PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagbaaaf1aa-5f5d-450e-ba1e-e971eae968a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagbaaaf1aa-5f5d-450e-ba1e-e971eae968a0-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఏడో తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాల‌యంలో కీలక సమావేశం జ‌ర‌గ‌నుంది. ప‌వ‌న్‌కు క‌రోనా సోకిన త‌ర్వాత ఆయ‌న కూడా కొద్దిరోజులు స్త‌బ్దుగా ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్‌కు కరోనా సోకడంతో ఇన్నిరోజులుగా ఆయ‌న ఇంటిప‌ట్టునే ఉన్నారు. తాజాగా పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుకుద‌నాన్ని పెంచడంతోపాటు ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న అవ‌లంబిస్తోన్న అధికార పార్టీపై భారీస్థాయి పోరాటానికి సిద్ధం కావాtag{#}Tirupati;Janasena;Bharatiya Janata Party;Pawan Kalyan;job;Government;Coronavirus;Partyరెడ్డీ సాబ్‌కు చెప్పండి... వ‌కీల్‌సాబ్ వ‌స్తున్నాడ‌ని..!!రెడ్డీ సాబ్‌కు చెప్పండి... వ‌కీల్‌సాబ్ వ‌స్తున్నాడ‌ని..!!tag{#}Tirupati;Janasena;Bharatiya Janata Party;Pawan Kalyan;job;Government;Coronavirus;PartyTue, 06 Jul 2021 11:25:00 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్  రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఏడో తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాల‌యంలో కీలక సమావేశం జ‌ర‌గ‌నుంది. ప‌వ‌న్‌కు క‌రోనా సోకిన త‌ర్వాత ఆయ‌న కూడా కొద్దిరోజులు స్త‌బ్దుగా ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్‌కు కరోనా సోకడంతో ఇన్నిరోజులుగా ఆయ‌న ఇంటిప‌ట్టునే ఉన్నారు. తాజాగా పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుకుద‌నాన్ని పెంచడంతోపాటు ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న అవ‌లంబిస్తోన్న అధికార పార్టీపై భారీస్థాయి పోరాటానికి సిద్ధం కావాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

స్త‌బ్దుగా మారిన జ‌న‌సేన‌
ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు క‌రోనా సోకిన త‌ర్వాత పార్టీ యంత్రాంగం కూడా స్త‌బ్దుగా మారింది. చురుగ్గా ఉండే నేత‌లున్న ప్రాంతాల్లో మాత్రం అధికార పార్టీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. అయితే రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రుగుతున్న పోరాటాలు లేవు. బీజేపీ కూడా కొన్ని నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ప్ప‌టికీ సొంతంగానే చేశారు. జ‌న‌సేన పార్టీ అందులో పాల్గొన‌లేదు. ప్ర‌జ‌లు ఎంత‌టి స‌మ‌స్య‌ల్లో ఉన్నారో ఏపీలో కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లో అడిగినా చెబుతారు. జాబ్ క్యాలెండర్ దగ్గర్నుంచి ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి ఇచ్చిన  స్థలాల్లో సొంత డబ్బులు పెట్టుకుని పునాది వేయించుకోవాలంటూ వాలంటీర్లు ఒత్తిడి చేస్తుండ‌టం రాష్ట్రంలో ప్ర‌ధాన అంశంగా మారింది. వరుసగా బయట పడుతున్న కుంభకోణాలు.. ప్రభుత్వం నిర్లిప్తత.. రోజురోజుకూ పేద‌రికంలోకి జారిపోతున్న జ‌నాలు.. ఇలాఎన్నో సమస్యలు రాష్ట్రాన్ని వేధిస్తున్నాయి.

నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
ఉద్యోగ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నా ఇంత కాలం జనసేన ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తుంటే ఆ పార్టీ నేత‌లు ప‌వ‌న్‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో కార్య‌క్ర‌మాలు మంద‌గించిన‌ట్లు చెబుతున్నారు. ఇక‌నుంచి అలాంటి ప‌రిస్థితి ఉండ‌ద‌ని ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. భారీ ఎత్తున పోరాటాలు చేయ‌డంతోపాటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని జ‌న‌సేన సిద్ధాంత‌క‌ర్త‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అన్నివ‌ర్గాల్లో ర‌గులుతున్న అసంతృప్తిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు జ‌న‌సేనాని ఎలా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.





రేవంత్ విషయంలో వాళ్ళు తప్పులో కాలేశారా?

ఏ పార్టీ సాధించని ఘనత సాధించిన మోదీ సర్కార్ ?

హమ్మయ్య.. తగ్గుతున్నాయ్..!

ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అధికారపార్టీకి లాభం. బీజేపీ దుబ్బాకలో గెల‌వ‌డం, జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓట్లు పెంచుకోవడంలో అధికార పార్టీని వ్య‌తిరేకించే ప్ర‌జ‌లంతా ఆ పార్టీవైపు చూపు సారించారు. దీంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించారు. అది ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం కావ‌డం గ‌మ‌నార్హం. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఎన్నికలలో బీజేపీ ఊసు లేకుండా చేశారు.

రేవంత్ దెబ్బ‌కు డీలా ప‌డ్డ బీజేపీ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఏడో తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాల‌యంలో కీలక సమావేశం జ‌ర‌గ‌నుంది. ప‌వ‌న్‌కు క‌రోనా సోకిన త‌ర్వాత ఆయ‌న కూడా కొద్దిరోజులు స్త‌బ్దుగా ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్‌కు కరోనా సోకడంతో ఇన్నిరోజులుగా ఆయ‌న ఇంటిప‌ట్టునే ఉన్నారు. తాజాగా పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుకుద‌నాన్ని పెంచడంతోపాటు ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న అవ‌లంబిస్తోన్న అధికార పార్టీపై భారీస్థాయి పోరాటానికి సిద్ధం కావాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఒకటి కాదు ఏకంగా రెండు అందులోనే ..... ??

కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ లు డుమ్మా... బూస్టర్ షాట్ లే గతి ?

ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు భార‌తీయ జ‌న‌తాపార్టీకి అగ్నిప‌రీక్ష‌గా మార‌బోతున్నాయి. జిల్లా ప‌రిష‌త్ స్థానాలు కాకుండా మిగ‌తా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోర‌ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. చివ‌రికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోని స్థానాల‌ను కూడా ప్ర‌తిప‌క్షాల‌కు కోల్పోయింది. స‌మాజ్‌వాదీ పార్టీ, బ‌హుజ‌న స‌మాజ్‌పార్టీ, కాంగ్రెస్‌తోపాటు, రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ క‌మలానికి స‌వాల్ విసురుతున్నాయి. పై రెండు పార్టీలు కాకుండా చిన్నా చితకా పార్టీలు ఉండ‌నే ఉన్నాయి. వీట‌న్నింటికి తోడు బీజేపీకి త‌ల‌నొప్పిలా మారిన ఆజాద్ స‌మాజ్‌పార్టీ, వికాస్ ఇన్సాస్ పార్టీ, ఆమ్ఆద్మీ కూడా రంగంలోకి దిగుతున్నాయి. వీటి ప్ర‌భావాన్ని అంత‌గా తీసిపారేయ‌డానికి వీల్లేద‌ని, గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌లు రుజువు చేశాయి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>