PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-sharmila-jagan-mohan-reddyea502cf2-638a-4b3b-bebc-76e16708e929-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-sharmila-jagan-mohan-reddyea502cf2-638a-4b3b-bebc-76e16708e929-415x250-IndiaHerald.jpgచివ‌ర‌కు ఈ గ్యాప్ ఎంత‌లా ఉందంటే... క‌నీసం త‌మ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అన్నాచెల్లెళ్లు జ‌గ‌న్‌, ష‌ర్మిల ఇడుపుల‌పాయ‌లో క‌లుస్తార‌ని ఆశించిన వాళ్లు కూడా డిజప్పాయింట్ అయ్యేలా ఉంది. తండ్రి జ‌యంత రోజు ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ రోజు ఆమె ఉద‌యం ఇడుపుల‌పాయ‌కు వెళ్లి తండ్రి స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించ‌నున్నారు. అయితే జ‌గ‌న్ ముందుగానే ఆ రోజు ఇడుపుల పాయ‌కు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ష‌ర్మిల వెళుతుండ‌డంతో ఆయ‌న షెడ్యూల్ మారుతోంది. YS Sharmila Jagan mohan Reddy{#}srinivas;Y. S. Rajasekhara Reddy;MP;Vishakapatnam;Yevaru;Sharmila;Father;Party;Jagan;Reddy;Andhra Pradeshఆ రెండు సార్లు ష‌ర్మిల ఏం అడిగింది.. జ‌గ‌న్ ఎందుకు ఇవ్వ‌లేదు ?ఆ రెండు సార్లు ష‌ర్మిల ఏం అడిగింది.. జ‌గ‌న్ ఎందుకు ఇవ్వ‌లేదు ?YS Sharmila Jagan mohan Reddy{#}srinivas;Y. S. Rajasekhara Reddy;MP;Vishakapatnam;Yevaru;Sharmila;Father;Party;Jagan;Reddy;Andhra PradeshTue, 06 Jul 2021 13:24:00 GMTఎవరెన్ని అనుకున్నా... ఎవరు ఏం చెప్పినా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి , ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య తీవ్రమైన వైరుధ్యం ఏర్పడింది అన్నది నిజం. ఏపీలో అన్న‌ను అధికారంలోకి తెచ్చేందుకు గత ఎన్నికల్లో షర్మిల ఎంతో కష్టపడ్డారు. ఆ మాటకు వస్తే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా షర్మిల పార్టీని ఎంతో బలోపేతం చేశారు. అన్న జైలులో ఉంటే చెల్లి నాటి సమైక్య రాష్ట్రంలో చేసిన పాదయాత్ర ఓ సంచలనం అయింది. రెండేళ్ల క్రితం వరకు అన్న అడుగుజాడల్లోనే న‌డుస్తూ.. అన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎంతో కష్టపడిన షర్మిల ఈరోజు అన్న తో విభేదించి ఎందుకు ? కొత్తపార్టీ పెట్టుకుంది అన్న‌ది అనేక సందేహాలకు తావిస్తోంది. ఏదేమైనా అన్నాచెల్లెళ్ల మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌న్న‌ది వాస్త‌వం.

చివ‌ర‌కు ఈ గ్యాప్ ఎంత‌లా ఉందంటే... క‌నీసం త‌మ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అన్నాచెల్లెళ్లు జ‌గ‌న్‌, ష‌ర్మిల ఇడుపుల‌పాయ‌లో క‌లుస్తార‌ని ఆశించిన వాళ్లు కూడా డిజప్పాయింట్ అయ్యేలా ఉంది. తండ్రి జ‌యంత రోజు ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ రోజు ఆమె ఉద‌యం ఇడుపుల‌పాయ‌కు వెళ్లి తండ్రి స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించ‌నున్నారు. అయితే జ‌గ‌న్ ముందుగానే ఆ రోజు ఇడుపుల పాయ‌కు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ష‌ర్మిల వెళుతుండ‌డంతో ఆయ‌న షెడ్యూల్ మారుతోంది.

వాస్త‌వంగా ష‌ర్మిల వైసీపీలో ప‌ద‌వి ఆశించారు. 2014 ఎన్నిక‌ల్లోనే ఆమె క‌డ‌ప ఎంపీ సీటు అడిగితే దానిని అవినాష్‌కు ఇచ్చారు. ఒంగోలుపై ఆశ ప‌డితే బాబాయ్ సుబ్బారెడ్డికి ఇచ్చారు. చివ‌ర‌కు ఖ‌మ్మంపై ఆశ‌లు పెట్టుకుంటే దానిని శ్రీనివాస్ రెడ్డికి ఇస్తాన‌ని చెప్పాన‌ని అక్క‌డ నుంచి కూడా త‌ప్పించారు. ఇటు వైజాగ్ నుంచి త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి పోటీలో ఉండంతో ష‌ర్మిలకు ఛాన్స్ రాలేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లోనూ క‌డ‌ప అవినాష్‌కే ఇచ్చారు.. ఒంగోలులో బాబాయ్‌ను త‌ప్పించినా దానిని మాగుంట‌కు ఇచ్చారు. చివ‌ర‌కు ఆమె రాజ్య‌స‌భ అయినా వ‌స్తుంద‌నుకుంటే అది కూడా ఇవ్వ‌లేదు. చివ‌ర‌కు అన్న పార్టీలో త‌నకు ప్రాధాన్యత లేద‌ని డిసైడ్ అయ్యాకే ఆమె తాను స‌త్తా చాటేందుకు కొత్త పార్టీ పెడుతున్నారు. 



హవ్వ, రకుల్ కి జిమ్ బేసిక్స్ కూడా తెలియవా..?

నేను ఉన్నా, నేను విన్నా అన్న‌ది ఇదేనా జ‌గ‌న్‌...?

మిజోరాం గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత

కెరీర్ మొదట్లో.. నువ్విలా సినిమాలో మెరిసిన విజయ్ దేవరకొండ.. ?

టాలీవుడ్ లో మొట్ట మొదటి ఫ్యాక్షన్ చిత్రం ఏంటో తెలుసా. ?

వాటర్ వార్: జగన్ ప్రతిపక్షాల మద్ధతు తీసుకుంటారా?

బుల్లితెర‌పై క్యాస్టింగ్ కౌచ్‌.. కార్తీక‌దీపం ప్రియ‌మ‌ణిని కోరిక తీర్చ‌మందెవ‌రు ?

వైసీపీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు

య‌న‌మ‌ల‌కు చంద్ర‌బాబు మార్క్ చ‌క్క‌టి చెక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>