MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroesf710bbd0-2127-4eee-b594-59d9b6603db3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroesf710bbd0-2127-4eee-b594-59d9b6603db3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్లకే కష్టాలు అన్నీ అని వింటూ ఉంటారు. హీరోలకేం మహారాజులు అని కూడా అసూయపడే మాటలు వినిపిస్తూంటాయి. అయితే రోజులు ఎపుడూ ఒకేలా ఉండవు, ఓడలు బళ్ళు కూడా కావచ్చు. ఇపుడు అలాంటి పరిస్థితే వచ్చిందా ఆన్న చర్చ అయితే టాలీవుడ్ లో ఉంది. heroes{#}Tollywoodటాలీవుడ్ హీరోలకే అసలైన పోటీ ... ?టాలీవుడ్ హీరోలకే అసలైన పోటీ ... ?heroes{#}TollywoodTue, 06 Jul 2021 19:01:12 GMTటాలీవుడ్ లో హీరోయిన్లకే కష్టాలు అన్నీ అని వింటూ ఉంటారు. హీరోలకేం మహారాజులు అని కూడా అసూయపడే మాటలు వినిపిస్తూంటాయి. అయితే రోజులు ఎపుడూ ఒకేలా ఉండవు, ఓడలు బళ్ళు కూడా కావచ్చు. ఇపుడు అలాంటి పరిస్థితే వచ్చిందా ఆన్న చర్చ అయితే టాలీవుడ్ లో ఉంది.

ముఖ్యంగా కరోనా తరువాత సినిమా మేకింగ్ పెద్ద సవాల్ గా మారింది. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడం మరో ఎత్తు. సినిమా థియేటర్ లోకి రావాలి అంటే కరోనా నెమ్మదించాలి, లాక్ డౌన్ నిబంధనలు ఉండరాదు. జనాలు కూడా భయం వీడి మంచి మూడ్ లో ఉండాలి. వారి సినిమాకు రావాలి, హిట్ చేయాలి. ఇలా చాలా విషయాలు మేకర్స్ కి ఉన్నాయి. దాంతో సినిమా తీయడంలోని కష్టాలు అన్నీ వారికి గతం కంటే ఎక్కువగా అర్ధమవుతున్నాయి.

ఇదిలా ఉంటే కరోనా వచ్చినా మరేం జరిగినా కానీ అంటూ కొందరు హీరోలు తమ పారితోషికాన్ని అలా పెంచుకుంటూనే పోతున్నారు. వారికి తమ డిమాండ్ ముఖ్యం. తాము సినిమా చేస్తేనే కధ సాగుతుంది అన్న ధీమాతో ఉన్న‌ వారు ఉన్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కొందరు నిర్మాతలు షాక్ తింటున్నారు. కరోనా వల్ల సినిమా పరిశ్రమకు అతి పెద్ద దెబ్బ పడిపోయింది. ఈ సమయంలో అంతా కలసి కూర్చుని కష్టనష్టాలు భరించాల్సి ఉండగా కొందరి హీరోల తీరు మాత్రం వేరేగా ఉందని మధన పడుతున్నారు. ఆ మధనం నుంచి పుట్టుకొచ్చిందే పక్క రాష్ట్రం నుంచి హీరోలను తీసుకురావడం.

నిజానికి పొరుగు రాష్ట్రంలోని హీరోలకు మంచి డిమాండ్ ఉంది. చక్కని మార్కెట్ ఉంది. కానీ వారి పారితోషికాలు టాలీవుడ్ లో చాలా మంది అగ్ర హీరోలతో పోలిస్తే సగానికి సగం ఉన్నాయి. దాంతో వారిని తెలుగు తెర మీద చూపించి తమ సత్తా చాటడానికి కొందరు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఇపుడు చాలా మంది పరాయి భాషా హీరోలు తెలుగు తెర మీద మెరిసిపోనున్నారు. వీరి సంఖ్య పెరిగి హిట్లు వస్తే కనుక టాలీవుడ్ లో కొందరు హీరోలకు అసలైన సవాల్ ఎదురవుతుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే టాలీవుడ్ లో ఇపుడు హీరోలకే పెద్ద పోటీ ఎదురవుతోంది అన్న మాట వినిపిస్తోంది.








టాలీవుడ్ లో హీరోయిన్లకే కష్టాలు అన్నీ అని వింటూ ఉంటారు. హీరోలకేం మహారాజులు అని కూడా అసూయపడే మాటలు వినిపిస్తూంటాయి. అయితే రోజులు ఎపుడూ ఒకేలా ఉండవు, ఓడలు బళ్ళు కూడా కావచ్చు. ఇపుడు అలాంటి పరిస్థితే వచ్చిందా ఆన్న చర్చ అయితే టాలీవుడ్ లో ఉంది.

పెళ్లై 10 ఏళ్ళు అయిన పిల్లలు లేకపోవడం పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు

సమంత బాటలో రకుల్.. అలా చేసేందుకు రెడీ?

టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన మురళి మోహన్..

మహేష్ కాదన్నదే ధనుష్ ఓకే అన్నాడా..!

ఆ సినిమా అంటే తారక్ భార్యకు చచ్చేంత కోపం ఆట

సూపర్ స్టార్ తో జోడీ కట్టనున్న లేడీ సూపర్ స్టార్..!!

మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రియా ?

తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఇవే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>