PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-c393f334-2a7b-49c6-b846-157e4df58913-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-c393f334-2a7b-49c6-b846-157e4df58913-415x250-IndiaHerald.jpgచదివిన చదువులకు ఉద్యోగాలు లేక ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేయడానికి డబ్బులు వెచ్చించి కాడెద్దులు కొనే స్తోమత లేకపోవడంతో ఓ నిరుద్యోగ అన్నదమ్ములు స్వయంగా కాడెద్దులుగా మారి దుక్కి దున్నిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. వారే కాడెద్దులై పొలాన్ని దున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితి ములుగు జిల్లా మంగపేట మండలం దోమాడ గ్రామంలో జరిగింది. రైతు జాడి సమ్మయ్యకు ఇద్దరు కొడుకులు పెద్ద కుమారుడు నరేంద్ర బాబు, చిన్న కొడుకు శ్రీనివాస్ ఇరువురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో హైదరాబాద్లోPolitical {#}srinivas;Government;mandalam;Mulugu;Coronavirus;Narendra;Fatherకాడెద్దులుగా అన్నదమ్ములు..?కాడెద్దులుగా అన్నదమ్ములు..?Political {#}srinivas;Government;mandalam;Mulugu;Coronavirus;Narendra;FatherMon, 05 Jul 2021 09:05:00 GMTచదివిన చదువులకు ఉద్యోగాలు లేక ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేయడానికి డబ్బులు  వెచ్చించి కాడెద్దులు కొనే స్తోమత లేకపోవడంతో ఓ నిరుద్యోగ అన్నదమ్ములు  స్వయంగా కాడెద్దులుగా మారి దుక్కి దున్నిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. వారే కాడెద్దులై పొలాన్ని దున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితి ములుగు జిల్లా మంగపేట మండలం దోమాడ గ్రామంలో జరిగింది.  రైతు జాడి సమ్మయ్యకు ఇద్దరు కొడుకులు పెద్ద కుమారుడు నరేంద్ర బాబు, చిన్న కొడుకు  శ్రీనివాస్ ఇరువురు పోస్ట్ గ్రాడ్యుయేషన్  పూర్తి చేశారు.  ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో హైదరాబాద్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు.

కరోనా కారణంగా  లాక్ డౌన్ తో ఆ ప్రైవేటు ఉద్యోగాలు కూడా  ఊడిపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నారు. వర్షాకాలం కాబట్టి  పంటల సీజన్ ప్రారంభంతో అందరు రైతుల మాదిరిగానే వాళ్లకు ఉన్న ఎకరం భూమిలో  నాటు వేసేందుకు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. కరోనా మహమ్మారి తో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో కాడెద్దులు కొనే పరిస్థితి లేదు. ఎలాగైనా పొలం దున్ని నాటు వేయాలని ఇద్దరు కుమారులు తన తండ్రి కలిసి పొలాన్ని దున్నారు. ఇద్దరు కొడుకులు కాడెద్దులుగా మారి తండ్రి నాగలి పట్టుకోగా పొలం అంతా  నాటుకు సిద్ధం చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎద్దులను  కొనలేక పోయానని , ఇతర ఏ రైతులను అడిగిన ఎదురు ఇవ్వలేదని, ఎలాగైనా పొలం దున్నాలనే సంకల్పంతో ఈ విధంగా చేశామని వారు అంటున్నారు.

దేశానికి  అన్నం పెట్టే రైతన్న కనీసం  కాడెద్దులు కూడా కొనుక్కోలేని  పరిస్థితుల్లో  ఉన్నారంటే  ప్రభుత్వాలు  రైతులకు ఏ విధంగా భరోసా ఇస్తున్నాయి. తరచూ  ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటు కరోనా, ప్రభుత్వం ఆదుకోక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఎంతో మంది రైతులు  తమ వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. ఎందుకంటే పెరిగిన ధరలు రైతులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో రైతులు ఏం చేయాలో అర్థం కాక అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఇలా కాడెద్దులుగా మారి తమ ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు.



నిజం చెబితే కోపమేల..! జగన్‌కు రఘురామ మరో లేఖ..!

అల్లు అరవింద్ - పవన్ కాంబో ఫ్యాన్స్ కు పండగే ?

తెలంగాణ అభివృద్ధికి భారీ విరాళాలు..?

తెలంగాణలో ముగ్గురు బాలికల అనుమానాస్పద మృతి!

కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

సోషల్ మీడియా సంచలనంగా వెంకటేష్ కూతురు ఆశ్రిత !

స్మరణ: నర్సింగ్ యాదవ్ ఎలా చనిపోయారో తెలుసా..?

సినీ లవర్స్ కు పండుగే పండుగ..!

హీరోయిన్ అనుపమ వీడియో వైరల్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>