దీదీగిరికి అడ్డులేదిక: శాసన మండలి బిల్లుకు ఆమోదం -మోదీ-బీజేపీకి మండేలా ఏటా ‘ఖేల హోబే దివస్’

శాసన మండలి బిల్లు పాస్

రెండు నెలల కిందట హోరాహోరీగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 294 సీట్లకుగానూ టీఎంసీ 211 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 74 సీట్లకే పరిమితమైంది. కానీ అనూహ్యరీతిలో నందిగ్రామ్ స్థానంలో మమతా బెనర్జీ ఓడిపోయారు. చట్టసభలో సభ్యురాలు కాకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దీదీ.. ఆరు నెలల్లోగా, అంటే ఈఏడాది సెప్టెంబర్ లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాల్సి ఉంది. కాగా, ఎన్నికల కమిషన్ తోనూ విభేదాల కారణంగా అసెంబ్లీ ఉప ఎన్నికను నివారిస్తూ, ఎప్పుడో రద్దయిన శాసన మండలిని మళ్లీ పునరుద్ధరించాలని మమత డిసైడయ్యారు. ఆ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం శాసనసభలో ఆమోదం లభించింది..

షాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలుషాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలు

196-69తేడా, బీజేపీ వాకౌట్..

శాసన మండలి పునరుద్ధరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో అసెంబ్లీలో హైడ్రామా జరిగింది. దొడ్డి దారిన సీఎంగా కొనసాగేందుకే దీదీ మండలిని మళ్లీ తీసుకొచ్చారని, మండళ్ల ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకమని, అన్నిటికంటే ముందు నందిగ్రామ్ లో మమత ఓటమిపై అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి పట్టుపట్టారు. వాదోపవాదాల మధ్యే మండలి ఏర్పాటు బిల్లు 196-69 తేడాతో ఆమోదం పొందింది. ఈ ఘట్టం తర్వాత సీఎం మమత ప్రసంగం ఉండగా దాన్ని నిరసిస్తూ బీజేపీ వాకౌట్ చేసింది. కాగా,

బెంగాల్‌లో ఏటా ఖేలా హోబే దివస్

మండలి బిల్లు ఆమోదం నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ శాసన మండళ్లు కొనసాగుతున్నాయని, అలాంటిది బెంగాల్ లో మాత్రమే వారు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మండలిపై టీఎంసీ తన మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. బెంగాల్ ప్రజలు టీఎంసీని ఆశీర్వదించిన తీరు అమోఘమని, ఆ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా ‘ఖేలా హోబే దివస్’ జరపాలని నిర్ణయించినట్లు మమత తెలిపారు. బీజేపీ జైశ్రీరాం నినాదాంతో మమతపై దాడికి దిగగా, టీఎంసీ ఖేలా హోబే(ఆట ఇంకా మిగిలే ఉంది) నినాదంతో కమలనాథుల్ని మట్టికరిపించడం తెలిసిందే.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *