CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/harassment-51867c09-cd95-4bbf-8d02-80780cfcf4fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/harassment-51867c09-cd95-4bbf-8d02-80780cfcf4fc-415x250-IndiaHerald.jpgపెళ్లి చేసుకొని.. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లకు వరకట్న వేధింపులు స్వాగతం పలుకుతున్నాయి. తల్లిదండ్రులు తమ అమ్మాయిని మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఆశించిన వారికీ చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి.harassment {#}gowtam;manasa;ramya;gold;job;ramya krishnan;Husband;Parents;police;marriageదారుణం: వరకట్నం వేధింపులతో యువతీ ఆత్మహత్య..!దారుణం: వరకట్నం వేధింపులతో యువతీ ఆత్మహత్య..!harassment {#}gowtam;manasa;ramya;gold;job;ramya krishnan;Husband;Parents;police;marriageTue, 06 Jul 2021 10:00:00 GMTపెళ్లి చేసుకొని.. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లకు వరకట్న వేధింపులు స్వాగతం పలుకుతున్నాయి. తల్లిదండ్రులు తమ అమ్మాయిని మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఆశించిన వారికీ చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి. తాజాగా కట్న పిశాచుల వేధింపులను భరించలేక ఓ అబల ఆత్మహత్యకు పాల్పడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంజనగూడు తాలూకాలోని బిళిగెరె గ్రామానికి చెందిన సౌమ్యా (26)కి మూడేళ్ల కిందట మైసూరుకు చెందిన గౌతమ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే మరింత కట్నం తీసుకురావాలని ఆమెను భర్త అత్తమామలు వేధించడంతో తట్టుకోలేక ఆరునెలల క్రితం పుట్టింటికి వచ్చింది. ఇక కట్నం తీసుకుని వస్తేనే రావాలని భర్త, అత్తమామలు ఒత్తిడి చేయడంతో జీవితంపై విరక్తి చెందింది. కాగా.. వారు కోరినట్లు మూడు లక్షల నగదు, బంగారం ఇచ్చే పరిస్థితి లేదని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రులు బిళగెరె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టెక్కీ అదనపు కట్నం తేవాలని భార్యను కొట్టాడు. అయితే ఆమె ఫిర్యాదుతో పోలీసులకు అతిథిగా వెళ్లాడు. ఇక మానస గంగోత్రికి చెందిన విశాలాక్షమ్మ, యశోదరాచార్‌ దంపతుల కుమారుడు ఆనంద్‌కు మూడేళ్ల కిందట మైసూరుకే చెందిన రమ్యతో ఘనంగా వివాహం చేశారు. ఆమెకు బంగారంతో పాటు భారీగా కట్నాని ఇచ్చారు. ఆ తరువాత బెంగళూరు ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం పెట్టారు.

అయితే రమ్య గర్భవతి కావడంతో మైసూరులో పుట్టింటికి వచ్చింది. ఇక ఆనంద్‌కు ఖతార్‌ దేశంలో కొన్నాళ్లు ఉద్యోగం చేసి వచ్చాడు. ఇక రమ్యకు ఆడబిడ్డ పుట్టింది. రమ్య తన తండ్రిని తీసుకుని అత్తవారింటికి వెళ్ళింది. రమ్య అత్తమామలు అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామని భర్త తెగేసి చెప్పారు. అంతేకాక.. ఆమెపై పైశాచికంగా దౌర్జన్యం కూడా చేయడంతో చంటిపాప  కన్నుకు, ముక్కుకు గాయాలు తగిలాయి. అయితే రమ్య మైసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘరానా భర్తను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.  



పేరెంట్స్ పిల్లలను కొడితే.. ఏం జరుగుతుందంటే?

మంచు విష్ణు - వెరోనికాది ప్రేమ వివాహం కాదా... ఇంత క‌థ న‌డిచిందా ?

నేరస్థులు పారిపోతున్నారా.. అయితే కాల్చేయండి.. సీఎం ఆదేశం?

చదివింది ఏడో తరగతే.. కానీ వంద మందికి పాఠాలు బాలిక?

"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!

పెళ్లయితే విడిపోతామన్న భయం.. ఆ కవలలు ఏం చేశారంటే?

ఈ చట్టం రద్దయిన ఇంకా కేసులు పెడుతున్నారా..?

ఏం చేస్తాం ఛాన్సులు లేవు.. ఐటం అయినా ఓకే అనేసిన కాజల్..!

వీరిద్దరి గొడవకి అసలు కారణం ఏంటో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>