PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpf2d7261e-cb49-443b-9867-154cb203c6c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpf2d7261e-cb49-443b-9867-154cb203c6c5-415x250-IndiaHerald.jpgరాష్ట్రం విడిపోయాక రాజకీయాలకు కీలకంగా ఉండే విజయవాడ ప్రాంతం టీడీపీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటింది. కానీ ఐదేళ్లలో పరిస్తితి తారుమారింది. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ హవా నడిచింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, తిరువూరు నియోజకవర్గాలు ఉన్నాయి.tdp{#}Gadde Rama Mohan;Vijayawada;devineni avinash;Devineni Uma Maheswara Rao;Jaggayyapeta;Tiruvuru;Parliment;Elections;Bonda;Hanu Raghavapudi;YCP;TDP;Partyబెజవాడ పాలిటిక్స్: సైకిల్‌కు ఛాన్స్ వచ్చిందా?బెజవాడ పాలిటిక్స్: సైకిల్‌కు ఛాన్స్ వచ్చిందా?tdp{#}Gadde Rama Mohan;Vijayawada;devineni avinash;Devineni Uma Maheswara Rao;Jaggayyapeta;Tiruvuru;Parliment;Elections;Bonda;Hanu Raghavapudi;YCP;TDP;PartyMon, 05 Jul 2021 03:00:00 GMTరాష్ట్రం విడిపోయాక రాజకీయాలకు కీలకంగా ఉండే విజయవాడ ప్రాంతం టీడీపీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటింది. కానీ ఐదేళ్లలో పరిస్తితి తారుమారింది. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ హవా నడిచింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, తిరువూరు నియోజకవర్గాలు ఉన్నాయి.


గత ఎన్నికల్లో ఒక్క విజయవాడ ఈస్ట్‌లో తప్ప, మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయింది. అయితే విజయవాడ పార్లమెంట్ సీటుని టీడీపీనే కైవసం చేసుకుంది. సరే ఈ రేంజ్‌లో ఓటమి వచ్చాక ఆ పార్లమెంట్ పరిధిలో టీడీపీ వీక్ అయింది. కానీ ఎన్నికలు అయిపోయి రెండేళ్ళు దాటేసింది. మరి ఈ రెండేళ్లలో కాలంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ పుంజుకుందా? అంటే కాస్త అవునని, కాస్త కాదని చెప్పొచ్చు.


ఎందుకంటే ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. అయితే వైసీపీ అధికారంలో ఉండటం, పథకాల అంశం టీడీపీకి మైనస్ అయ్యాయి. కానీ నియోజవర్గాలుగా చూస్తే మాత్రం కాస్త టీడీపీ నేతలు బలోపేతం అయ్యారనే చెప్పొచ్చు. మొదట విజయవాడ సెంట్రల్‌లో బోండా ఉమా దూకుడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన కేవలం 25 ఓట్లతో ఓడిపోయారు. ఇక ఆ సానుభూతి ఉమా మీద ఉంది. అలాగే ఆయన పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు.


అటు నందిగామలో సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్యలు పర్వాలేదనిపిస్తున్నారు. మైలవరంలో దేవినేని ఉమా పికప్ అయ్యారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక వెస్ట్‌లో టీడీపీ వీక్‌గానే కనిపిస్తోంది. అలాగే గెలిచిన ఈస్ట్‌లో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బలం తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ తరుపున పనిచేస్తున్న దేవినేని అవినాష్ పుంజుకున్నారు. తిరువూరులో టీడీపీ పరిస్తితి బాగోలేదు. కానీ అక్కడ టీడీపీకి కొత్తగా శావల దేవదత్‌ని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. మరి ఆయన ఏ స్థాయిలో టీడీపీని బలోపేతం చేస్తారో చూడాలి. మొత్తానికైతే విజయవాడ పార్లమెంట్‌లో సైకిల్‌కు కొంచెం ఛాన్స్ వచ్చినట్లే కనిపిస్తోంది.




కేసీఆర్-జగన్‌లు సెట్ చేసుకుంటారా? ఈ రచ్చకు బ్రేక్ పడుతుందా?

వైఎస్సార్ బాటలో రేవంత్...వన్ మ్యాన్ షో ఉంటుందా?

పవన్ ఫిక్స్ అయ్యారు...వాళ్ళు సెట్ అవుతారా?

సిద్దూను సెట్ చేస్తారా.. పంజాబ్‌ పై హస్తం పట్టు కొనసాగుతుందా..?

ఏదైనా రాజకీయ పార్టీ ఒక్కసారిగా అధికారం కోల్పోతే, అందులో ఉండే కొందరు నాయకులు రాజకీయంగా మనుగడ సాధించడం కష్టమని చెప్పి, అధికారంలోకి వచ్చిన పార్టీలోకి జంప్ అయిపోతారు. ఇలా అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష నేతలు జంప్ అవ్వడం సహజమే. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి సర్వసాధారణమే. అయితే అలా అధికార పార్టీలోకి వచ్చాక అలాంటి నాయకుల్లో కొందరికి కీలక పదవులు దక్కే అవకాశముంది. మరికొందరు పదవులు కోసం వెయిట్ చేయాల్సిన పరిస్తితి ఉంటుంది. మరికొందరు పోలిటికల్ స్క్రీన్‌పైనే కనిపించరు.

రాష్ట్రం విడిపోయాక రాజకీయాలకు కీలకంగా ఉండే విజయవాడ ప్రాంతం టీడీపీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటింది. కానీ ఐదేళ్లలో పరిస్తితి తారుమారింది. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ హవా నడిచింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, తిరువూరు నియోజకవర్గాలు ఉన్నాయి.

బెజ‌వాడ సెంట్ర‌ల్‌పై బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌...ఈ సారి ఛాన్స్ ఆయ‌న‌కేనా..?

జ‌గ‌న్‌కు మాయ‌రోగం, మ‌తిమ‌రుపు..?

ఉత్త‌రాఖండ్ నుంచి బెంగాల్ రాజ‌కీయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>