MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mehreen-46d042d7-2e91-4b77-b8da-104ae5e35ff3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mehreen-46d042d7-2e91-4b77-b8da-104ae5e35ff3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఇటీవలే తన ఎంగేజ్మెంట్ మరియు జరగబోయే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలం ప్రేమ తర్వాత మాజీ సీఎం మనవడు, యువనేత భవ్య బిస్నోయ్ తో మార్చి 13 న రాజస్థాన్ లోని జోద్ పూర్ విల్లా లో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో బంధువులు, కుంటుంబ స‌భ్యుల మ‌ధ్య‌ వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం జ‌రిగిన నాలుగు నెలల్లోనే వ్యక్తిగత కారణాల వల్ల నిశ్చితార్థాన్ని, పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ఈ జంట ప్రకటించారు. దాంతో ఒక్క సారిగా అంద‌రూmehreen {#}bhavya;prema;Rajasthan;marriage;F2;Love;Heart;March;media;CM;Audience;Cinema;Heroineమెహరీన్ జ్ఞాపకాలను చేరిపేయలేకపోతున్న బిస్నోయ్.. ?మెహరీన్ జ్ఞాపకాలను చేరిపేయలేకపోతున్న బిస్నోయ్.. ?mehreen {#}bhavya;prema;Rajasthan;marriage;F2;Love;Heart;March;media;CM;Audience;Cinema;HeroineTue, 06 Jul 2021 14:45:58 GMTటాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఇటీవలే తన ఎంగేజ్మెంట్ మరియు జరగబోయే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలం ప్రేమ తర్వాత మాజీ సీఎం మనవడు, యువనేత భవ్య బిస్నోయ్ తో మార్చి 13 న రాజస్థాన్ లోని జోద్ పూర్ విల్లా లో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో బంధువులు, కుంటుంబ స‌భ్యుల మ‌ధ్య‌ వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం జ‌రిగిన నాలుగు నెలల్లోనే వ్యక్తిగత కారణాల వల్ల నిశ్చితార్థాన్ని, పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ఈ జంట ప్రకటించారు. దాంతో ఒక్క సారిగా అంద‌రూ షాక్ అయ్యారు. ఇకపై బిస్నోయ్ తో గానీ అతని కుటుంబ సభ్యులతో గాని త‌న‌కు ఎలాంటి సంబంధం ఉండదని...తన హార్ట్ చెప్పిందే తాను వింటున్నానని మెహరీన్ వెల్లడించింది. 

దాంతో బిస్నోయ్ కుటుంబ స‌భ్యుల వ‌ల్ల‌నే ఇద్దరూ విడిపోయార‌ని బిస్నోయ్ కుటుంబంపై కొంత మంది నెటిజన్లు విమర్శలు కురిపించారు. అయితే ఈ విమర్శలపై భ‌వ్య బిస్నోయ్ స్పందించారు. తన కుటుంబంపై విమర్శలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సెలబ్రిటీలు ప్రేమించి విడిపోయాక, లేదంటే వైవాహిక‌ జీవితానికి గుడ్ బై చెప్పున్న త‌ర‌వాత ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫోటోల‌ను వీడియోల‌ను సోషల్ మీడియా నుండి వెంటనే డిలీట్ చేస్తారు. అలాగే మెహ‌రీన్ కూడా బిస్నోయ్ తో దిగిన ఫోటోల‌ను, త‌న నిశ్చితార్థం ఫోటోల‌ను సోషల్ మీడియా నుండి తీసి వేసింది. కానీ బిస్నోయ్ మాత్రం ఇప్పటికీ మెహరీన్ తో క‌లిసి దిగిన‌ ఫోటోలను, నిశ్చితార్థం ఫోటోల‌ను డిలీట్ చేయకుండా అలాగే ఉంచారు.

దాంతో ఇప్పటికీ మెహరీన్ జ్ఞాపకాలను బిస్నోయ్ చెరిపివేయ‌లేద‌దంటూ ప‌లువురు నెటిజ‌న్ లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది ఇలా ఉంటే మెహరీన్ పెళ్లి క్యాన్సిల్ కావడంతో మళ్లీ సినిమాల్లో కొనసాగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఎఫ్ 3 సినిమా షూటింగ్ లో కూడా మెహరిన్ జాయిన్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎఫ్ 2 లో మెహరీన్ హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ కీలక పాత్రలో నటించింది. దాంతో ప్రేక్షకులు మెహరీన్ క్యారెక్టర్ ను ఎంతో ఎంజాయ్ చేశారు. మ‌రి ఎఫ్ 3 లోనూ మెహరీన్ హనీ ఈజ్ ది బెస్ట్ అనిపించుకుంటుందా..? లేదా చూడాలి.





తమిళంలోకి డబ్ అవుతున్న తెలుగు బ్లాక్ బస్టర్

రోజా చేసిన ఇంగ్లీష్ సినిమా ఏంటి. ?

థైస్ షోతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ..!

మహేష్ బాబు చిత్రం సూపర్ హిట్.. కానీ నిర్మాతకు మాత్రం నష్టం..

మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రియా ?

ఎన్టీఆర్ కి కొరటాల కథ నచ్చలేదట.. ఎందుకో తెలుసా..?

సైడ్ యాక్టర్ నుంచి హిట్ హీరో గా మారిన శ్రీ విష్ణు

తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఇవే

త్రిష హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన సినిమా ఎదో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>