PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid-plan-bef6ab1c-c582-4466-bd3a-fc25548059d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid-plan-bef6ab1c-c582-4466-bd3a-fc25548059d3-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారు. కరోనా వైరస్ దేశంలో విధ్వంసం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. కరోనా సోకిన వ్యక్తి, 14 రోజుల హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని వెల్లడించారు.covid plan {#}Athadu;police;Yevaru;marriage;Coronavirusభార్య నుంచి పారిపోవడానికి భర్త ప్లాన్ మాములుగా లేదుగా..??భార్య నుంచి పారిపోవడానికి భర్త ప్లాన్ మాములుగా లేదుగా..??covid plan {#}Athadu;police;Yevaru;marriage;CoronavirusMon, 05 Jul 2021 21:42:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారు. కరోనా వైరస్ దేశంలో విధ్వంసం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. కరోనా సోకిన వ్యక్తి, 14 రోజుల హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని వెల్లడించారు. ఇక ఆ సమయంలో కరోనా బాధితుడు వారితో ఎవరు కలవకుండా, సామాజిక దూరం పాటించాలన్న విషయం కూడా తెలిసిందే. అయితే కొంతమంది కోవిడ్ నియమాలను వారి వ్యక్తిగత విషయాల కోసం దుర్వినియోగం చేస్తున్న సంఘటనలను చాలానే చూస్తున్నాము. తాజాగా అలాంటి కోణంలోనే మధ్యప్రదేశ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది.

పూర్తి  వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లోని మోవ్‌ అనే ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తికి గడిచిన ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది. అయితే అతనికి భార్య, ఇంట్లోవారితో మనస్పర్థలు ఏర్పడ్డాయి. దాంతో ఎలాగైనా ఇంట్లో నుంచి దూరంగా వెళ్లి పోవాలని అనుకున్నాడు. ఇక దీనికోసం ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. అయితే ఒక ప్రైవేటు ల్యాబ్‌ నుంచి కోవిడ్‌ సోకిన వ్యక్తి రిపోర్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఇక దానిపై అతని పేరును మార్చి, తన పేరు పెట్టుకున్నాడు. ఆ తరువాత ఆ రిపోర్ట్‌ను తన భార్య, తల్లిదండ్రులకు వాట్సప్‌ పంపాడు.

అయితే అతడు పంపిన మెసేజ్ చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇక అతనికి ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవు. దాంతో వారికి తమ కుమారుని ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఇక వారు వెంటనే ఆ వాట్సప్‌లో ఉన్న ప్రైవేటు ల్యాబ్‌ను వెళ్లి సంప్రదించారు. అయితే అప్పుడు వారికి తమ కొడుకు చేసిన మోసం బయటికి వచ్చింది. కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోయి, వారు ఇంటికి వెళ్లిపోయారు. ఇక ఆ ల్యాబ్‌ టెక్నిషియన్‌ మాత్రం, తమ ల్యాబ్‌ రిపోర్ట్‌ను ఫోర్జరీతో మార్పిడి చేసినందుకుగాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో గ్వల్టోలి పోలీసులు నిందితునిపై పలు సెక్షన్‌ల కింద కేసులను నమోదు చేశారు.



బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'పుష్ప' కి బ్రేక్..?

ఐపీఎల్ తో పిచ్ లు దెబ్బతింటాయి : మార్క్ బౌచర్

వైరల్ వీడియో: ఆదాశర్మ టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే?

వావ్.. పేదరికం లో కూడా ఫస్ట్ వచ్చాడు?

ఒత్తిడిలో ప్రభాస్ కారణం ఏమిటంటే..?

మామ కోసం అల్లుడి సినిమాని పక్కన పెట్టేసిన క్రిష్..?

మోహ‌న్‌బాబు రెండో పెళ్లి వెన‌క ఏం జ‌రిగింది ?

బాల‌కృష్ణ‌కు అత్తారింటి నుంచి వ‌చ్చిన క‌ట్నం ఇంత త‌క్కువా ..?

అఖిల్ కెరీర్ గాడిన పడేనా... నాగార్జున పక్కా స్కెచ్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>