PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag5a974aa1-c375-4360-97a6-526ce27b9398-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag5a974aa1-c375-4360-97a6-526ce27b9398-415x250-IndiaHerald.jpg కాంగ్రెస్‌లోని వ‌ర్గ పోరాటాలు భార‌తీయ జ‌న‌తాపార్టీకి కూడా అల‌వాటైన‌ట్లున్నాయి. ఒక నేత త‌న వ్య‌క్తిగ‌తంగా ఏదైనా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించుకున్న‌ప్పుడు అది జ‌ర‌గ‌కుండా ఆ పార్టీలోని ప‌లువురు నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. చివ‌రికి అది జ‌గ‌ర‌కుండా చేయ‌డంలో విజ‌య‌వంత‌మ‌వుతారు. ఇప్పుడే అదే ప‌రిస్థితి బీజేపీకి వ‌చ్చింది. ఆ సంస్కృతి కాంగ్రెస్ క‌న్నా బీజేపీలోనే ఎక్కువ‌గా ఉంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.tag{#}Culture;Karimnagar;Dookudu;Assembly;October;Delhi;Partyబండి సంజ‌య్ దూకుడుకు క‌ళ్లెం?బండి సంజ‌య్ దూకుడుకు క‌ళ్లెం?tag{#}Culture;Karimnagar;Dookudu;Assembly;October;Delhi;PartyMon, 05 Jul 2021 10:34:00 GMT
కాంగ్రెస్‌లోని వ‌ర్గ పోరాటాలు భార‌తీయ జ‌న‌తాపార్టీకి కూడా అల‌వాటైన‌ట్లున్నాయి. ఒక నేత త‌న వ్య‌క్తిగ‌తంగా ఏదైనా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించుకున్న‌ప్పుడు అది జ‌ర‌గ‌కుండా ఆ పార్టీలోని ప‌లువురు నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. చివ‌రికి అది జ‌గ‌ర‌కుండా చేయ‌డంలో విజ‌య‌వంత‌మ‌వుతారు. ఇప్పుడే అదే ప‌రిస్థితి బీజేపీకి వ‌చ్చింది. ఆ సంస్కృతి కాంగ్రెస్ క‌న్నా బీజేపీలోనే ఎక్కువ‌గా ఉంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా..
తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు ర‌చిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌. ఆగస్ట్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 2వరకు తొలివిడత పాదయాత్ర చేయ‌నున్న‌ట్లు కార్య‌వ‌ర్గ స‌మావేశంలో బండి వెల్ల‌డించారు. తొమ్మిదో తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ పాద‌యాత్ర రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టివ‌స్తుంది. చేవెళ్ల మీదుగా రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ పాదయాత్ర జ‌ర‌గ‌నుంది. అక్టోబర్ 2న హుజూరాబాద్ లో తొలివిడ‌త పాద‌యాత్ర ముగించేలా బండి సంజయ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

బండి సంజ‌య్ దూకుడు న‌చ్చ‌డంలేదు
పాదయాత్ర పేరుతో బండి సంజయ్ దూకుడుగా ఉండ‌టం బీజేపీలోని కొంద‌రు నేత‌ల‌కు న‌చ్చ‌డంలేదు. మ‌రికొంద‌రు కాబోయే ముఖ్య‌మంత్రి సంజ‌య్ అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. కొంద‌రు నేత‌లు ఆయ‌న్ను వ్య‌తిరేకించ‌డానికి ఈ వ్యాఖ్య‌లే కార‌ణం. కిష‌న్‌రెడ్డి వ‌ర్గం కూడా మొద‌టి నుంచి బండిని దూరంగా ఉంచుతోంది.  హైకమాండ్ వద్ద పలుకుబడి.. పట్టు ఉండటంతో ఢిల్లీ పెద్ద‌ల‌తో మాట్లాడే అవ‌కాశం బండికి దొర‌క‌డంలేదు. రాష్ట్ర కార్యవర్గంలో అత్యధికులు సంజ‌య్ నియ‌మించిన‌వారే కావ‌డం కొంత ఊర‌ట‌నిస్తోంది. అయితే పాదయాత్ర ప్రారంభం కాకుండా ఉండేందుకు ఇత‌ర నేత‌లంతా చేయాల్సిన ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అడ్డంకులు క‌ల్పించ‌డానికి ముందే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. పాద‌యాత్ర సాగ‌ద‌ని పార్టీ నేత‌లు బాహాటంగా చెబుతున్నారు. దీన్నిబ‌ట్టి బీజేపీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయాలు కాంగ్రెస్‌ను మించిపోతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యాఖ్య‌నిస్తున్నారు.



జ‌గన్ వైపు వంగ‌వీటి చూపు??

కాంగ్రెస్ మ‌హిళా నేత‌పై చంద్ర‌బాబు ఆశ‌లు.. ఇదో డిఫ‌రెంట్ స‌మ‌స్యే..!

షూటింగ్ ప్రారంభించ‌బోతున్న శంక‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్‌?

ష‌ర్మిల పార్టీని చీల్చేందుకు స్కెచ్ వేస్తున్నారే..?

కాంగ్రెస్‌లోని వ‌ర్గ పోరాటాలు భార‌తీయ జ‌న‌తాపార్టీకి కూడా అల‌వాటైన‌ట్లున్నాయి. ఒక నేత త‌న వ్య‌క్తిగ‌తంగా ఏదైనా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించుకున్న‌ప్పుడు అది జ‌ర‌గ‌కుండా ఆ పార్టీలోని ప‌లువురు నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. చివ‌రికి అది జ‌గ‌ర‌కుండా చేయ‌డంలో విజ‌య‌వంత‌మ‌వుతారు. ఇప్పుడే అదే ప‌రిస్థితి బీజేపీకి వ‌చ్చింది. ఆ సంస్కృతి కాంగ్రెస్ క‌న్నా బీజేపీలోనే ఎక్కువ‌గా ఉంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

త‌మిళ‌నాడులో భార‌తీయ జ‌న‌తాపార్టీకి, క‌థానాయ‌కుల‌కు మ‌ధ్య ఎప్ప‌టినుంచో వివాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. విజ‌య్‌, అజిత్‌తోపాటు మ‌రికొంద‌రు క‌థానాయ‌కుల‌తో వివాదాలు న‌డిచాయి. తాజాగా సూర్య మీద బీజేపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. నీట్‌కు సంబంధించి గ‌తంలో వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు తాజాగా సెన్సార్‌షిప్‌కు సంబంధించి కూడా సూర్య కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. ఆదివారం చెన్నైలో స‌మావేశ‌మైన త‌మిళ‌నాడు బీజేపీ యువ‌జ‌న కార్య‌వ‌ర్గం సూర్య‌పై మండిప‌డింది. అవాస్త‌వాలు ప్ర‌చారం చేయ‌డం మానుకోవాల‌ని, సొంత ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను వ్య‌తిరేకించ‌డం స‌రైంది కాదంది.

"గ‌జ‌నీ"పై బీజేపీ దండ‌యాత్ర‌?

అసదుద్దీన్ ఛాలెంజ్‌కు సై అంటున్న యోగి..!

బుగ్గ‌న ప‌ద‌వికి ఎర్త్ పెడుతోందెవ‌రు... !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>