MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangan-commetns-on-ameerkhan-divorcedf72cc2c-2a3f-43e2-95bb-14af6d654892-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangan-commetns-on-ameerkhan-divorcedf72cc2c-2a3f-43e2-95bb-14af6d654892-415x250-IndiaHerald.jpgకరోనా పీరియడ్ లో ఆర్థిక కష్టాలు, ఆరోగ్య కష్టాలే కాదు పచ్చగా ఉన్న కాపురాలు కూడా భగ్గుమంటున్నాయి. బిల్ గేట్స్ వంటి ప్రముఖులు సైతం తన భార్యతో విడాకులు తీసుకొని షాకిచ్చారు. ఆ షాక్ నుండి తేరుకోక ముందే బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ కూడ తన సతీమణితో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడం గమనార్హం. KANGAN COMMETNS ON AMEERKHAN DIVORCE{#}Aamir Khan;Kangana Ranaut;kiran;marriage;NTR Kathanayakudu;Wife;Punjab;billGates;Coronavirus;Director;bollywood;Manamఅమీర్ ఖాన్ విడాకులపై కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్...అమీర్ ఖాన్ విడాకులపై కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్...KANGAN COMMETNS ON AMEERKHAN DIVORCE{#}Aamir Khan;Kangana Ranaut;kiran;marriage;NTR Kathanayakudu;Wife;Punjab;billGates;Coronavirus;Director;bollywood;ManamTue, 06 Jul 2021 13:09:03 GMTకరోనా పీరియడ్ లో ఆర్థిక కష్టాలు, ఆరోగ్య కష్టాలే కాదు పచ్చగా ఉన్న కాపురాలు కూడా భగ్గుమంటున్నాయి. బిల్ గేట్స్ వంటి ప్రముఖులు సైతం తన భార్యతో విడాకులు తీసుకొని షాకిచ్చారు. ఆ షాక్ నుండి తేరుకోక ముందే బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ కూడ తన సతీమణితో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడం గమనార్హం. అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్య రీనాదత్తాతో మనస్పర్ధలు రావడంతో, అవి విడాకుల వరకు వెళ్లాయి. డైవర్స్ అయ్యాక 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు అమీర్ ఖాన్. ఈమె లగాన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే  15 ఏళ్ళు ఎటువంటి విబేధాలు లేకుండా సజావుగా సాగిన కాపురం ఇప్పుడు కరోనా సమయంలో ఏకంగా విడిపోయేందుకు సిద్ధపడ్డారు.

ఈ మేరకు తన భార్యతో విడాకులు తీసుకోబోతున్న విషయాన్ని అమీర్ ఖాన్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ అంశాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా. పెద్ద చర్చనే లేవనెత్తారు ఈమె. పంజాబ్ లోని ఎన్నో కుటుంబాలు ఒక కుమారుడిని సిక్కుగా పెంచితే, మరొక కొడుకును ముస్లిం గా పెంచేవాళ్లు. అయితే ఈ ఆచారాన్ని హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ అమీర్ ఖాన్ సర్ విషయానికి వస్తే ఈయన ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన పిల్లలు మాత్రం ఎందుకు ముస్లింగా గుర్తించబడుతారనేది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఒక మహిళ  ఎందుకు హిందువుగా కొనసాగే అవకాశం లేదు. ప్రపంచం ఎంతగానో ఆధునీకరణ చెందుతోంది. మారుతున్న కాలంతో పాటు ఈ పద్దతిని కూడ మనం మార్చాలి. ’ అంటు మతాల గురించి మాట్లాడుతూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్. ఇలా తనకు సంబంధం లేని విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎటువంటి పరిణామాలను ఎదుర్కోనుందో చూడాల్సి ఉంది. కాగా దీనిపై ఇతర మతాలు మరియు అమీర్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.



న్యాయ విద్యార్థిగా వచ్చి.. స్టార్ యాంకర్ గా స్థానం..

మాస్కుతో ఇంత ప్రమాదమా..?

కెరీర్ మొదట్లో.. నువ్విలా సినిమాలో మెరిసిన విజయ్ దేవరకొండ.. ?

కొరటాల శివ తో సాయి ధరమ్ తేజ్.. అలా మిస్ అయ్యింది?

టాలీవుడ్ లో మొట్ట మొదటి ఫ్యాక్షన్ చిత్రం ఏంటో తెలుసా. ?

బుల్లితెర‌పై క్యాస్టింగ్ కౌచ్‌.. కార్తీక‌దీపం ప్రియ‌మ‌ణిని కోరిక తీర్చ‌మందెవ‌రు ?

బుల్లి పిట్ట: డ్రోన్ కెమెరా తరహాలో మొబైల్ కెమెరా..

భయం తీసిన ప్రాణం.. అసలు ఏం జరిగిందంటే..!

హమ్మయ్య.. తగ్గుతున్నాయ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>