చికిత్సతోనే ముప్పు..
కరోనా చికిత్సలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే, దానివల్ల దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలుసు. బ్లాక్ ఫంగస్ కి మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే కారణం అని చెబుతున్నారు నిపుణులు. తాజాగా వెలుగు చూసిన బోన్ డెత్ కి కూడా స్టెరాయిడ్స్ వాడకాన్నే కారణంగా తేల్చారు. కరోనానుంచి కోలుకున్నవారిలో బోన్ డెత్ అనేది సాధారణ సమస్యగా మారిందని మహారాష్ట్రలో వెలుగు చూస్తున్న కేసుల ద్వారా తెలుస్తోంది. మహారాష్ట్రలో బోన్ డెత్ గా వ్యవహరించే అవాస్కులర్ నెక్రోసిమ్ (ఏవీఎన్) కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ముంబై సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కరోనానుంచి కోలుకున్నవారిలో బోన్ డెత్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆర్థోపెడిక్ వైద్యులు చెబుతున్నారు. ముంబైలోని హిందుజా ఆస్పత్రి, నాగపూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో నెలరోజుల వ్యవధిలోనే 50 బోన్ డెత్ కేసులు బయటపడ్డాయి.

శరీరంలో రక్త సరఫరా సరిగా లేకపోవడంతో, ముఖ్యంగా ఎముకలకు అవసరమైన రక్తసరఫరా లేనప్పుడు ఈ అవాస్కులర్ నెక్రోసిమ్ (ఏవీఎన్) అనే వ్యాధి బయటపడుతుంది. దీని వల్ల ఎముకలలో పగుళ్లు ఏర్పడతాయి. మెడ, భుజాలు, మోకాళ్లలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎముకలు గుళ్లగా మారిపోతాయి. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినా, ఆల్కహాల్ ఎక్కువమోతాదులో తీసుకున్నా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం ముంబైలో కరోనానుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సకాలంలో వైద్య చికిత్స మొదలు పెడితే సమస్య తీవ్రత తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. బోన్ డెత్ కేసులు ఎక్కువకావడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టింది.



ఆర్ ఆర్ ఆర్ లో ఉక్రెయిన్ సెంటిమెంట్ సీక్రెట్ !

కొవిడ్ వైరస్ తో పోరాడి విజయం సాధించిన చాలామంది ఆ తర్వాత పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాణాలొదిలారు. ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ ఇలా కరోనా విజేతల్ని ఇబ్బంది పెట్టింది. తాజాగా బోన్ డెత్ అనే వ్యాధి కరోనా విజేతలైనవారిని ఇబ్బంది పెడుతోంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా 'అంతకు మించి' అన్నట్టుగా ప్రభావం చూపిస్తోంది. చేతులు, కాళ్లలోని ఎముకలు గుల్లగుల్లగా మారిపోవడం, రక్త సరఫరా లేక ఎముకలు నుజ్జునుజ్జయిపోవడం దీని లక్షణాలు. శస్త్ర చికిత్సతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నా.. చాలామంది బాధితులు బోన్ డెత్ వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

మహేష్, పవన్ లతో పాటు వెంకీ కూడానా ..... ??

భారత్ - శ్రీలంక సిరీస్ ముంగిట.. లంక బోర్డు కి కొత్త టెన్షన్?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రేసులో ముందున్నది వీళ్లే..!!

'కేజీఎఫ్2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

ఆరోగ్యశ్రీ ఉంటే చాలు.. ఏపీలో ప్రతి కుటుంబానికి 50 వేలు.. కానీ?

కరోనా ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ కొత్త జట్టు ఇదే?

సీఎంకు లోకేశ్ లేఖ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>