PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagfaa54e9f-cad2-4c10-b9f5-269bbadda072-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagfaa54e9f-cad2-4c10-b9f5-269bbadda072-415x250-IndiaHerald.jpgప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అధికారపార్టీకి లాభం. బీజేపీ దుబ్బాకలో గెల‌వ‌డం, జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓట్లు పెంచుకోవడంలో అధికార పార్టీని వ్య‌తిరేకించే ప్ర‌జ‌లంతా ఆ పార్టీవైపు చూపు సారించారు. దీంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించారు. అది ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం కావ‌డం గ‌మ‌నార్హం. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఎన్నికలలో బీజేపీ ఊసు లేకుండా చేశారు. tag{#}Huzurabad;Mamta Mohandas;Sharmila;Josh;Nijam;KCR;Reddy;Revanth Reddy;revanth;Congress;media;Bharatiya Janata Party;Partyరేవంత్ దెబ్బ‌కు డీలా ప‌డ్డ బీజేపీ?రేవంత్ దెబ్బ‌కు డీలా ప‌డ్డ బీజేపీ?tag{#}Huzurabad;Mamta Mohandas;Sharmila;Josh;Nijam;KCR;Reddy;Revanth Reddy;revanth;Congress;media;Bharatiya Janata Party;PartyTue, 06 Jul 2021 11:43:55 GMT
ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అధికారపార్టీకి లాభం. బీజేపీ దుబ్బాకలో గెల‌వ‌డం, జిహెచ్ఎంసి ఎన్నికలలో  ఓట్లు పెంచుకోవడంలో అధికార పార్టీని వ్య‌తిరేకించే ప్ర‌జ‌లంతా ఆ పార్టీవైపు చూపు సారించారు. దీంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించారు. అది ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం కావ‌డం గ‌మ‌నార్హం. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఎన్నికలలో బీజేపీ ఊసు లేకుండా చేశారు.

బీజేపీకి పిడుగుపాటులా రేవంత్ నియామ‌కం
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బెంగాల్ ఎన్నిక‌ల్లో మమతా బెనర్జీని ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు 2023 నాటికి కెసిఆర్ ని టార్గెట్
చేస్తారనే వార్త‌లు జోరుగా వ‌స్తున్నాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి నియ‌మితుల‌వ‌డం, ఆ క్యాడ‌ర్‌లో జోష్ ఉండ‌టం, టీఆర్ ఎస్‌కు పోటీగా బీజేపీ అంటూ మాట్లాడిన‌వారు కేసీఆర్ వ‌ర్సెస్ రేవంత్‌రెడ్డి అని మాట్లాడుతుండ‌టం ఒక‌ర‌కంగా భార‌తీయ జ‌న‌తాపార్టీకి పిడుగుపాటులాంటిది. హుజురాబాద్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ‌స్థానానికి చేరుకుంటే బీజేపీకి, ఈటెల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌లెత్తుతుంది. షర్మిల పార్టీ పెట్టినప్ప‌టి నుంచి బిజెపి మ‌ద్ద‌తు ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. క్రిస్టియన్, రెడ్డి సామాజికవర్గాల ఓట్లను షర్మిలకు మళ్లించడం ద్వారా టీఆర్ ఎస్‌ను దెబ్బ‌కొట్ట‌చ్చ‌నేది బీజేపీ ప్ర‌ణాళిక‌. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన త‌ర్వాత ఆయ‌న షర్మిలను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ బలోపేతం షర్మిల ఆశ లకు భారీగా గండి కొట్టే  ప్ర‌మాదం క‌న‌ప‌డుతోంది. దీంతో బీజేపీకి ఎక్క‌డికి వెళ్లినా ఎదురుదెబ్బ‌లు తగులుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న కాంగ్రెస్‌
రేవంత్‌రెడ్డి నియామ‌కంతో కాంగ్రెస్ పార్టీ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న సామెత‌ను నిజం చేసిందంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి బ‌లోపేత‌మ‌వ‌డంతోపాటు అధికార టీఆర్ ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే స్థాయికి చేరుకుంటుంద‌నే న‌మ్మ‌కాన్ని పార్టీ శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నారు. దీంతోపాటు నిన్న‌టివ‌ర‌కు కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా ఉన్న ప‌రిస్థితి కేసీఆర్ వ‌ర్సెస్ రేవంత్‌రెడ్డిగా మార‌డం కూడా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేయ‌బోతున్న‌ప్ప‌టికీ రేవంత్ కూడా పాద‌యాత్ర చేసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. మీడియా కూడా బండి క‌న్నా రేవంత్‌నే ఎక్కువ‌గా హైప్ చేసే అవ‌కాశం కేన‌ప‌డుతోంది.



హుస్సేన్ సాగర్ లో బైక్, సిలిండర్.. కేటీఆర్ ఫైర్..!

ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అధికారపార్టీకి లాభం. బీజేపీ దుబ్బాకలో గెల‌వ‌డం, జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓట్లు పెంచుకోవడంలో అధికార పార్టీని వ్య‌తిరేకించే ప్ర‌జ‌లంతా ఆ పార్టీవైపు చూపు సారించారు. దీంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించారు. అది ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం కావ‌డం గ‌మ‌నార్హం. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఎన్నికలలో బీజేపీ ఊసు లేకుండా చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఏడో తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాల‌యంలో కీలక సమావేశం జ‌ర‌గ‌నుంది. ప‌వ‌న్‌కు క‌రోనా సోకిన త‌ర్వాత ఆయ‌న కూడా కొద్దిరోజులు స్త‌బ్దుగా ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్‌కు కరోనా సోకడంతో ఇన్నిరోజులుగా ఆయ‌న ఇంటిప‌ట్టునే ఉన్నారు. తాజాగా పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుకుద‌నాన్ని పెంచడంతోపాటు ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న అవ‌లంబిస్తోన్న అధికార పార్టీపై భారీస్థాయి పోరాటానికి సిద్ధం కావాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

రెడ్డీ సాబ్‌కు చెప్పండి... వ‌కీల్‌సాబ్ వ‌స్తున్నాడ‌ని..!!

నేడు బెంగళూరు నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ రాబోతున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీ వెళ్లబోతున్న‌ట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ఎబీఎన్ అధినేత రాధాకృష్ణ‌, టీవీ 5 అధినేత‌ను క‌లిసారు. కాగా ఇప్పుగు రామోజీరావు వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న‌ను క‌ల‌వ‌టం ఆస‌క్తి రేపుతోంది. రామోజీ రావు ను రేవంత్ రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వ‌బోతున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క లతో కూడా సమావేశంకానున్నారు.

ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు భార‌తీయ జ‌న‌తాపార్టీకి అగ్నిప‌రీక్ష‌గా మార‌బోతున్నాయి. జిల్లా ప‌రిష‌త్ స్థానాలు కాకుండా మిగ‌తా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోర‌ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. చివ‌రికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోని స్థానాల‌ను కూడా ప్ర‌తిప‌క్షాల‌కు కోల్పోయింది. స‌మాజ్‌వాదీ పార్టీ, బ‌హుజ‌న స‌మాజ్‌పార్టీ, కాంగ్రెస్‌తోపాటు, రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ క‌మలానికి స‌వాల్ విసురుతున్నాయి. పై రెండు పార్టీలు కాకుండా చిన్నా చితకా పార్టీలు ఉండ‌నే ఉన్నాయి. వీట‌న్నింటికి తోడు బీజేపీకి త‌ల‌నొప్పిలా మారిన ఆజాద్ స‌మాజ్‌పార్టీ, వికాస్ ఇన్సాస్ పార్టీ, ఆమ్ఆద్మీ కూడా రంగంలోకి దిగుతున్నాయి. వీటి ప్ర‌భావాన్ని అంత‌గా తీసిపారేయ‌డానికి వీల్లేద‌ని, గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌లు రుజువు చేశాయి.

మ‌రో మీడియా అధినేత వ‌ద్ద‌కు రేవంత్.. !

క‌మ‌లం రెక్క‌లు తుంచుతున్న "బీమ్ ఆద్మీ వికాస్‌"

సుమ‌ల‌త‌ను అడ్డంగా ప‌డుకోబెట్టి... మాజీ సీఎం తీవ్ర వ్యాఖ్య‌లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>