EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganefe057bc-9740-46dd-8d19-c33e68493bc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganefe057bc-9740-46dd-8d19-c33e68493bc0-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలో చ‌ర్చ‌ల ద్వారా..ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. పోనీ.. రాజ‌కీ యంగా కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చి ప‌రిష్క‌రించుకుందామ‌ని అనుకున్నా.. అది కూడా ఇప్ప‌ట్లో సాధ్య‌మ య్యేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్ప‌టికే పులిచింత‌ల నిండిపోయి.. ప్ర‌కాశం బ్యారేజీ ద్వారా వంద‌ల టీఎంసీల నీరు వృథాగా పోతోంది. మ‌రోవైపు శ్రీశైలం ఎండిపోతోంది. దీంతో ఖ‌రీఫ్ సాగు క‌నాక‌ష్టంగా మారిపో యింది. మ‌రి ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ ఏం చేయాలి? కేవ‌లం అటు కేంద్రానికి ఇటు కృష్ణా రివ‌ర్ బోర్డుకు లేఖ‌లు రాస్తూ.. కూర్చుంటJagan mohan reddy{#}Amaravathi;electricity;Srisailam;KCR;Krishna River;Telangana;Teluguజ‌గ‌నూ రాజ‌ధాని కేసులకు రూ.కోట్ల లాయ‌ర్లు.. జ‌ల వివాదంపై ఇంత మౌన‌మా..?జ‌గ‌నూ రాజ‌ధాని కేసులకు రూ.కోట్ల లాయ‌ర్లు.. జ‌ల వివాదంపై ఇంత మౌన‌మా..?Jagan mohan reddy{#}Amaravathi;electricity;Srisailam;KCR;Krishna River;Telangana;TeluguTue, 06 Jul 2021 10:02:00 GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రి అనేక విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుస‌రిస్తున్న విప‌రీత ధోర‌ణికి, దూకుడుకు జ‌గ‌న్ స‌మాధానం చెప్ప‌లేక పోతున్నార‌ని.. ఆయ‌న సొంత రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ట్టించు కోవడం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆరు నూరైనా.. నీళ్లు లేక‌పోయినా.. త‌మ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 100 శాతం విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని.. త‌మ‌ను ఎవ‌రు ఆపుతార‌ని.. కేసీఆర్ ధిక్కార ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో చ‌ర్చ‌ల ద్వారా..ఈ  స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. పోనీ.. రాజ‌కీ యంగా కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చి ప‌రిష్క‌రించుకుందామ‌ని అనుకున్నా.. అది కూడా ఇప్ప‌ట్లో సాధ్య‌మ య్యేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్ప‌టికే పులిచింత‌ల నిండిపోయి.. ప్ర‌కాశం బ్యారేజీ ద్వారా వంద‌ల టీఎంసీల నీరు వృథాగా పోతోంది. మ‌రోవైపు శ్రీశైలం ఎండిపోతోంది. దీంతో ఖ‌రీఫ్ సాగు క‌నాక‌ష్టంగా మారిపో యింది. మ‌రి ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ ఏం చేయాలి?  కేవ‌లం అటు కేంద్రానికి ఇటు కృష్ణా రివ‌ర్ బోర్డుకు లేఖ‌లు రాస్తూ.. కూర్చుంటే స‌రిపోతుందా? అంటేకాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

త‌క్ష‌ణం జ‌ల‌విద్యుత్ ఉత్ప‌త్తిని నిలుప‌ద‌ల చేసేలా.. తెలంగాణ స‌ర్కారుకు త‌ల‌తిరిగిపోయేలా స‌మాధానం చెప్పాలంటే.. న్యాయ‌పోరాటం ఒక్క‌టే మార్గ‌మ‌ని అంటున్నారు. అయితే.. జ‌గ‌న్ మాత్రం ఆ దిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా వేయ‌లేదు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కుజీవ‌నాధారం, ప్రాణాధార‌మైన జ‌లాల విష‌యంలో తీవ్ర ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదే.. త‌న సొంత కేసులు.. లేదా.. రెండేళ్ల‌పాటు సీఎంగా తాను తీసుకున్న నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేకత వ‌చ్చినా.. కోర్టులు త‌ప్పుబ‌ట్టినా.. వెంట‌నే న్యాయ పోరాటం చేశార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో కోట్లాది రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని.. ఆయా కేసులు వాదించేవారికి జీతంగా ఇచ్చార‌ని అంటున్నారు. మ‌రీముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి పై త‌న మాటే నెగ్గించుకోవాల‌నే పంతంలో రోజుకు రూ.5 కోట్ల‌తో ఓ లాయ‌ర్‌ను నియ‌మించుకోవ‌డాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. మ‌రి.. త‌న సొంత కేసులు, త‌న సొంత నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్ధించుకునేందుకు ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేసి బ‌లమైన లాయ‌ర్ల‌ను నియ‌మించుకుని న్యాయ పోరాటం చేసిన జ‌గ‌న్ ఇప్పుడు.. అతి పెద్ద జ‌ల‌వివాదం వ‌చ్చిన‌ప్పుడు, రైతులు ఆందోళ‌న చేస్తున్న‌ప్పుడు.. ఆ మాత్రం లాయ‌ర్ల‌ను నియ‌మించుకుని న్యాయం చేయ‌లేరా? అని ప్ర‌శ్నిస్తున్నారు.  మ‌రి దీనికి జ‌గ‌న్ ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.



జ‌గ‌నూ రాజ‌ధాని కేసులకు రూ.కోట్ల లాయ‌ర్లు.. జ‌ల వివాదంపై ఇంత మౌన‌మా..?

అందాల విందుకు మీరు సిద్ధమా..?

వ‌సంతానికి నీటి గ్ర‌హణం.. దేవినేని దూకుడు..!

దృశ్యం దర్శకుడితో మరో రీమేక్ ను లైన్ లో పెట్టిన వెంకీ!!

రేవంత్ రాకతో గులాబీలో గుబులు పుట్టిందా..?

సైన్ చేశాక ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది... కారణమిదే ?

తీర్పులు పాతవి.. రాష్ట్రాలు కొత్తవి.. అందుకే జలజగడాలు..

"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!

కరోనా వస్తే 20 రోజులు సెలవులు.. సీఎం జగన్ ఆదేశం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>