MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-film61c76440-3c68-41ac-9703-50eaf89babc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-film61c76440-3c68-41ac-9703-50eaf89babc0-415x250-IndiaHerald.jpgఆ విషయంలో చెర్రీతో విభేదిస్తున్న రాజమౌళి..? జూలై 10వ తేదీన ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి సంబంధించి యాక్షన్ - ప్యాక్డ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఇదే షెడ్యూల్ లో చిత్రీకరించనున్న ఒక ఇంపార్టెంట్ పాటలో కూడా కలిసి డాన్స్ స్టెప్పులు వేయనున్నారు. అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ అందించే డాన్స్ మాస్టర్ ఎంపిక విషయంలో రాజమౌళి రామ్ చరణ్ తో విభేదిస్తున్నారట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం లో డాన్స్ మాస్టర్ ఎంపిక విషయం పెద్ద సమస్యగా మారిందని సినీ వర్గాలrrr film{#}RRR Movie;ram pothineni;Jr NTR;Master;Rajamouli;Sekhar Master;Ram Charan Teja;johnny;prem;Cinema;Writerఆ విషయంలో చెర్రీతో విభేదిస్తున్న రాజమౌళి..?ఆ విషయంలో చెర్రీతో విభేదిస్తున్న రాజమౌళి..?rrr film{#}RRR Movie;ram pothineni;Jr NTR;Master;Rajamouli;Sekhar Master;Ram Charan Teja;johnny;prem;Cinema;WriterMon, 05 Jul 2021 14:00:00 GMTఆర్.ఆర్.ఆర్ చిత్రానికి సంబంధించి యాక్షన్ - ప్యాక్డ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఇదే షెడ్యూల్ లో చిత్రీకరించనున్న ఒక ఇంపార్టెంట్ పాటలో కూడా కలిసి డాన్స్ స్టెప్పులు వేయనున్నారు. అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ అందించే డాన్స్ మాస్టర్ ఎంపిక విషయంలో రాజమౌళి రామ్ చరణ్ తో విభేదిస్తున్నారట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం లో డాన్స్ మాస్టర్ ఎంపిక విషయం పెద్ద సమస్యగా మారిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాజమౌళి శేఖర్ మాస్టర్ పేరు చెబుతుండగా.. రామ్ చరణ్ మాత్రం జానీ మాస్టర్ కావాలని పట్టుబట్టారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా మరొక డాన్స్ మాస్టర్ పేరు ముందుంచారట. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని ఎంపిక చేసుకోవాలని ఆయన ఒక ప్రపోజల్ పెట్టారట. దీంతో రాజమౌళి సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురూ కలిసి ఏ కొరియోగ్రాఫర్ అయితే సహజంగా డాన్స్ స్టెప్పులు చేస్తారో అతన్నే ఫైనలైజ్ చేయాలని నిర్ణయించారట. ఇది సినిమా మొత్తంలో అతి ముఖ్యమైన పాట కాబట్టి డాన్స్ మాస్టర్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి ఈ ఒక్క పాట కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ సినిమాల్లో లాగా ఆర్ఆర్ఆర్ యాక్షన్ సన్నివేశాలు ఉండవని.. ఈ యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో స్వాతంత్రం కోసం పోరాడే ఇద్దరు యోధులు ఒకానొక సందర్భంలో తల పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడే బంధం చాలా భావోద్వేగానికి గురి చేస్తోందని ఆయన అన్నారు.


ఆ విషయంలో చెర్రీతో విభేదిస్తున్న రాజమౌళి..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ క్యాటగిరి లో చూడండి.

స్టార్ హీరో సరసన అనన్య నాగళ్ళ ?

ఏపీలో క‌ర్ఫ్యూ వేళ‌ల్లో స‌డ‌లింపులు ఇవే...?

తనికెళ్ళ భరణి చేసిన పెద్ద పొరపాటు అదే..?

కోలీవుడ్ కు మంచి రోజులు రాబోతున్నాయా..?

వారి వల్లే కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నాడా!!

సినిమా వాళ్లే ఎక్కువగా ఎందుకు విడాకులు తీసుకుంటారు

నిజంగానే ఆమె ప్రేమలో పడిందా..!

ఇప్పుడు ప్ర‌కాష్‌రాజ్‌.. త‌ర్వాత మంచు విష్ణు.. ఓకేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>