PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politics-congress-chandrababu-naidubf2a24bb-b5dd-4e60-9313-0d8a5230a314-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politics-congress-chandrababu-naidubf2a24bb-b5dd-4e60-9313-0d8a5230a314-415x250-IndiaHerald.jpgకృష్నాజిల్లా టీడీపీలో ఆస‌క్తిక‌ర విష‌యం.. చ‌ర్చ‌కు వ‌స్తోంది. కీల‌క‌మైన గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు చేప‌ట్టిన జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు బ‌చ్చుల అర్జునుడు దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నార‌ని.. దీంతో పార్టీని న‌డిపించే నేత లేక‌.. ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఇక్క‌డ వ‌ల్ల‌భ‌నేని వంశీనే అన్నీతానై.. పార్టీని బ‌లోపేతం చేశారు. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ పుంజుకునేలా.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా యువ‌త‌ను ఆక‌ర్షించారు. వాస్తPOLITICS;CONGRESS;CHANDRABABU NAIDU{#}vamsi;Bachula Arjunudu;Hanu Raghavapudi;TDP;District;Partyకాంగ్రెస్ మ‌హిళా నేత‌పై చంద్ర‌బాబు ఆశ‌లు.. ఇదో డిఫ‌రెంట్ స‌మ‌స్యే..!కాంగ్రెస్ మ‌హిళా నేత‌పై చంద్ర‌బాబు ఆశ‌లు.. ఇదో డిఫ‌రెంట్ స‌మ‌స్యే..!POLITICS;CONGRESS;CHANDRABABU NAIDU{#}vamsi;Bachula Arjunudu;Hanu Raghavapudi;TDP;District;PartyMon, 05 Jul 2021 11:30:00 GMT
కృష్నాజిల్లా టీడీపీలో ఆస‌క్తిక‌ర విష‌యం.. చ‌ర్చ‌కు వ‌స్తోంది. కీల‌క‌మైన గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు చేప‌ట్టిన జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు బ‌చ్చుల అర్జునుడు దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నార‌ని.. దీంతో పార్టీని న‌డిపించే నేత లేక‌.. ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఇక్క‌డ వ‌ల్ల‌భ‌నేని వంశీనే అన్నీతానై.. పార్టీని బ‌లోపేతం చేశారు. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ పుంజుకునేలా.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా యువ‌త‌ను ఆక‌ర్షించారు. వాస్త‌వానికి అంతకు ముందు కూడా ఇక్క‌డ టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉంది.

గ‌తంలోనూ ఇక్క‌డ నుంచి టీడీపీ ప‌లు ప‌ర్యాయాలు విజయం ద‌క్కించుకుంది. అయితే.. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన వంశీ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. దీంతో ఇక్క‌డ టీడీపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌ను అర్జునుడికి అప్ప‌గించారు. సీనియ‌ర్ నాయ‌కుడు, జిల్లా స్థాయిలో నేత‌ల‌ను క‌లుపుకొని పోయే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్న‌నేత‌గా గుర్తింపు తెచ్చుకోవ‌డంతో చంద్ర‌బాబు ఈయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. ఆదిలో ఒకింత బాగానే ఉన్నా.. త‌ర్వాత‌.. మాత్రం అర్జునుడు పూర్తిగా నెమ్మ‌దించార‌ని త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు.

గ‌డిచిన ఆరు నెల‌లుగా అస‌లు నియోజ‌క‌వ‌ర్గం విష‌యాల‌ను అర్జునుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల ఇదే విష‌యంపై జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. ఆరా తీయ‌గా.. ఎవ‌రూ పాజిటివ్‌గా స్పందించ‌లేదు. అర్జునుడు ప్ర‌స్తుతం అనారోగ్యంతో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని..ఆయ‌న స్థానంలో కొత్త‌వారిని నియ‌మిస్తేనే పార్టీ పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం వంశీని ఢీకొనే స్థాయిలో నేత ఎవ‌రూ క‌నిపించ‌డం లేద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో దూకుడుగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన సుంక‌ర ప‌ద్మ‌శ్రీ టీడీపీలోకి వ‌స్తార‌ని.. ఆమెకు ఇంచార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చేందుకు చంద్ర‌బాబు రెడీగా ఉన్నార‌ని.. అయితే.. ఇది ఎప్పుడు జ‌రుగుతుందో తెలియ‌ద‌ని కొంద‌రు నేత‌లు చెబుతున్నారు. ఏదేమైనా.. ఇప్ప‌టికైతే.. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎదురీత ఈదుతోంద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.



హుజూరాబాద్ హుజూర్ అనేలా కేసీఆర్ ప్ర‌ణాళిక‌?

ఇళ్ల పట్టాలు వైసీపీ నాయకులకేనా.. ?

జ‌గన్ వైపు వంగ‌వీటి చూపు??

గ‌న్న‌వ‌రం టీడీపీ ఇన్‌చార్జ్ మార్పు... బ‌చ్చుల అవుట్ ?

ష‌ర్మిల పార్టీని చీల్చేందుకు స్కెచ్ వేస్తున్నారే..?

బండి సంజ‌య్ దూకుడుకు క‌ళ్లెం?

"గ‌జ‌నీ"పై బీజేపీ దండ‌యాత్ర‌?

ష‌ర్మిల పార్టీ నేత‌లు పార్టీ మారుతున్నారంటూ ప్ర‌చారాలు ?

అసదుద్దీన్ ఛాలెంజ్‌కు సై అంటున్న యోగి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>