PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmiladcfba582-70bb-4b6a-a7cc-0770e8866b96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmiladcfba582-70bb-4b6a-a7cc-0770e8866b96-415x250-IndiaHerald.jpgఎన్నికలకు అక్షరాలా మూడేళ్ళ కాలం ఉంది. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కాక మామూలుగా లేదు. అక్కడా ఇక్కడా కూడా ప్రతిపక్షాలు గట్టిగానే గర్జిస్తున్నాయి. వచ్చేది మేమే అంటూ జబ్బలు చరుస్తున్నాయి. నిజానికి ఇది కరోనా కాలం. కాని కాలం, కానీ అవేమీ రాజకీయాలకు అసలు పట్టడంలేదు అంటున్నారు. sharmila{#}Y. S. Rajasekhara Reddyతెలంగాణాలో వైఎస్సార్ ఫ్యాక్టర్ ఎంత... ?తెలంగాణాలో వైఎస్సార్ ఫ్యాక్టర్ ఎంత... ?sharmila{#}Y. S. Rajasekhara ReddyMon, 05 Jul 2021 21:00:00 GMTఎన్నికలకు అక్షరాలా మూడేళ్ళ కాలం ఉంది. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కాక మామూలుగా లేదు. అక్కడా ఇక్కడా కూడా ప్రతిపక్షాలు గట్టిగానే గర్జిస్తున్నాయి. వచ్చేది మేమే అంటూ జబ్బలు చరుస్తున్నాయి. నిజానికి ఇది కరోనా కాలం. కాని కాలం, కానీ అవేమీ రాజకీయాలకు అసలు పట్టడంలేదు అంటున్నారు.

ఇక తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టడానికి వైఎస్ షర్మిల రెడీ అయిపోతున్నారు. షర్మిల తన అన్న, నాన్నలకు ధీటు అయిన నాయకురాలే. ఆమె అనుకుంటే సాధిస్తారు అన్న మాట ఉంది. కానీ ఆమె ఎంచుకున్న కార్యక్షేత్రం తెలంగాణాలో నెట్టుకురావడం అంటే అంత సులువా అన్న మాట కూడా ఉంది. అయితే షర్మిల మాత్రం చాలా నిబ్బరంగానే అడుగులు వేస్తున్నారు. పార్టీ జెండా, అజెండా రెండూ రెడీ అయ్యాయి.

ఇక ప్రకటించి కధన రంగంలోకి దూకడమే మిగిలింది. ఇదిలా ఉంటే షర్మిల ఏమీ ఆషామాషీగా తెలంగాణా రాజకీయాలను చేయడం లేదు. అక్కడ వైఎస్సార్ కి ఉన్న బలం ఏంటో ఆమె చూసే పార్టీకి తెర తీశారు అంటున్నారు. వైఎస్సార్ ఉమ్మడి ఏపీని అయిదుంపావు ఏళ్లు ఏలారు. ఆయన తన బలమైన ముద్ర కూడా వేసుకున్నారు. ఆయనకు ఆంధ్రాతో సరిసమానంగా కూడా తెలంగాణాలోనూ అభిమాన గణం ఉంది.  

దీంతో తన పార్టీకి ఏ విధంగా అది ఉపకరిస్తుంది అన్న దాని మీద షర్మిల ఒక సర్వే చేయించారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఏకంగా 72 నియోజకవర్గాలలో వైఎస్సార్ ని గట్టిగా అభిమానించే వారు ఉన్నారుట. వారిని కనుక కదిలించి ఆకట్టుకుంటే షర్మిల రూట్ క్లియరే అంటున్నారు. అదే విధంగా కేసీయార్ రాజకీయానికి ధీటైన నాయకత్వమని షర్మిల రుజువు చేసుకుంటే తటస్థులు కూడా ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తానికి షర్మిల ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారమే తెలంగాణాలో అడుగులు వేస్తున్నారు అంటున్నారు. చూడాలి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో.





జగన్మోహన్ రెడ్డి Vs రేవంత్ రెడ్డి... ఎవ‌రు గొప్ప‌...!

జ‌గన్ వైపు వంగ‌వీటి చూపు??

ష‌ర్మిల పార్టీని చీల్చేందుకు స్కెచ్ వేస్తున్నారే..?

ష‌ర్మిల పార్టీ నేత‌లు పార్టీ మారుతున్నారంటూ ప్ర‌చారాలు ?

వైఎస్సార్ బాటలో రేవంత్...వన్ మ్యాన్ షో ఉంటుందా?

తెలంగాణ‌కు మ‌ర‌ణ‌శాస‌నం ఆ ప్రాజెక్ట్‌?

ఈ వైసీపీ రాజు గారు మంత్రి అవుతారా... ?

నాపై అస‌త్య‌ప్ర‌చారం చేస్తున్నారు - ష‌ర్మిల అనుచ‌రురాలు

ష‌ర్మిల తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>