CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-88fdb403-3138-4c42-b345-79c5ffab5034-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-88fdb403-3138-4c42-b345-79c5ffab5034-415x250-IndiaHerald.jpgసమాజంలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మార్పు చెందుతున్న సమాజం ప్రాచ్యత్య దేశాల అలవాట్లు మనకు కూడా వస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో పెళ్లంటే ఒక పవిత్ర బంధంగా భావిస్తారు. దీనికి ఎన్నో నియమాలు, నిబంధనలు హంగులు, ఆర్భాటాలు ఎంతో ఖర్చు పెట్టి వివాహం చేస్తుంటారు. కానీ కొంతమందికి వివాహమే ఇబ్బంది పెడితే.. ఏం జరుగుతుంది.. అలాంటి ఓ మహిళ పెళ్లి చేసుకుంది. తన భర్త ప్రతి రోజూ తాగి వచ్చి తనను కొట్టేవాడు. అయినా భరించి, తనను మార్చుకుందామని అనుకుంది. ఎంత చెప్పినా మాCrime {#}Manam;Husband;Father;local language;House;Traffic police;marriage;News;policeభర్తతో లొల్లి.. మామతో పెళ్లి.. చూస్తే షాకవ్వాల్సిందే..?భర్తతో లొల్లి.. మామతో పెళ్లి.. చూస్తే షాకవ్వాల్సిందే..?Crime {#}Manam;Husband;Father;local language;House;Traffic police;marriage;News;policeTue, 06 Jul 2021 10:05:00 GMTసమాజంలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా విచిత్రంగా  అనిపిస్తుంది. మార్పు చెందుతున్న సమాజం ప్రాచ్యత్య దేశాల అలవాట్లు మనకు కూడా వస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో పెళ్లంటే ఒక పవిత్ర బంధంగా భావిస్తారు. దీనికి  ఎన్నో నియమాలు, నిబంధనలు హంగులు, ఆర్భాటాలు ఎంతో ఖర్చు పెట్టి వివాహం చేస్తుంటారు. కానీ కొంతమందికి వివాహమే ఇబ్బంది పెడితే.. ఏం జరుగుతుంది.. అలాంటి ఓ మహిళ  పెళ్లి చేసుకుంది. తన భర్త  ప్రతి రోజూ తాగి వచ్చి  తనను కొట్టేవాడు. అయినా భరించి, తనను మార్చుకుందామని అనుకుంది. ఎంత చెప్పినా మారకపోవడం తో  విసుగు చెందిన ఆమె అతనికి విడాకులు ఇచ్చింది. తర్వాత  విడాకులు ఇచ్చిన భర్త యొక్క తండ్రిని ఆమె పెళ్లి చేసుకుని భర్తకు సవతి తల్లి అయింది. అదెక్కడో చూద్దామా.?

 మానవ సమాజంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. చాలా కుటుంబాలలో తండ్రికి కొడుక్కి అభిప్రాయభేదాలు వస్తు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలను మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఉత్తర ప్రదేశ్లో మాత్రం ఈ విచిత్ర సంఘటన జరిగింది. కొడుకు విడాకులు ఇచ్చిన  యువతిని తన తండ్రి వివాహం  చేసుకున్నాడు. అంటే అప్పటివరకు కొడుకు భార్యగా ఉన్న యువతి ఇప్పుడు అదే కొడుకుకు సవతి తల్లి అయింది. ఉత్తరప్రదేశ్లోని బాధయా జిల్లాలో 2016లో  మైనర్ గా ఉన్నప్పుడే ఓ జంట వివాహం చేసుకున్నారు. తర్వాత ఆ యువకుడు ఎప్పుడూ తన తండ్రితో గొడవకు దిగేవాడు. పైగా మందు బాబు. విసిగి పోయిన ఆ యువతి అతని నుంచి విడాకులు కావాలని అడిగింది. కానీ ఆ యువకులు విడాకులు ఇవ్వడానికి నిరా కరించారు. అయినా ఆమె పట్టుతో విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ యువకుల యొక్క తండ్రి కూడా ఇల్లు వదిలి  వెళ్ళిపోయాడు. తన తండ్రి కనిపించకుండా పోయాడని, ఆ తండ్రి ఆచూకి  కనిపెట్టాలని స్థానిక పంచాయతీ ఆఫీస్ లో సమాచార హక్కు చట్టం కింద  దాఖలు చేశారు. దీంతో అధికారులు తన తండ్రి సమాచారం తెలుసుకుని  ఆ యువకుడికి అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న సదరు యువకుడు షాక్ కు గురయ్యారు.

 తనతో విడాకులు తీసుకున్న సదరు యువతి 48 సంవత్సరాలు ఉన్న తన తండ్రిని పెళ్లి చేసుకొని మరో ప్రాంతంలో సంసారం చేస్తున్నాడని తెలుసుకొని ఆశ్చర్య పోయాడు. తన తండ్రి, భార్యపై   బేసౌలి పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని పిలిచి విచారణ చేశారు. కానీ అక్కడ కూడా ఆ తండ్రీ కొడుకులిద్దరూ గొడవకు దిగారు. దీని పరిస్థితి ఇబ్బందిగా తయారైంది. అయితే సవతి తల్లిగా మారిన ఆమె మాత్రం రెండో భర్తతోనే సుఖంగా  ఉన్నానని, తన మొదటి భర్త దగ్గరికి వెళ్లలేనని పోలీసుల ముందు తేల్చి చెప్పింది.



ఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంపం.. !

దారుణం: హైవేపై మహిళ బట్టలు విప్పేసి మరీ..?

కార్తీకదీపం సీరియల్ చూసే వారికి శుభవార్త..

విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సత్యదేవ్-కొరటాల మూవీ..?

దారుణం: వరకట్నం వేధింపులతో యువతీ ఆత్మహత్య..!

వైష్ణవ్ తేజ్ మ్యానియాకు నాగార్జున ఊతం !

జూలై 19 నుంచి ఆంక్షల ఎత్తివేత.. స్పష్టం చేసిన ప్రధాని?

రాత్రుళ్ళు కూడా సీబీఐ ఆన్ డ్యూటీ!

దారుణంగా మోసపోయిన 8 మంది భారతీయులు .. ఎట్టకేలకు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>