MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes355f7b77-b437-4ae2-9bce-b56cf87584e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes355f7b77-b437-4ae2-9bce-b56cf87584e0-415x250-IndiaHerald.jpgఇది చిత్ర విచిత్ర పరిశ్రమ. ఇక్కడ ఒకటి కావాలి అనుకుంటే ఒకటి అవుతారు. ఒక ఇమేజ్ కోసం చూస్తే మరో ఇమేజ్ వస్తుంది. పోలీస్ పాత్రలు వేసేవారు ఎవరూ కూడా అంతా సుఖంగా లేరు. కానీ వారికి అవే వస్తూంటాయి. జనాలు మిమ్మల్ని ఇలాగే ఇష్టపడుతున్నారు అని వారికి అలాగే ఉంచేస్తారు. heroes{#}Massఈ ఇమేజ్ మాకొద్దు అంటున్న యంగ్ స్టర్స్... ?ఈ ఇమేజ్ మాకొద్దు అంటున్న యంగ్ స్టర్స్... ?heroes{#}MassMon, 05 Jul 2021 20:00:00 GMTఇది చిత్ర విచిత్ర పరిశ్రమ. ఇక్కడ ఒకటి కావాలి అనుకుంటే ఒకటి అవుతారు. ఒక ఇమేజ్ కోసం చూస్తే మరో ఇమేజ్ వస్తుంది. పోలీస్ పాత్రలు వేసేవారు ఎవరూ కూడా అంతా సుఖంగా లేరు. కానీ వారికి అవే వస్తూంటాయి. జనాలు మిమ్మల్ని ఇలాగే ఇష్టపడుతున్నారు అని వారికి అలాగే ఉంచేస్తారు.

ఇదిలా ఉంటే యంగర్ జనరేషన్ మరో విధమైన బాధలో ఉంది. వెండి తెర మీద హీరో కావాలన్న కోరిక అయితే తీరింది కానీ మాస్ ఇమేజ్ మాత్రం రావడంలేదని కలవరించే  హీరోలు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. నాచురల్ నాని నుంచి మొదలుపెడితే అక్కినేని అఖిల్ వరకూ అందరికీ ఒక్కటే బాధ. యాక్షన్ మూవీస్ చేస్తే జనాలు ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు అన్నదే వీరి ఆవేదన.  

తాము కేవలం సాఫ్ట్ క్యారక్టర్లకే సూట్ అవుతామా అన్నదే వారి ప్రశ్న. తమలో కూడా ఫైర్ ఉందని, దాన్ని మండించే హిట్ ఒకటి కావాలని వారు గట్టిగానే కోరుకుంటున్నారు. నాచురల్ స్టార్ నాని అయితే మాస్ ఇమేజ్ కోసం చేయని ప్రయత్నం లేదు. గతంలో అలా చేసిన సినిమాలు ఫట్ అయ్యాయి. అయినా కూడా మళ్ళీ వాటిని లైన్ లో పెడుతున్నాడు. టక్ జగదీష్ మూవీలో పక్కా మాస్ యాక్షన్ ఉంటుంది అంటున్నారు. అలాగే శ్యామ్ శింగరాయ్ మూవీ కూడా మాస్ కి ఎక్కేలా డిజైన్ చేశారుట.

ఇక అక్కినేని అఖిల్ అయితే ఏకంగా పక్కా మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ మూవీని చేస్తున్నాడు. దీని కోసం కంప్లీట్ మేకోవర్ చేంజ్ చేశాడు. ఇక శర్వానంద్, మెగా మేనల్లుడు సాయి తేజ్, పోతినేని రామ్ వంటి వారు మాస్ సబ్జెక్టులనే ఎంచుకుంటున్నారు. వీరంతా మాస్ ఇమేజ్ కోసం తెగ  ట్రై చేస్తున్నారు. మరి జనాలు వీరి సినిమాలను చూసి లవర్ బాయ్ ఇమేజ్ ని ఇచ్చారు. రామ్ పోతినేనికి ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఇమేజ్ దాహం కొంత తీరింది. కానీ కంప్లీట్ ఇమేజ్ కోసం ఆయన బ్యాక్ టూ బ్యాక్ మాస్ మూవీస్ నే ఎంచుకుంటున్నాడుట. చూడాలి మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో.
 



గోపీచంద్ బాలయ్య సినిమా.. 10 క్రాక్ లతో సమానం..!

బుల్లితెర మీదకి వకీల్ సాబ్.. డేట్ ఎప్పుడంటే ?

స్టార్ హీరో సరసన అనన్య నాగళ్ళ ?

ఆ టైంలో అదో సాహసం.. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజుతో చేసిన ప్రయోగం..!

స్టార్ స్టేటస్ లో వెనకబడ్డ దగ్గుబాటి హీరో..!

వెంకటేష్ తో నటించిన ఈ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా !

అఖిల్ కి ఈ రేంజ్ ఎలా ఎలివేషన్ అవసరమా..!!

విజయ్ సినిమాలో మరో స్టార్ హీరో క్రూషియల్ రోల్ ?

అలాంటి సినిమాలకు హీరోయిన్లు దూరం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>