MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajampulicef6905d-bbde-41eb-8307-b2f6af4424c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajampulicef6905d-bbde-41eb-8307-b2f6af4424c0-415x250-IndiaHerald.jpg దేశంలో సగటున 18 నుంచి 30 సంవత్సరాల లోపు యూత్ తమ చేతిలోని సెల్ ఫోన్ చూస్తూ కాలం గడుపుతున్నారు అన్న అంచనాలను ప్రముఖ సర్వే సంస్థలు అందించి దేశ ప్రజలకు షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఆ సర్వేను నిజం చేస్తూ రాజమౌళి పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటి వరకు ఒక సామాజిక వర్గం హర్ట్ అయ్యేలా ఎవరైనా కామెంట్స్ చేస్తే దానిపై వివాదాలు కోర్టు కేసులు నడవడం గమనించాం.అదేవిధంగా మూగ జీవులను హింసిస్తూ ఉన్న వీడియోలను ఎవరైనా షేర్ చేస్తే జంతు ప్రేమికుల నుండి తీవ్ర నిరసన రావడమే కాకుండా rajampuli{#}Criminal;Rajamouli;Survey;Nijam;Smart phone;court;Cinema;Governmentకుక్కల వివాదంలో చిక్కుకున్న రాజమౌళి !కుక్కల వివాదంలో చిక్కుకున్న రాజమౌళి !rajampuli{#}Criminal;Rajamouli;Survey;Nijam;Smart phone;court;Cinema;GovernmentTue, 06 Jul 2021 09:00:00 GMT
దేశంలో సగటున 18 నుంచి 30 సంవత్సరాల లోపు యూత్ తమ చేతిలోని సెల్ ఫోన్ చూస్తూ కాలం గడుపుతున్నారు అన్న అంచనాలను ప్రముఖ సర్వే సంస్థలు అందించి దేశ ప్రజలకు షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఆ సర్వేను నిజం చేస్తూ రాజమౌళి పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటి వరకు ఒక సామాజిక వర్గం హర్ట్ అయ్యేలా ఎవరైనా కామెంట్స్ చేస్తే దానిపై వివాదాలు కోర్టు కేసులు నడవడం గమనించాం.


అదేవిధంగా మూగ జీవులను హింసిస్తూ ఉన్న వీడియోలను ఎవరైనా షేర్ చేస్తే జంతు ప్రేమికుల నుండి తీవ్ర నిరసన రావడమే కాకుండా వారి పై ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా క్రిమినల్ కేసులు కూడ పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పరిస్థితుల పై చేసిన కామెంట్స్ లో ఊర కుక్కల ప్రస్తావన రావడంతో జంతు ప్రేమికులు రాజమౌళి పై తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఊర కుక్కలకు సరైన ఆలనాపాలనా లేకపోవడంతో ఆకలి దాహం తట్టుకోలేక ఇలా ఎయిర్ పోర్ట్ లోకి వచ్చి ఉంటాయని ఊరకుక్కలవి ప్రాణాలు కావా అంటూ జక్కన్నాను కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.



ఈవిషయంలో రాజమౌళిని టార్గెట్ చేస్తున్న వారిలోని సామాజిక స్పృహ హర్షింప తగ్గదే అయినప్పటికీ ఇప్పటికీ మనదేశంలో 30 శాతం మంది ప్రజలు కేవలం రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నారు అన్న విషయం రాజమౌళిని విమర్శించే వారికి తెలియదా అన్నదే అందరి సందేహం. సంఘటన ఏదైనప్పటికీ రాజమౌళి కామెంట్స్ వల్ల మళ్ళీ ఊరకుక్కల జీవన పరిస్థితుల పై మళ్ళీ జంతు ప్రేమికులు ఆసక్తికర చర్చలు మొదలుపెట్టారు.



గత కొంత కాలంగా ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా మూగ జీవాల పై హింస కొనసాగుతూనే ఉంది. ఈ వివాదాలకు భయపడి సినిమాలు తీసే దర్శకులు కూడ తమ సినిమా ముందు వచ్చే టైటిల్ కార్డ్స్ లో తాము ఏ మూగ జీవిని హింసించ లేదనీ కేవలం గ్రాఫిక్ వర్క్స్ సహాయం మాత్రమే తీసుకున్నాము అంటూ స్పష్టంగా చెప్పవలసిన పరిస్థితులు కొనసాగుతున్నాయి..    






టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఏపీలో క్లాసులు మొదలు..

ముడతల ముఖం.. తెల్లటి గడ్డంతో నాగార్జున దొరికిపోయారు.. ఒరిజినల్ లుక్ లో కింగ్..!

సైన్ చేశాక ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది... కారణమిదే ?

మన హీరోలు దిమ్మతిరిగేలా చేస్తారా..?

పుష్ప పని మొదలైంది!

తీర్పులు పాతవి.. రాష్ట్రాలు కొత్తవి.. అందుకే జలజగడాలు..

మందు బాబులం పాట వెనుక ఆసక్తికర సంఘటన..!!

"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!

ఈ చట్టం రద్దయిన ఇంకా కేసులు పెడుతున్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>