BeautyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyae0e10b3-47b1-40df-bf1d-0fb3c863c98f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyae0e10b3-47b1-40df-bf1d-0fb3c863c98f-415x250-IndiaHerald.jpgఅందం అనేది ప్రతి ఒక్క అమ్మాయితో పాటు అబ్బాయి కూడా కోరుకునే విషయం. ఇలా అందంగా ఉండడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో కూడా చెప్పడం చాలా కష్టతరం. కొంతమంది తమ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పార్లర్ చుట్టూ తిరిగితే, మరికొంతమంది ఆన్లైన్ లో దొరికే సరికొత్త ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా మరి కొంతమందేమో ఇంటి చిట్కాలను పాటిస్తూ అందంగా ఉండడానికి తపన పడుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఉంటూ ఎటువంటి ఖర్చు లేకుండా ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించడం వల్ల అందంగా తయారవ్వచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకBEAUTY{#}Muni;Almonds;Coffee;Yevaruఈ కాలం అందంగా మెరవాలంటే.. ఇలా చేస్తే సరిపోతుంది..ఈ కాలం అందంగా మెరవాలంటే.. ఇలా చేస్తే సరిపోతుంది..BEAUTY{#}Muni;Almonds;Coffee;YevaruMon, 05 Jul 2021 13:42:29 GMT
అందం అనేది ప్రతి ఒక్క అమ్మాయితో పాటు అబ్బాయి కూడా కోరుకునే విషయం. ఇలా అందంగా ఉండడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో కూడా చెప్పడం చాలా కష్టతరం. కొంతమంది తమ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పార్లర్ చుట్టూ తిరిగితే, మరికొంతమంది ఆన్లైన్ లో దొరికే సరికొత్త ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా మరి కొంతమందేమో ఇంటి చిట్కాలను పాటిస్తూ అందంగా ఉండడానికి తపన పడుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఉంటూ ఎటువంటి ఖర్చు లేకుండా ఇప్పుడు చెప్పబోయే  చిట్కా  పాటించడం వల్ల అందంగా తయారవ్వచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1. ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా సబ్బుతో కడగాలి.
2. ఆ తరువాత తడిలేని కాటన్ టవల్ తీసుకొని తుడిచిన తర్వాత, వేడి నీళ్ళతో స్ట్రీమింగ్ పద్దతిని అనుసరించాల్సి ఉంటుంది.
3. ఈ స్ట్రీమింగ్ పద్ధతి ద్వారా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకొనబడతాయి.
4. ఆ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర, టేబుల్ స్పూన్  కాఫీ పొడి , కొద్దిగా తేనె, టేబుల్ స్పూన్ బాదం నూనె తీసుకొని అన్ని గిన్నెలో వేసి  పేస్ట్ లాగా తయారు చేయాలి.
5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ ముఖం మీద, బుగ్గల పైన, నుదురు పైన
అప్లై చేసి మర్దనా చేయాలి.
6. ఇందుకోసం మీరు కేవలం ముని వేళ్ళు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా మూడు నిమిషాల పాటు ఇలా చేయాల్సి ఉంటుంది.
7. ఒక పదిహేను నిమిషాలు ఆరనిచ్చి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
8. ఆ తర్వాత మీకు అందుబాటులో ఉండే ఏదైనా ఒక మాయిశ్చరైజర్ లోషన్ ను  ముఖం మీద అప్లై చేస్తే సరిపోతుంది.
9. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే , ఈ ఫేస్ ప్యాక్ వాడిన రోజు మాత్రం ముఖానికి ఎలాంటి సబ్బులు కానీ వాషింగ్ జెల్ గానీ ఉపయోగించరాదు.
10. ఇక మరుసటి రోజు సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటే, అందమైన ముఖం మీ సొంతం. ఇలా ఈ పద్ధతిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు  పాటించడం వల్ల ఎటువంటి పార్లర్ కు వెళ్లకుండా చక్కనైన రూపం మీ సొంతం అవుతుంది.





ఇంట్లో ఉండే వంటింటి చిట్కాలు పాటిస్తూ ఈ శీతాకాలంలో అందంగా తయారు అవ్వవచ్చు

మా సభ్యులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన మురళి మోహన్..

మయన్మార్ లో మరోసారి ఘర్షణ..25 మంది మృతి.. !

మిల్క్ బ్యూటీ సోయగాలు చూడతరమా..?

ఆ రెండు విషయాలతో మధన పడుతున్న సమంత !

శ్రీశైలం చుట్టూ టెర్రరిస్టు సీపర్స్ సెల్స్.. ?

బాయ్ ఫ్రెండ్‌తో సీక్రెట్ కాపురం పెట్టేసిన టాప్ హీరోయిన్‌...!

ఇలా చేస్తే మెరిసే ముఖం మీ సొంతం..

మెహరీన్ పెళ్లి క్యాన్సల్ వెనక అసలు కారణం అదేనట.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>