PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth7864bf22-2093-4755-9a06-5b03e7323395-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth7864bf22-2093-4755-9a06-5b03e7323395-415x250-IndiaHerald.jpgసాధారణంగా జాతీయ పార్టీలో అధిష్టానం చెప్పిందే ఫైనల్. ఏ రాష్ట్ర అధ్యక్షుడైన, ఏ రాష్ట్ర సీఎం అయినా జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాల మాట వినాల్సిందే. ఈ పార్టీల్లో ఏకనాయకత్వం ఉండదు. ప్రాంతీయ పార్టీల మాదిరిగా ఒక్క నాయకుడు చేతుల్లోనే పార్టీ నడవదు. పైగా కాంగ్రెస్ లాంటి పార్టీలో నాయకులకు మాట్లాడే స్వాతంత్ర్యం ఎక్కువ. వాళ్ళల్లో వాళ్లే విమర్శలు చేసేసుకుంటారు.revanth{#}politics;Y. S. Rajasekhara Reddy;Revanth Reddy;Telangana;CM;revanth;Congress;Party;Successవైఎస్సార్ బాటలో రేవంత్...వన్ మ్యాన్ షో ఉంటుందా?వైఎస్సార్ బాటలో రేవంత్...వన్ మ్యాన్ షో ఉంటుందా?revanth{#}politics;Y. S. Rajasekhara Reddy;Revanth Reddy;Telangana;CM;revanth;Congress;Party;SuccessMon, 05 Jul 2021 01:00:00 GMTసాధారణంగా జాతీయ పార్టీలో అధిష్టానం చెప్పిందే ఫైనల్. ఏ రాష్ట్ర అధ్యక్షుడైన, ఏ రాష్ట్ర సీఎం అయినా జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాల మాట వినాల్సిందే. ఈ పార్టీల్లో ఏకనాయకత్వం ఉండదు. ప్రాంతీయ పార్టీల మాదిరిగా ఒక్క నాయకుడు చేతుల్లోనే పార్టీ నడవదు. పైగా కాంగ్రెస్ లాంటి పార్టీలో నాయకులకు మాట్లాడే స్వాతంత్ర్యం ఎక్కువ. వాళ్ళల్లో వాళ్లే విమర్శలు చేసేసుకుంటారు.


ఇలా అంతర్గత ప్రజస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌లో ఏకనాయకత్వం రావడం చాలా కష్టం. కానీ ఆ విషయంలో దివంగత వైఎస్సార్ సక్సెస్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ అంటే వైఎస్సార్, వైఎస్సార్ అంటే కాంగ్రెస్ అనే మాదిరిగా రాజకీయాలు నడిచాయి. ఆయన పార్టీ మొత్తాన్ని గ్రిప్‌లో పెట్టుకుని ముందుకెళ్లారు. ఏ విషయంలోనైనా ఆయన నిర్ణయమే ఫైనల్ అయ్యేది. అధిష్టానం మాట వింటూనే, ఏపీలో తన మాటని నేగ్గెలా చేసుకునేవారు.


అయితే కాంగ్రెస్‌లో వైఎస్సార్ ముందుగానీ, ఆ తర్వాత గానీ ఒక్కరే పార్టీని నడిపించిన సందర్భాలు లేవు. రాష్ట్రం విడిపోయాక కూడా పీసీసీ అధ్యక్షులకు ఆ ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణకు పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి మాత్రం వైఎస్సార్ బాటలో వెళ్లాలని చూస్తున్నారని తెలుస్తోంది. రేవంత్‌కు కూడా తెలంగాణ రాజకీయాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాష్ట్రంలో చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నా సరే, రేవంత్‌కు ఉన్న క్రేజ్ వాళ్ళకు లేదనే చెప్పొచ్చు. ప్రజలని ఆకర్షించే స్టామినా రేవంత్‌కు ఉంది. అందుకే ఆయనకు పీసీసీ దక్కింది.


ఇప్పుడు పీసీసీగా పార్టీని తన గ్రిప్‌లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. తన నిర్ణయమే ఫైనల్ అనే మాదిరిగా రాజకీయాలు చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే వైఎస్సార్‌లాగా పాదయాత్ర చేయడానికి రేవంత్ సిద్ధమవుతున్నారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో వన్ మ్యాన్ షో చేయాలని రేవంత్ చూస్తున్నారు. మరి చూడాలి వైఎస్సార్ బాటలో వెళ్లాలని అనుకుంటున్న రేవంత్ ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతారో?




ఆనాటి సమైక్య ఉద్యమం.. అంతా సొల్లు కబుర్లేనట..!

పవన్ ఫిక్స్ అయ్యారు...వాళ్ళు సెట్ అవుతారా?

సిద్దూను సెట్ చేస్తారా.. పంజాబ్‌ పై హస్తం పట్టు కొనసాగుతుందా..?

మహేష్ మేనియాతో సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!

సాధారణంగా జాతీయ పార్టీలో అధిష్టానం చెప్పిందే ఫైనల్. ఏ రాష్ట్ర అధ్యక్షుడైన, ఏ రాష్ట్ర సీఎం అయినా జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాల మాట వినాల్సిందే. ఈ పార్టీల్లో ఏకనాయకత్వం ఉండదు. ప్రాంతీయ పార్టీల మాదిరిగా ఒక్క నాయకుడు చేతుల్లోనే పార్టీ నడవదు. పైగా కాంగ్రెస్ లాంటి పార్టీలో నాయకులకు మాట్లాడే స్వాతంత్ర్యం ఎక్కువ. వాళ్ళల్లో వాళ్లే విమర్శలు చేసేసుకుంటారు.

బెజ‌వాడ సెంట్ర‌ల్‌పై బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌...ఈ సారి ఛాన్స్ ఆయ‌న‌కేనా..?

హుజూరాబాద్ ఖ‌ర్చు అన్ని వంద‌ల కోట్లా.. ఏ పార్టీ ఎన్ని కోట్లు అంటే..!

కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు కేసీఆర్ ముహూర్తం.. అవుట్‌... ఇన్ లిస్ట్ ఇదే..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖ‌ర్చు రు. 300 కోట్లు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>