MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaa014434d-8f4c-40e7-b2bc-8b3ace3f238a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaa014434d-8f4c-40e7-b2bc-8b3ace3f238a-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీని గత 5 దశాబ్దాలుగా శాసిస్తున్న మెగా స్టార్ చిరంజీవి మొదటి సినిమాకు రాని స్థాయిలో ఎవరి ఊహకు అందని బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. తన మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే 100 కోట్ల కలక్షన్స్ ల క్లబ్ లో చేరిన ఇతడికి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ ను అంగీకరించకుండా ఈ మెగా మేనల్లుడు చాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.ప్రస్తుతం వైష్ణవ్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో త్వరలో ప్రారంభం కాబోతున్న ఒక మూవీలో నటించబోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో నిర్మాణం జరుపుకో బోతుnagarjuna{#}Hockey;Chiranjeevi;annapurna;News;Akkineni Nagarjuna;Cinemaవైష్ణవ్ తేజ్ మ్యానియాకు నాగార్జున ఊతం !వైష్ణవ్ తేజ్ మ్యానియాకు నాగార్జున ఊతం !nagarjuna{#}Hockey;Chiranjeevi;annapurna;News;Akkineni Nagarjuna;CinemaTue, 06 Jul 2021 10:00:00 GMTఇండస్ట్రీని గత 5 దశాబ్దాలుగా శాసిస్తున్న మెగా స్టార్ చిరంజీవి మొదటి సినిమాకు రాని స్థాయిలో ఎవరి ఊహకు అందని బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. తన మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే 100 కోట్ల కలక్షన్స్ ల క్లబ్ లో చేరిన ఇతడికి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ ను అంగీకరించకుండా ఈ మెగా మేనల్లుడు చాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం వైష్ణవ్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో త్వరలో ప్రారంభం కాబోతున్న ఒక మూవీలో నటించబోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో నిర్మాణం జరుపుకో బోతున్న ఈమూవీ కథలో వైష్ణవ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. తన పాత్రకు సంబంధించిన నటనలో సహజత్వం కోసం వైష్ణవ్ ప్రస్తుతం భాగ్యనగరంలోని ఒక స్పోర్ట్స్ అకాడమీలో ఒక కోచ్ ద్వారా హాకీ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో దర్శక విభాగంలో శిక్షణ తీసుకున్న పృధ్వీ అనే యువకుడు ఈమూవీ ద్వారా దర్శకుడుగా మారబోతున్నాడు. ఇండస్ట్రీలోని ప్రముఖ నటీనటులు వారితో పాటు ప్రముఖ సాంకేతిక నిపుణుల సహకారంతో ఈమూవీని మంచి క్వాలిటీలో తీయబోతున్నట్లు టాక్. ఈమూవీలో నటిస్తున్నందుకు నాగార్జున వైష్ణవ్ తేజ్ కు 5 కోట్లు పారితోషికంగా ఇస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.

‘ఉప్పెన’ మూవీలో నటించినందుకు ముందుగా వైష్ణవ్ కు 50 లక్షలు పారితోషికంగా ఇచ్చి ఆ తరువాత ఈమూవీ ఊహించని స్థాయిలో బ్లాక్ బష్టర్ విజయం సాధించడంతో ఈ యంగ్ హీరోకి మైత్రీ మూవీస్ సంస్థ మరొక కోటి రూపాయలు అదనపు పారితోషికంగా ఇచ్చారు అన్న వార్తలు గతంలో వచ్చాయి. అయితే ఇప్పుడు వైష్ణవ్ నటించే మూడవ సినిమాకే 5 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు రావడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగార్జున పారితోషికం ఇప్పటి వరకు 15 కోట్లు దాటలేదు. అలాంటిది ఒక యంగ్ హీరోకు ఇలాంటి భారీ పారితోషికం చూసి చాలామంది షాక్ లో ఉన్నారు..









అందాల విందుకు మీరు సిద్ధమా..?

కార్తీకదీపం సీరియల్ చూసే వారికి శుభవార్త..

ప్రభాస్ కోసం ఆమెను దించుతున్నారట!!

కళ్యాణ్ రామ్ ను వెనకుండి నడిపిస్తున్న ఎన్.టి.ఆర్ ఈసారి టార్గెట్ మిస్ అవ్వదా..!

విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సత్యదేవ్-కొరటాల మూవీ..?

దృశ్యం దర్శకుడితో మరో రీమేక్ ను లైన్ లో పెట్టిన వెంకీ!!

లక్ష్యం సినిమా ఎన్ని కోట్ల లాభాలు తెచ్చిందో తెలుసా..?

సైన్ చేశాక ఆ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది... కారణమిదే ?

కుక్కల వివాదంలో చిక్కుకున్న రాజమౌళి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>