PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modhee-govt-petrol-disel-prices91a56861-9c22-4efc-8921-406de32bdb4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modhee-govt-petrol-disel-prices91a56861-9c22-4efc-8921-406de32bdb4d-415x250-IndiaHerald.jpgగత రెండేళ్ల నుండి భారతదేశంలో ప్రజలంతా ఒకరి గురించి చర్చించుకుంటున్నారు. ఎవరి గురించి అంటే భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గురించి, ఈయన వస్తే ఏదో సాధిస్తాడని, ప్రజలంతా అభివృద్ధి బాటలో నడుస్తారని కలలు కని బీజేపీని అందలమెక్కించారు. అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడానికి ఎంతో కాలం పట్టలేదు.MODHEE GOVT-PETROL-DISEL-PRICES{#}Narendra Modi;West Bengal - Kolkata;Diesel;Petrol;Assembly;Army;media;Bharatiya Janata Party;Partyఏ పార్టీ సాధించని ఘనత సాధించిన మోదీ సర్కార్ ?ఏ పార్టీ సాధించని ఘనత సాధించిన మోదీ సర్కార్ ?MODHEE GOVT-PETROL-DISEL-PRICES{#}Narendra Modi;West Bengal - Kolkata;Diesel;Petrol;Assembly;Army;media;Bharatiya Janata Party;PartyTue, 06 Jul 2021 12:10:15 GMTగత రెండేళ్ల నుండి భారతదేశంలో ప్రజలంతా ఒకరి గురించి చర్చించుకుంటున్నారు. ఎవరి గురించి అంటే భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గురించి, ఈయన వస్తే ఏదో సాధిస్తాడని, ప్రజలంతా అభివృద్ధి బాటలో నడుస్తారని కలలు కని బీజేపీని అందలమెక్కించారు. అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడానికి ఎంతో కాలం పట్టలేదు. అధికారంలోకి వచ్చే ముందు, బీజేపీ ప్రచార బృందాలు మరియు బీజేపీ సోషల్ మీడియా వింగ్ అన్నీ కూడా మోడీని గెలిపిస్తే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయని ప్రగల్భాలు పలికారు. కానీ ఇచ్చిన మాటలను నెరవేర్చడం కాదు కదా, కనీసం ఈ విషయం వారికీ గుర్తుందా అన్న రీతిలో బీజేపీ ప్రవర్తిస్తున్న తీరు ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. చెప్పిన మాటలకు చేసిన పనులకు ఏ మాత్రం పొంతన లేదు. ఇప్పుడు ప్రజలంతా మోదీని గెలిపించి తప్పు చేశామన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించడం మాట అటుంచితే, రోజు రోజుకి పెంచుకుంటూ పోవడమే పనిగా పెట్టుకుంది మోడీ ప్రభుత్వం. ఈ విషయంలో ఒక అపప్రధను మూటగట్టుకుంది మోడీ సర్కార్. ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న ఏ పార్టీ సాధించని ఘనతను సాధించారని మాత్రం చెప్పగలం. ఎందుకంటే వారెవ్వరూ పెంచనంతగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచి రికార్డు పుటల్లోకెక్కింది. కానీ మిగిలిన ప్రభుత్వాలకు మోదీ ప్రభుత్వానికి ఒక వ్యత్యాసం ఉంది. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కనీసం ప్రజలు ఏమనుకుంటారు అన్న భయం లోపల ఉండేది. కానీ మోడీ సర్కార్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండడం ఆశ్చర్యకరం. పైగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను బోర్డర్ లో ఉన్న సైన్యం కోసం మరియు ఆయుధ వ్యవస్థను బలోపేతం చేయడానికి పెంచుతామని చెబుతుండడం మరింత హాస్యాస్పదంగా ఉంటుంది.  ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దేశంపై భక్తి లేనట్లుగా చిత్రీకరిస్తుంటారు.

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చాలా వాటిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చుపిస్తాయన్నది తెలిసిన విషయమే. అలా ఈ భారాన్ని మొత్తం ప్రజలే మోయాల్సి వస్తోంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెస్ట్ బెంగాల్ లో ఫలితాల అనంతరం భారీగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. అంటే కేవలం 66 రోజుల్లో 35 సార్లు పెట్రోల్ ధరలు, మరియు 33 సార్లు డీజిల్ ధరలు పెరగడాన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్ధం కావడం లేదు. ఇలాంటి ఎన్నో ప్రతికూలతలు కలిగి ఉన్న మోడీ సర్కారును రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గద్దె దింపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



రేవంత్ విషయంలో వాళ్ళు తప్పులో కాలేశారా?

హుస్సేన్ సాగర్ లో బైక్, సిలిండర్.. కేటీఆర్ ఫైర్..!

రేవంత్ దెబ్బ‌కు డీలా ప‌డ్డ బీజేపీ?

రెడ్డీ సాబ్‌కు చెప్పండి... వ‌కీల్‌సాబ్ వ‌స్తున్నాడ‌ని..!!

క‌మ‌లం రెక్క‌లు తుంచుతున్న "బీమ్ ఆద్మీ వికాస్‌"

జ‌గ‌న్ రెడ్డిపై రెడ్లు ఉడ‌కుతున్నారు... ఈ రెడ్ల‌ను న‌మ్మ‌లేం...!

సాయంత్రం ఏపీకి పవన్!

రేవంత్ టార్గెట్‌లో ఆ ఎమ్మెల్యే ... బెస్ట్ ఫ్రెండ్ కోస‌మే...!

రవిశాస్త్రి తప్పించడం ఎందుకు : కపిల్ దేవ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>