PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-lokesh269e5a89-51a7-443c-97b9-bd8f46d4ae94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-lokesh269e5a89-51a7-443c-97b9-bd8f46d4ae94-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, వైసీపీని ఇరుకున పెట్టాలన్నా అతి కొద్ది సమస్యలే ప్రతిపక్షాలకు అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా నగదు బదిలీ పథకాలతో అన్ని వర్గాలను సంతృప్తి చేస్తున్న జగన్ కు, ఆ చిన్న చిన్న సమస్యలు కూడా ప్రతిబంధకాలు కావు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం అవే బ్రహ్మాస్త్రాలు. అందుకే ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ అదే పాయింట్ ని పట్టుకుని నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. జాబ్ లెస్ క్యాలెండర్ అంటూ విరుచుకుపడుతున్నాయి. pawan lokesh{#}Grama Sachivalayam;Pawan Kalyan;un employment;job;Lokesh;Lokesh Kanagaraj;TDP;YCP;Bharatiya Janata Party;Yevaru;Jagan;Governmentపవన్ కల్యాణ్ ని నోరెత్తకుండా చేస్తున్న లోకేష్..పవన్ కల్యాణ్ ని నోరెత్తకుండా చేస్తున్న లోకేష్..pawan lokesh{#}Grama Sachivalayam;Pawan Kalyan;un employment;job;Lokesh;Lokesh Kanagaraj;TDP;YCP;Bharatiya Janata Party;Yevaru;Jagan;GovernmentTue, 06 Jul 2021 07:25:48 GMTఏపీలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, వైసీపీని ఇరుకున పెట్టాలన్నా అతి కొద్ది సమస్యలే ప్రతిపక్షాలకు అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా నగదు బదిలీ పథకాలతో అన్ని వర్గాలను సంతృప్తి చేస్తున్న జగన్ కు, ఆ చిన్న చిన్న సమస్యలు కూడా ప్రతిబంధకాలు కావు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం అవే బ్రహ్మాస్త్రాలు. అందుకే ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ అదే పాయింట్ ని పట్టుకుని నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. జాబ్ లెస్ క్యాలెండర్ అంటూ విరుచుకుపడుతున్నాయి.

వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో జగన్ చేపట్టిన భారీ రిక్రూట్ మెంట్ తో ఏపీలో నిరుద్యోగులు చాలమంది ఉద్యోగాల్లో కుదురుకున్నారు. కానీ అవి ప్రభుత్వ ఉద్యోగాలా, కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగాలా అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత పర్మినెంట్ చేయాలంటే కొన్ని పరీక్షలు పెడతామంటోంది ప్రభుత్వం. వాటి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ దశలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ పోస్టుల్ని కూడా అందులో చూపించింది. అదే సమయంలో గ్రూప్-1, గ్రూప్-2 వంటి ఉన్నతోద్యోగాల భర్తీపై చేతులెత్తేసింది. దీంతో సహజంగానే నిరుద్యోగుల కడుపుమండింది. గ్రూప్-1 పోస్ట్ లకోసం ఎదురు చూస్తున్న చాలామంది ఈమధ్య సచివాలయం పోస్ట్ లతో, నెలకు 15వేల రూపాయల వేతనంతో సర్దుకుపోయారు. వారందరూ ఎప్పటికైనా గ్రూప్స్ ఉద్యోగాలు రాయాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ ప్రభుత్వం చూపెట్టిన ఖాళీలు, రిక్రూట్ మెంట్ కోసం ప్రకటించిన క్యాలెండర్ లో వాటి సంఖ్య చాలా తక్కువ. దీంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు.

ఈ దశలో నిరుద్యోగులకు అండగా నిలబడటానికి, ఆ సమస్యను తలెత్తుకోడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నారా లోకేష్, ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో తన ఆవేదన వ్యక్తం చేస్తూ జూమ్ మీటింగ్ లతో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా జనాల్లోకి వచ్చేందుకు ఇదే సబ్జెక్ట్ ని ఎంపిక చేసుకోడానికి సిద్ధమయ్యారు. అయితే పవన్ వారాలు, వర్జ్యాలు, మహూర్తాలు చూసుకుని వస్తాననడంతో అంతకు ముందుగానే లోకేష్.. జాబ్ క్యాలెండర్ పై సమరశంఖం పూరించారు. పవన్ కల్యాణ్ హైలెట్ చేయాలనుకుంటున్న సమస్యను లోకేష్ హైజాక్ చేశారు లోకేష్. వీరిద్దరిలో నిరుద్యోగుల తరపున ఎవరు ఉద్యమం మొదలు పెడతారు, ఎవరు చురుగ్గా జనాల్లోకి వెళ్తారు, చివరికి ఎవరు మైలేజీ దక్కించుకుంటారనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి పవన్ కాస్త ఆలస్యం కావడంతో, లోకేష్ స్పీడందుకున్నారని చెప్పొచ్చు.



తీర్పులు పాతవి.. రాష్ట్రాలు కొత్తవి.. అందుకే జలజగడాలు..

జగన్ - షర్మిల కలవడం లేదా?

మందు బాబులం పాట వెనుక ఆసక్తికర సంఘటన..!!

"మహిళలకు మాత్రమే" అంటున్నఆర్టీసీ..!

కరోనా వస్తే 20 రోజులు సెలవులు.. సీఎం జగన్ ఆదేశం?

కృష్ణా వివాదం: జగన్, కేసీఆర్ ఎవరు కరెక్ట్..?

టార్గెట్ యూపీ.. వారికే తొలి ప్రాధాన్యం!

టార్గెట్ సజ్జల... జగన్ కి రఘురామ లేఖ

ఏపీలో జాబ్ క్యాలెండర్ ని వ్యతిరేకిస్తున్న నిరుద్యోగులకు అండగా నిలబడటానికి, ఆ సమస్యను తలెత్తుకోడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నారా లోకేష్, ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో తన ఆవేదన వ్యక్తం చేస్తూ జూమ్ మీటింగ్ లతో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా జనాల్లోకి వచ్చేందుకు ఇదే సబ్జెక్ట్ ని ఎంపిక చేసుకోడానికి సిద్ధమయ్యారు. అయితే పవన్ వారాలు, వర్జ్యాలు, మహూర్తాలు చూసుకుని వస్తాననడంతో అంతకు ముందుగానే లోకేష్.. జాబ్ క్యాలెండర్ పై సమరశంఖం పూరించారు. పవన్ కల్యాణ్ హైలెట్ చేయాలనుకుంటున్న సమస్యను లోకేష్ హైజాక్ చేశారు లోకేష్.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>