WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedheeb2c300a-7a4b-483a-bc78-d4818ac34e1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedheeb2c300a-7a4b-483a-bc78-d4818ac34e1f-415x250-IndiaHerald.jpgజీవితంలో ఎంతోకష్టపడి బాగా చదువుకుని ఉద్యోగాలను పొందుతారు. అయితే చాలా మంది వారి మొదటి ఉద్యోగం పొందిన తరువాత తడబడుతూ, ఉద్యోగ నిర్వహణలో కొన్ని పొరపాట్లు చేస్తూ అక్కడ ఇమడలేక కొన్ని సమయాల్లో ఉద్యోగాలను సైతం పోగొట్టుకుంటూ ఉంటారు. మరి కొందరు మాత్రం పొందిన ఉద్యోగం పట్ల ఎంతో శ్రద్ధతో మంచిగా చేసుకుంటూ పోతుంటారు. VIJAYAM MEEDHE{#}Smart phone;Kanna Lakshminarayana;House;marriage;jobవిజయం మీదే: ఉద్యోగ నిర్వహణలో పాటించాల్సిన నియమాలివే ?విజయం మీదే: ఉద్యోగ నిర్వహణలో పాటించాల్సిన నియమాలివే ?VIJAYAM MEEDHE{#}Smart phone;Kanna Lakshminarayana;House;marriage;jobTue, 06 Jul 2021 21:00:00 GMTజీవితంలో ఎంతోకష్టపడి బాగా చదువుకుని ఉద్యోగాలను పొందుతారు. అయితే చాలా మంది వారి మొదటి ఉద్యోగం పొందిన తరువాత తడబడుతూ, ఉద్యోగ నిర్వహణలో కొన్ని పొరపాట్లు చేస్తూ అక్కడ ఇమడలేక కొన్ని సమయాల్లో ఉద్యోగాలను సైతం పోగొట్టుకుంటూ ఉంటారు. మరి కొందరు మాత్రం పొందిన ఉద్యోగం పట్ల ఎంతో శ్రద్ధతో మంచిగా చేసుకుంటూ పోతుంటారు. మంచి మంచి ప్రమోషన్ లను పొందుతూ హాయిగా జీవిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ ఇలాగే మంచిగా యాజమాన్యం దగ్గర మంచి పేరును మరియు ప్రమోషన్ లను పొందాలంటే కొన్ని నియమాలను లేదా లక్షణాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవేమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము.

ఉద్యోగం పొందిన వారిలో రెండు రకాల వారు ఉంటారు. ఒక రకం వారికి ఉద్యోగం అవసరం ఉండదు. కానీ ఉద్యోగం ఏదో పెళ్లి చేసుకోవడం కోసమో, లేదా టైం పాస్ కోసమో చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఎన్ని విషయాలు చెప్పినా ఉపయోగం లేదు. కానీ రెండవ రకం వారికి మాత్రం ఆ ఉద్యోగం రాకపోతే ఎన్నో నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. వారింట్లో అతనొక్కడి ఉద్యోగం ద్వారానే ఇల్లు గడిచే పరిస్థితి కావొచ్చు. ఇలా ఏదైనా అత్యవసరమయిన కారణం ఉండొచ్చు. అలంటి వారికి ఇవి బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాము.

* ముందుగా ఉద్యోగంలో చేరిన తరువాత మీ తోటి సహోద్యోగులతో చాలా గౌరవంతో మెలగాలి. కొంతకాలం వరకు వారికి నచ్చిన విధంగా మెలగాలి. మీకు తెలియని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.

* మీ ఆఫీస్ పని వేళకు ఖచ్చితంగా హాజరు కావాలి. ప్రతి కంపెనీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. నీకు పని మీద శ్రద్ధ ఉందో లేదా తెలియాలంటే సమయానికి వస్తావు కదా అన్నది కంపెనీ ఆలోచన. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆలస్యంగా రాకూడదు.

* మీకు ఇచ్చిన పనిని నిర్ణీత సమయం లోపల మాత్రమే పూర్తి చేయవలెను. ఇది మీ ప్రమోషన్ విషయంలో బాగా హెల్ప్ అవుతుంది. చేసే పనిలో నాణ్యత ఉండాలి, అంటే ఇచ్చిన సమయంలో చెయ్యాలి కదా అని పొరపాట్లు చేయకూడదు.
పర్ఫెక్ట్ గా పనిని పూర్తి చెయ్యాలి.

* కంపెనీ లో ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే మీ వంతు బాధ్యతగా యాజమాన్యానికి తెలియచేయాలి. అంతే కానీ నా కన్నా సీనియర్ చెప్పడం లేదు కదా అని చూస్తూ ఉండకూడదు. ఈ విషయంలో మీ బాధ్యతను మరియు నిజాయితీని కంపెనీ యాజమాన్యం ఖచ్చితంగా గుర్తిస్తుంది.

* కంపెనీ మీటింగ్ సమయంలో లేదా రివ్యూ మీటింగ్ లాంటివి పెట్టినప్పుడు మీ వంతు పార్టిసిపేషన్ చెయ్యాలి. గుంపులో గోవిందలాగా ఉండకూడదు. అలాంటి సంమయంలోనే మీ ప్రతిభ యాజమాన్యానికి తెలిసేలాగా చేయాలి.

* మీ బాస్ ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఫోన్ చేస్తే అలర్ట్ గా ఉండాలి. అంతే కానీ ఫోన్ చేసినా తీయకపోవడం లేదా మీరెవరితోనైనా మాట్లాడుతూ ఉండడం లాంటివి చేస్తే, వారికి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని అర్ధమవుతుంది.

* అన్నిటికన్నా ముఖ్యమైనది టైం బౌండ్ పెట్టుకోకూడదు. ఏ సమయంలోనైనా కంపెనీకి మీ అవసరం వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలి.

ఇలా పైవిషయాలన్నీ మీరు గుర్తుంచుకుని పాటించినట్లయితే కంపెనీ యాజమాన్యం దగ్గర మంచి పేరుతో పాటుగా ప్రమోషన్ లు కూడా వస్తాయి.



ఆరోగ్యశ్రీ ఉంటే చాలు.. ఏపీలో ప్రతి కుటుంబానికి 50 వేలు.. కానీ?

జీవితంలో ఎంతోకష్టపడి బాగా చదువుకుని ఉద్యోగాలను పొందుతారు. అయితే చాలా మంది వారి మొదటి ఉద్యోగం పొందిన తరువాత తడబడుతూ, ఉద్యోగ నిర్వహణలో కొన్ని పొరపాట్లు చేస్తూ అక్కడ ఇమడలేక కొన్ని సమయాల్లో ఉద్యోగాలను సైతం పోగొట్టుకుంటూ ఉంటారు. మరి కొందరు మాత్రం పొందిన ఉద్యోగం పట్ల ఎంతో శ్రద్ధతో మంచిగా చేసుకుంటూ పోతుంటారు.

కేసీఆర్, కేటీఆర్ లకు షాక్ ఇచ్చిన హిమాన్షు.. పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదట?

స్నేహితుల కోరిక తీర్చమన్న ప్రియుడు.. ట్విస్ట్ ఇచ్చిన మహిళ?

కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా?

జగపతి బాబు పెళ్లి కానుక హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?

పెళ్లై 10 ఏళ్ళు అయిన పిల్లలు లేకపోవడం పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు

దేవుడి దయ వల్ల బాలీవుడ్ వ్యక్తిని పెళ్లాడలేదు : సోనమ్ కపూర్..

విద్యాశాఖ మంత్రికి నిర‌స‌న సెగ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>