MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-2f4e1a3e-e1a6-43be-bf6f-bb7c6cc6d661-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-2f4e1a3e-e1a6-43be-bf6f-bb7c6cc6d661-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో శర్వానంద్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అయితే శర్వానంద్ వ్యక్తిగత విషయానికి వస్తే.. విజయవాడలో జన్మించారు. ఆయన హైదరాబాద్‌లో పెరిగారు. శర్వానంద్ బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.Sharwanand {#}radhika;teja;vennela;Annayya;rana daggubati;Makar Sakranti;Father;king;Prasthanam;shankar;raja;Chiranjeevi;Industry;Hero;Hyderabad;Venkatesh;Telugu;Tamilక్యారెక్టర్ ఆర్టిస్టు నుండి స్టార్ హీరోగా ఎదిగిన శర్వానంద్..!!క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి స్టార్ హీరోగా ఎదిగిన శర్వానంద్..!!Sharwanand {#}radhika;teja;vennela;Annayya;rana daggubati;Makar Sakranti;Father;king;Prasthanam;shankar;raja;Chiranjeevi;Industry;Hero;Hyderabad;Venkatesh;Telugu;TamilTue, 06 Jul 2021 11:59:27 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో శర్వానంద్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అయితే శర్వానంద్ వ్యక్తిగత విషయానికి వస్తే.. విజయవాడలో జన్మించారు. ఆయన హైదరాబాద్‌లో పెరిగారు. శర్వానంద్ బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఇక అదే సమయంలో రానా దగ్గుబాటి, రాంచరణ్ తేజ ఇతని క్లాస్‌మేట్స్‌గా ఉన్నారు. అయితే చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నా వీరి మధ్య ఎప్పుడూ సినిమాల ప్రస్తావన ఎప్పుడు వచ్చేది కాదు.

అయితే శర్వానంద్ నాన్న ప్రసాదరావు వ్యాపారవేత్త. ఆయన అమ్మ వసుంధరాదేవి గృహిణి. శర్వానంద్ కి అన్నయ్య కల్యాణ్, అక్క రాధిక ఉన్నారు. శర్వానంద్ చిన్నప్పటి నుండి సినిమాలంటే ఉండటంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఆయన ఇండస్ట్రీలో మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఆయన చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించారు. ఇక ఆ తరవాత 'సంక్రాంతి', 'లక్ష్మి' సినిమాల్లో వెంకటేష్ తమ్ముడిగా నటించారు. అంతేకాదు.. రాజు మహారాజు'లో మోహన్‌బాబుతో కలిసి నటించారు.

ఇక సంక్రాంతి తరువాత వెన్నెల సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ఓ రకమైన సైకో పాత్రలో నటించారు. ఈ సినిమాతో ఆయన ఏ పాత్రమైన చేయగలడు అని నిర్మాతలకు నమ్మకం కలిగించాడు. అయితే ఆ తరువాత అమ్మ చెప్పింది సినిమాలో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్రలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గమ్యం సినిమాతో శర్వానంద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్థానం సినిమాతో శర్వానంద్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు.

శర్వానంద్ తెలుగు చిత్ర పరిశ్రమలతో పాటు తమిళ్ లోనూ నటించారు. ఇక ఆయన గమ్యం' తమిళ రీమేక్‌లోనూ నటించారు. ఆ తరువాత రాజా రన్ చిత్రంతో శర్వానంద్ ఒక స్టార్ హీరోగా రాణించారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, శ్రీకారం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ ఓకే ఒక్క జీవితం సినిమాలో నటిస్తున్నారు.



గంపెడు ఆశలతో బాలీవుడ్ కి వెళ్లి ఫెయిల్ అయిన స్టార్స్ వీళ్ళే

టాలెంట్ తో అగ్రతారగా ఎదిగిన రీతూ వర్మ..

అసిస్టెంట్ డైరెక్టర్ టూ స్టార్ హీరో..

ఒకటి కాదు, ఏకంగా రెండు అందులోనే .... ?? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

ఒకటి కాదు ఏకంగా రెండు అందులోనే ..... ??

కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

ఆది కోసం భారీ ప్లాన్... ఆ డైరెక్టర్ ను రంగంలోకి ?

మామను మించిన అల్లుడు.. బన్నీ సరికొత్త రికార్డు!!

అఖిల్ కోసం రంగంలోకి మమ్ముట్టి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>