Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsa50936e5-2205-454c-acb1-98f7cad37388-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsa50936e5-2205-454c-acb1-98f7cad37388-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోల బాట లోనే నడిచి ఉన్న క్రేజ్ ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం f3, గని సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా బాలీవుడ్ లో ఉంటుందని లేటెస్ట్ టాక్. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ ముగిశాయట. సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని తెలుస్తుంది. నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారట. తెలుగు, హిందీ భాషల్లోVarun-Tej {#}varun tej;Telugu;Tollywood;bollywood;Hindi;Darsakudu;Director;Cinema;Sony;Indiaఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ బాటలో వరుణ్ తేజ్..!ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ బాటలో వరుణ్ తేజ్..!Varun-Tej {#}varun tej;Telugu;Tollywood;bollywood;Hindi;Darsakudu;Director;Cinema;Sony;IndiaTue, 06 Jul 2021 07:00:00 GMTస్టార్ హీరోల బాట లోనే నడిచి ఉన్న క్రేజ్ ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం f3, గని సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా బాలీవుడ్ లో ఉంటుందని లేటెస్ట్ టాక్. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ ముగిశాయట. సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని తెలుస్తుంది. నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారట. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఈమధ్యనే కథ విన్న వరుణ్ తేజ్ స్టోరీ నచ్చడంతో సినిమాకు ఓకే చేసినట్టు తెలుస్తుంది.

తెలుగు హీరోలంతా పాన్ ఇండియా ఇమేజ్ మీద పడ్డారు. వరుణ్ తేజ్ కూడా వారి బాటలోనే బాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్ కటౌట్ బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోదు అందుకునే అతనితో బాలీవుడ్ లో ఓ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. సోనీ పిక్చర్స్ ఈ సినిమాను ప్రెస్టిజియస్ గా నిర్మిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి కాగానే వరుణ్ తేజ్సినిమా మీద ఫోకస్ పెడతారని తెలుస్తుంది.

సినిమాలో వరుణ్ తేజ్ ఎలా కనిపిస్తాడు. మొదటిసారి టాలీవుడ్ దాటి బయటకు వెళ్తున్న వరుణ్ తేజ్ ఎలాంటి కథతో వస్తున్నాడు. ఇవన్ని తెలియాలంటే సినిమా గురించి అఫీషియల్ న్యూస్ రావాల్సిందే. త్వరలోనే దీనికి సంబందించిన అప్డేట్ వస్తుందని తెలుస్తుంది. వరుణ్ తేజ్ వేసిన ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. తెలుగు, హిందీ భాషల్లో సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న మన టాప్ హీరోలకు వరుణ్ తేజ్ కూడా ఆ రేంజ్ లో పోటీ ఇస్తాడా లేదా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పలేం.  





పుష్ప పని మొదలైంది!

మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడుతున్న హీరోలు, చింపిరి జుట్టుతో, సిక్స్ ప్యాక్ తో మాస్ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం

మందు బాబులం పాట వెనుక ఆసక్తికర సంఘటన..!!

కరోనా వస్తే 20 రోజులు సెలవులు.. సీఎం జగన్ ఆదేశం?

కృష్ణా వివాదం: జగన్, కేసీఆర్ ఎవరు కరెక్ట్..?

ఏం చేస్తాం ఛాన్సులు లేవు.. ఐటం అయినా ఓకే అనేసిన కాజల్..!

సెలిబ్రెటీల విడాకుల పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు !

వీరిద్దరి గొడవకి అసలు కారణం ఏంటో తెలుసా ?

దిల్ రాజు’కి షాక్ ఇచ్చిన నటసింహం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>