HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-1abf3a81-cddb-4836-bd90-6cedcbd60875-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-1abf3a81-cddb-4836-bd90-6cedcbd60875-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితాలలో కంప్యూటర్ ఒక భాగమయ్యింది. అందులోనూ కరోణ వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సమయంలో గంటలకొద్దీ కంప్యూటర్ స్క్రీన్ ని చూస్తూనే ఉండటం వల్ల మన కండ్ల పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల అనేక కంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. 20 20 20 ఈ సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల విరామం తీసుకోవడం మంచిది. ఆ సమయంలోనేHealth {#}softwareమీ కంటి చూపు బాగుండాలంటే ఇవి పాటించండి..!మీ కంటి చూపు బాగుండాలంటే ఇవి పాటించండి..!Health {#}softwareTue, 06 Jul 2021 14:05:00 GMT ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితాలలో కంప్యూటర్ ఒక భాగమయ్యింది. అందులోనూ కరోణ వైరస్ నేపథ్యంలో  ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సమయంలో గంటలకొద్దీ  కంప్యూటర్ స్క్రీన్ ని చూస్తూనే ఉండటం వల్ల  మన కండ్ల పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల అనేక కంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

**20 20 20 ఈ సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి.
ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల  విరామం తీసుకోవడం మంచిది. ఆ సమయంలోనే 20 మీటర్ల దూరంలో ఉన్న  ఏదైనా వస్తువు పై  దృష్టిని మళ్ళించండి. లేదంటే ఒక గంటలో ఐదు నిమిషాల పాటు  విరామం తీసుకోండి.. ఆ సమయంలోనే కళ్లను సవ్య అపసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పడం మంచిది. **

** చాలా మంది  కంటి రెప్ప వేయకుండా కంప్యూటర్ వైపు కళ్ళు పెద్దవిగా చేసి చూస్తారు. ఇలా చేయడం వల్ల కండ్లు పొడిబారి, మంటలు పుడతాయి**

** కండ్లు మానిటర్ పై భాగం సమానంగా ఒకే ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. దీని ద్వారా మానిటర్ మధ్యభాగానికి కళ్ళకు మధ్య 15నుంచి 20 డిగ్రీల కోణం ఉంటుంది. దీని ఫలితంగా కళ్ళు ఒత్తిడికి గురి అవ్వవు. **

** అలాగే స్క్రీన్ పై దుమ్ము ధూళి లేకుండా తరచూ శుభ్రం చేసుకోవాలి. మానిటర్ పై ఇలాంటి వెలుతురు పడకుండా చూసుకోవాలి. అలా కుదరని వేల కిటికీలు తలుపులు నుంచి మానిటర్ స్క్రీన్ పై వెలుతురు పడకుండా జాగ్రత్తపడాలి. **

** గదిలో ఉన్న వెలుతురు కనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ సెట్టింగులు మార్చే సాఫ్ట్ వేర్ లను  కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. వీటివల్ల  గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ మారుతూ వస్తుంది. సాధ్యమైనంత వరకూ పాంటు సైజు  పెంచుకోవడం మంచిది. **

** అలాగే కంప్యూటర్ పై ఎక్కువ సమయం పనిచేసే వారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే వాటి వల్ల కళ్లు పొడిబారే అవకాశాలు తక్కువగా ఉంటాయి. **



మాస్కుతో ఇంత ప్రమాదమా..?

సౌందర్య భర్త గురించి మీకు తెలియని విషయాలు..!!

ఈ యాప్స్ ని వెంటనే డిలేట్ చేసేయండి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>