MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bolywoodd80fb14a-811e-424e-992e-bd4c43233f0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bolywoodd80fb14a-811e-424e-992e-bd4c43233f0f-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశాడు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. దేవదాస్, నయా దౌర్, మొగల్ ఇ అజామ్, గంగా జమునా, క్రాంతి, కర్మ లాంటి చిత్రాలు దిలీప్ కుమార్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖిలా సినిమాలో ఆయన చివరిసారిగా నటించారు. bollywood dilip{#}Ganga;madhumati;Ganges;king;King;Fidaa;Pakistan;Kumaar;Rajya Sabha;Husband;December;bollywood;dileep;Wife;Dilip Kumar;dilip;Cinemaఅందుకే దిలీప్ "ట్రాజెడీ కింగ్" అయ్యారు..!అందుకే దిలీప్ "ట్రాజెడీ కింగ్" అయ్యారు..!bollywood dilip{#}Ganga;madhumati;Ganges;king;King;Fidaa;Pakistan;Kumaar;Rajya Sabha;Husband;December;bollywood;dileep;Wife;Dilip Kumar;dilip;CinemaWed, 07 Jul 2021 09:00:00 GMTబాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ తుదిశ్వాస విడిచారు. వయసు పైబడిన కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఈ ఉదయం కన్నుమూశారు. దిలీప్ కుమార్ ప్రస్తుత వయసు 98 ఏళ్లు. ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉదయం 7.30కి మృతి చెందారు. హెల్త్ ప్రాబ్లమ్స్ తో  గత వారం ముంబైలోని హిందూజ హాస్పిటల్ లో చేరారు. ఆ సమయం నుండి దిలీప్ కుమార్ కు ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తన భార్య సైరా ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దిలీప్ కుమార్ కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థించారు. కానీ ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. కానీ ఈ ఉదయం విషాద వార్త అందుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

దిలీప్ కుమార్‌కు ట్రాజెడీ కింగ్‌ అనే పేరు ఉంది. బాలీవుడ్ లో ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు పలు చిత్రాల్లో నటించారు. 65సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. దేవదాస్, నయా దౌర్, మొగల్ ఇ అజామ్, గంగా జమునా, క్రాంతి, కర్మ లాంటి చిత్రాలు దిలీప్ కుమార్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖిలా సినిమాలో ఆయన చివరిసారిగా నటించారు.

దిలీప్ కుమార్ జ్వార్ భాటా అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 1944లో వచ్చిన ఆ సినిమా అంతగా ఆదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత వచ్చిన 1947లో వచ్చిన జుగ్ను అనే సినిమాతో హిట్ కొట్టాడు. 1951లో దీదార్, 1954లో అమర్, 1955లో దేవదాస్, 1958లో మధుమతి చిత్రాలు దిలీప్ కుమార్ సినీ జీవితంలో చెప్పుకోదగినవి. ఈ చిత్రాల్లో ఆయన నటనకు జనం ఫిదా అయ్యారు.  అందుకే ఇతనికి ట్రాజెడీ కింగ్ అనే పేరు వచ్చింది. ఇక 1960లో కె.ఆసిఫ్ నిర్మాతగా వ్యవహరించిన మొఘల్ ఎ ఆజం దిలీప్ కుమార్ సినీ లైఫ్ లో ది బెస్ట్ సినిమా. దిలీప్ కుమార్ 1922వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించాడు. దిలీప్ కుమార్ 1922వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించాడు. 1966లో సైరాబానును వివాహం చేసుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు దిలీప్ కుమార్ తన తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు. అయితే సినీరంగంలోకి అడుగుపెట్టాక 1944నుంచి 1998 వరకు బాలీవుడ్ ను దిలీప్ కుమార్ ఏలారు. ఉత్తమ నటుడిగా 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 1994లో దాదా సాహెబ్  ఫాల్కే అవార్డు, 1991లో పద్మభూషణ్ 2015లో పద్మభూషణ్ అందుకున్నారు. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా దిలీప్ పనిచేశారు. 


జగన్ కీలక నిర్ణయం.. థియేటర్ల నిర్వాహకులకు షాక్?

రెండో పెళ్లి చేసుకుంటే ఈ హక్కు పోయినట్టేనా..?

బండ్ల గణేష్ కూతురు కోరిన కోర్కెలు విని షాక్ లో పవన్ అభిమానులు !

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత, నివాళులర్పిస్తున్న సినీ ప్రముఖులు

ఆ హీరోయిన్ మెడపై ఉన్న పేరు ఎవరిది..??

బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ నటుడు కన్నుమూత

ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..?

బాలీవుడ్ లో ఎప్పుడూ ఆ గొడవలేనా..?

బాలీవుడ్ లో టైటిల్ ల విషయంలో ఎప్పుడూ గొడవలు, వివాదాల్లో సత్యనారాయణ్ కథ టైటిల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>