PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi815e411a-1686-4ffa-98d2-fe825efbd2ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi815e411a-1686-4ffa-98d2-fe825efbd2ca-415x250-IndiaHerald.jpgకేంద్రంలోని మోడీ సారధ్యం వహిస్తున్న ఎన్డీయే సర్కార్ కి ఇపుడు అతి పెద్ద సమస్య పట్టుకుంది. అంతే కాదు అది ప్రతిష్టాత్మకం కూడా అవుతోంది. ఏదో బయటకు చెప్పుకోవడం కాదు, విపక్షల ముందు వీక్ అవకుండా చూపించుకోవాలంటే తప్పనిసరిగా ఎన్డీయే విషయంలో చేయాల్సింది చాలా ఉంది. modi{#}Prime Ministerమోడీకి కొత్త మిత్రులు దొరకడం లేదా... ?మోడీకి కొత్త మిత్రులు దొరకడం లేదా... ?modi{#}Prime MinisterTue, 06 Jul 2021 21:00:00 GMTకేంద్రంలోని మోడీ సారధ్యం వహిస్తున్న ఎన్డీయే సర్కార్ కి ఇపుడు అతి పెద్ద సమస్య పట్టుకుంది. అంతే కాదు అది ప్రతిష్టాత్మకం కూడా అవుతోంది. ఏదో బయటకు చెప్పుకోవడం కాదు, విపక్షల ముందు వీక్ అవకుండా చూపించుకోవాలంటే తప్పనిసరిగా ఎన్డీయే విషయంలో చేయాల్సింది చాలా ఉంది.

అర్జంటుగా దాన్ని పటిష్టం చేయాలి. మోడీ 2014లో ప్రధాని అయిన నాటికి చాలా మంది మిత్రులు ఉన్నారు. నాడు దేశం యావత్తు మోడీ పట్ల మోజు పెంచుకున్న తీరులాగానే దేశంలోని కాంగ్రెసేతర పార్టీల వారు అంతా కూడా మోడీకి జై కొట్టేశారు. అయితే తొలి విడత పాలన పూర్తి కాగానే చాలా మంది తప్పుకున్నారు. రెండవ విడత పాలన రెండేళ్ళు కూడా పూర్తి కాకుండానే కీలకమైన మిత్రులు ఎన్డీయే నుంచి గుడ్ బై కొట్టేశారు. ఆ విధంగా చెప్పుకుంటే శివసేన, అకాలీదళ్ పార్టీలు చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి.

ఇక మోడీ మంత్రివర్గ విస్తరణ పేరిట కొత్త పార్టీలను మిత్రులను ఆకట్టుకోవడానికి చూస్తున్నారు అని అంటున్నారు. కానీ అదేమంత సక్సెస్ కాలేదు అన్నది ఢిల్లీ న్యూస్. మోడీకి అంశాల వారీగా మద్దతు ఇస్తూ తటస్థంగా ఉండే  బిజూ జనతాద‌ళ్ ని ఈసారి ఎలాగైనా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకువద్దామని చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు అంటున్నారు. తాము ఇలాగే ఉంటామని, కేంద్రంలో చేరేది లేదు అని నవీన్ పట్నాయక్ గట్టిగా చెప్పేశారుట.

ఇక మరో వైపు చూసుకుంటే ఏపీలో ఉన్న వైసీపీ లోక్ సభలో నాలుగవ పెద్ద పార్టీగా ఉంది. దాంతో ఆ పార్టీని ఎలాగైనా ఎన్డీయే నీడలోకి లాగేయాలని చూశారు. చివరి దాకా ప్రయత్నాలు జరిగాయి. కానీ వైసీపీ మాత్రం సర్కార్ లో చేరడానికి నో చెప్పేసినట్లుగా భోగట్టా. ఇక ఏపీలో జనసేనను విలీనం చేసుకోవాలన్న ప్రయత్నం కూడా బెడిసికొట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్డీయే మిత్రులు తగ్గిపోతున్న వేళ మోడీ మంత్రి వర్గ విస్తరణ సాగుతోంది. మరి చూడాలి రేపటి ఎన్నికలలోగా కొత్త  మిత్రులు దొరుకుతారో లేదో.





కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రేసులో ముందున్నది వీళ్లే..!!

కేంద్రంలోని మోడీ సారధ్యం వహిస్తున్న ఎన్డీయే సర్కార్ కి ఇపుడు అతి పెద్ద సమస్య పట్టుకుంది. అంతే కాదు అది ప్రతిష్టాత్మకం కూడా అవుతోంది. ఏదో బయటకు చెప్పుకోవడం కాదు, విపక్షల ముందు వీక్ అవకుండా చూపించుకోవాలంటే తప్పనిసరిగా ఎన్డీయే విషయంలో చేయాల్సింది చాలా ఉంది.

ఇండియా vs ఇంగ్లాండ్.. ఇక స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే?

నెటిజన్ కు మోడీ బర్త్ డే విషెస్

జూలై 19 నుంచి ఆంక్షల ఎత్తివేత.. స్పష్టం చేసిన ప్రధాని?

టార్గెట్ యూపీ.. వారికే తొలి ప్రాధాన్యం!

యూపీ ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ.. !

మహారాష్ట్ర మాజీ సీఎం తాజా లవ్ స్టోరీ..

జులై 5: చరిత్రలో ఈ నాడు జరిగిన ముఖ్యంశాలు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>